
మూలిగే నక్కపై తాటికాయ పడటం అంటే ఇదే.. రుణ భారంతో కొట్టుమిట్టాడుతున్న టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియాకు భారీ జరిమానా రూపంలో ట్రాయ్ షాకిచ్చింది.
ఇబ్బందికరమైన కాల్స్, SMSలను అరికట్టడంలో విఫలమైనందుకు టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ తమకు రూ. కోటి పెనాల్టీని విధించినట్లు వోడాఫోన్ ఐడియా కంపెనీ తెలిపింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (Trai) సెప్టెంబర్ 28న జరిమానా విధించినట్లు వోడాఫోన్ ఐడియా (వీఐఎల్) తాజా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్, 2018 ప్రకారం 2021 డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఫిర్యాదుల కోసం కంపెనీ నెట్‌వర్క్ ద్వారా పంపిన అన్‌సొలిసిటెడ్ కమర్షియల్ కమ్యూనికేషన్స్ (UCC)ని అరికట్టడంలో వొడాఫోన్ ఐడియా వైఫల్యం చెందినట్లు ట్రాయ్ పేర్కొంది. ఈ ఆర్డర్‌ని సమీక్షిస్తున్నామని, దీనిపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై పరిశీలిస్తున్నామని వొడాఫోన్ ఐడియా ఫైలింగ్‌లో తెలిపింది.
వొడాఫోన్ ఐడియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్ (క్యూ1)లో నికర నష్టం మరింత పెరిగి రూ. 7,840 కోట్లను తాకింది. మరోవైపు జూన్ నెలలో 12.8 లక్షల మంది యూజర్లను ఈ టెలికాం కంపెనీ కోల్పోయింది.
Comments
Please login to add a commentAdd a comment