విమానంలో హర్బజన్‌కు చేదు అనుభవం | Cricketer Harbhajan Singh Bat Missing in Indigo Flight | Sakshi
Sakshi News home page

క్రికెటర్‌ హర్బజన్‌సింగ్‌ బ్యాట్‌ చోరీ

Published Mon, Mar 9 2020 7:23 AM | Last Updated on Mon, Mar 9 2020 7:23 AM

Cricketer Harbhajan Singh Bat Missing in Indigo Flight - Sakshi

తమిళనాడు ,టీ.నగర్‌: విమానంలో క్రికెటర్‌ హర్బజన్‌సింగ్‌ క్రికెట్‌ బ్యాట్‌ శనివారం చోరీకి గురైంది. భారత క్రికెటర్‌ మాజీ స్పిన్నర్‌ హర్బజన్‌ సింగ్‌. ఇతను ప్రస్తుతం ఐపీఎల్‌ క్రికెట్‌ పోటీలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడనున్నారు. హర్బజన్‌ తమిళ చిత్రాలలోను నటిస్తున్నారు. శనివారం అతను ముంబై నుంచి కోవైకు విమానంలో క్రికెట్‌ కిట్‌తో బయలుదేరారు. విమానం కోవై చేరుకోగానే కిట్‌ బ్యాగ్‌ను పరిశీలించగా అందులోని క్రికెట్‌ బ్యాట్‌ మాయమైంది. దీంతో దిగ్భ్రాంతి చెందిన అతను వెంటనే తన ట్విట్టర్‌ ద్వారా విమాన సంస్థకు ఫిర్యాదు చేశారు. అందులో క్రికెట్‌ కిట్‌లోని బ్యాట్‌ చోరీకి గురైందని, దీనిపై విచారణ జరపాలని కోరారు. ఇందుకు విమాన సంస్థ అధికారి బ్యాట్‌ ఆచూకీ కనుగొని అప్పగిస్తామని హామీ ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement