టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కొత్త నిబంధనలను ప్రకటించింది. టెలికామ్ సేవల్లో నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి, నిబంధనలను మరింత కఠినతరం చేసినట్లు వెల్లడించింది. ఈ అంశంపైన క్షుణ్ణంగా పరిశీలనలు జరిపిన తరువాత కొత్త రూల్స్ జారీ చేయడం జరిగిందని బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరమ్ ఈవెంట్‌లో.. ట్రాయ్ చైర్మన్ 'అనిల్ కుమార్ లాహోటి' తెలిపారు.
ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం.. సిగ్నెల్స్ రాకుంటే యూజర్లకు పరిహారం చెల్లించాలి. సర్వీస్ ప్రొవైడర్లు తమ మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయాలని అథారిటీ వెల్లడించింది. దీనికి ఆరు నెలల గడువు కూడా ఇచ్చింది. కొత్త అప్‌గ్రేడ్స్ ద్వారా వినియోగదారులకు సరైన క్వాలిటీ సర్వీస్ లభిస్తుంది. నిబంధలనలను ఉల్లంఘించిన సంస్థలకు భారీ జరిమానాలు విధించే అవకాశం ఉందని అనిల్ కుమార్ లాహోటి పేర్కొన్నారు.
ట్రాయ్ జారీ చేసిన కొత్త క్వాలిటీ సర్వీస్ రూల్స్ ప్రకారం, జిల్లా స్థాయిలో 24 గంటల కంటే ఎక్కువ సమయం సర్వీస్ ఆగిపోయినప్పుడు టెలికామ్ ఆపరేటర్లు చందాదారులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ జరిమానా మొత్తాన్ని రూ. 50వేలు నుంచి రూ.1 లక్షకు పెంచారు.
ఇదీ చదవండి: పెట్రోల్ అవసరం లేని వాహనాలు వచ్చేస్తున్నాయి: నితిన్ గడ్కరీ
గ్రేడెడ్ పెనాల్టీ విధానం ఆధారంగా జరిమానా రూ.1 లక్ష, రూ.2 లక్షలు, రూ.5 లక్షలు, రూ.10 లక్షలుగా విభజించారు. ది స్టాండర్డ్స్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ యాక్సెస్ అండ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ రెగ్యులేషన్స్ చట్టం ప్రకారం ఈ రూల్స్ అమలులోకి వస్తాయి. ఈ కొత్త రూల్స్‌పై టెలికామ్ ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment