
జైపూర్: గతంలో ఒంటరిగా ఉన్న మహిళలలు, బాలికలపై వేధింపులు పాల్పడిన ఘటనలు చూశాం. అయితే ఇటీవల సమాజంలో జరుగుతున్న కొన్ని ఘటనలను చూస్తే జనం మధ్యలో ఉన్న బాలికలకు వేధింపులు తప్పట్లేదు. తాజాగా 9వ తరగతి విద్యార్థిని పాఠశాల నుంచి కిడ్నాప్ చేసి ఆపై ఆమెపై లైంగిక దాడి చేశాడు 12 తరగతి విద్యార్ధి. ఈ దారుణమైన ఘటన రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల ప్రకారం.. బిచివారా గ్రామంలోని ఓ పాఠశాలలోని జనవరి 24న భోజన విరామ సమయంలో తొమ్మిదో తరగతి విద్యార్థి బయటకు రాగానే అదే పాఠశాలలో చదువుతున్న 12వ తరగతి విద్యార్థి ఆ బాలికను బలవంతంగా తన మోటార్ బైక్‌పై ఎక్కించుకుని వెళ్లిపోయాడు. ప్రధాన నిందితుడు, అంఝరా నివాసి, మైనర్‌ను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి గంటల తరబడి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సాయంత్రం ఆ బాలికను ఆమె ఇంటి వెలుపల పడేసి అక్కడ నుంచి పారిపోయాడు. బాలిక తన కుటుంబ సభ్యులకు జరిగిన దారుణాన్ని తెలియజేసింది.
దీంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాన నిందితుడిని, అదే పాఠశాలలో చదువుతున్న అతని స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలికి తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.