
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర మంత్రివర్గం తీపికబురు చెప్పినట్లు సమాచారం. తమకందాల్సిన కరువుభత్యానికి సంబంధించి ఎప్పటి నుంచో ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వారికి అందాల్సిన కరువు భత్యాలను మొత్తం మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గంలో నిర్ణయించినట్లు తెలిసింది. సోమవారం రాత్రి పొద్దుపోయేవరకు జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి.
లక్షలాది మంది ఉద్యోగులతో పాటు, పెన్షనర్లకు కూడా ప్రయోజనం చేకూరే నిర్ణయం తీసుకున్నారంటూ ఉపాధ్యాయ సంఘాలు, గెజిటెడ్ అధికారుల సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఆర్థికశాఖ నేడో రేపో విడుదల చేయనున్నట్లు ఆ వర్గాల నుంచి అందిన సమాచారం. అయితే కరువు భత్యానికి సంబంధించి ప్రభుత్వం నుంచి మంగళవారం రాత్రి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Comments
Please login to add a commentAdd a comment