ప్రపంచంలో అతి పెద్ద క్రికెట్‌ బ్యాట్‌ ఆవిష్కరణ.. | World Biggest Cricket Bat Unveiled In Hyderabad | Sakshi
Sakshi News home page

World Biggest Cricket Bat: ప్రపంచంలో అతి పెద్ద క్రికెట్‌ బ్యాట్‌ ఆవిష్కరణ.. ఎక్కడంటే..?

Published Sun, Oct 24 2021 5:58 PM | Last Updated on Sun, Oct 24 2021 7:40 PM

World Biggest Cricket Bat Unveiled In Hyderabad - Sakshi

World Biggest Cricket Bat Unveiled In Hyderabad: ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ బ్యాట్‌ హైదరాబాద్‌లోని ట్యాంక్‌ బండ్‌పై శనివారం ఆవిష్కరించబడింది. పెర్నాడ్‌ రికార్డ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో రూపొందించబడిన ఈ బ్యాట్‌ పొడవు 56.1 అడుగులు కాగా, బరువు 9 టన్నులుగా ఉంది. పాప్లర్‌ ఉడ్‌తో తయారు చేసిన ఈ బ్యాట్‌ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లో సైతం చోటు దక్కించుకుంది. 

ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో టీమిండియాకు విషెస్‌ చెబుతూ.. ప్రజల సందర్శనార్ధం ఈ బ్యాట్‌ను ట్యాంక్‌ బండ్‌పై ఉంచారు. ఈ బ్యాట్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం(హెచ్‌సీఏ) అధ్యక్షుడు అజారుద్దీన్‌, తెలంగాణ పురుపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు. 
చదవండి: భారత్‌-పాక్‌ మ్యాచ్‌ ప్రోమో.. రోమాలు నిక్కపొడుచుకుపోవాల్సిందే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement