
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లను అందించడానికి రాష్ట్రానికి చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ అవేరా ముందుకొచ్చింది. ఈ మేరకు నెడ్‌క్యాప్‌తో అవేరా ఒప్పందం కుదుర్చుకుంది. శుక్రవారం నెడ్‌క్యాప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ ఎండీ రమణా రెడ్డి, అవేరా ఫౌండర్ సీఈవో వెంకట రమణలు ఒప్పందం పత్రాలను మార్చుకున్నారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా సీఎం వైఎస్ జగన్ ‘గ్రీన్ ఆంధ్రా’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రత్యేక ధరలకు అందించే విధంగా ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం అవేరా రెటోరోసా–2 స్కూటర్‌పై రూ.10,000, రెటోరోసా లైట్ వాహనంపై రూ.5,000 వరకు ప్రత్యేక తగ్గింపు ఇవ్వనున్నట్లు వెంకట రమణ తెలిపారు. ఈ ఏడాది ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం 7,000 వాహనాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.
చదవండి: Fact Check: కుంగుతున్నది రామోజీ బుద్ధే