
జైపూర్: రోజురోజుకీ మహిళలు, బాలికలపై లైంగిక దాడులు పేరుగుతునే ఉన్నాయి. వీటిని అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకున్న అవి ఫలితాల్ని ఇవ్వడం లేదు. తాజాగా.. నిర్మానుష్య ప్రదేశంలో ఓ దివ్యాంగ బాలిక అపస్మారక స్థితిలో పడినట్లు పోలీసులకి సమాచారం అందింది. వెంటనే బాలికను చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించగా ఆమెపై అత్యాచారం జరిగినట్లు తెలిసింది. ఈ ఘటన రాజస్థాన్ అల్వార్‌లో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్వార్ ప్రాంతంలోని ఓ ఫ్లైఓవర్ పై అపస్మారక స్థితిలో ఉన్న దివ్యాంగ బాలికను కొందరు గుర్తించి పోలీసులకి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను మెరుగైన చికిత్స కోసం జైపూర్‌కు తరలించారు. బాలికకు చికిత్స చేసిన వైద్యులు ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యలు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment