Service quality
-
సిగ్నెల్ రాకుంటే యూజర్లకు పరిహారం!.. ట్రాయ్ కొత్త రూల్స్
టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కొత్త నిబంధనలను ప్రకటించింది. టెలికామ్ సేవల్లో నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి, నిబంధనలను మరింత కఠినతరం చేసినట్లు వెల్లడించింది. ఈ అంశంపైన క్షుణ్ణంగా పరిశీలనలు జరిపిన తరువాత కొత్త రూల్స్ జారీ చేయడం జరిగిందని బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరమ్ ఈవెంట్లో.. ట్రాయ్ చైర్మన్ 'అనిల్ కుమార్ లాహోటి' తెలిపారు.ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం.. సిగ్నెల్స్ రాకుంటే యూజర్లకు పరిహారం చెల్లించాలి. సర్వీస్ ప్రొవైడర్లు తమ మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయాలని అథారిటీ వెల్లడించింది. దీనికి ఆరు నెలల గడువు కూడా ఇచ్చింది. కొత్త అప్‌గ్రేడ్స్ ద్వారా వినియోగదారులకు సరైన క్వాలిటీ సర్వీస్ లభిస్తుంది. నిబంధలనలను ఉల్లంఘించిన సంస్థలకు భారీ జరిమానాలు విధించే అవకాశం ఉందని అనిల్ కుమార్ లాహోటి పేర్కొన్నారు.ట్రాయ్ జారీ చేసిన కొత్త క్వాలిటీ సర్వీస్ రూల్స్ ప్రకారం, జిల్లా స్థాయిలో 24 గంటల కంటే ఎక్కువ సమయం సర్వీస్ ఆగిపోయినప్పుడు టెలికామ్ ఆపరేటర్లు చందాదారులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ జరిమానా మొత్తాన్ని రూ. 50వేలు నుంచి రూ.1 లక్షకు పెంచారు.ఇదీ చదవండి: పెట్రోల్ అవసరం లేని వాహనాలు వచ్చేస్తున్నాయి: నితిన్ గడ్కరీగ్రేడెడ్ పెనాల్టీ విధానం ఆధారంగా జరిమానా రూ.1 లక్ష, రూ.2 లక్షలు, రూ.5 లక్షలు, రూ.10 లక్షలుగా విభజించారు. ది స్టాండర్డ్స్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ యాక్సెస్ అండ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ రెగ్యులేషన్స్ చట్టం ప్రకారం ఈ రూల్స్ అమలులోకి వస్తాయి. ఈ కొత్త రూల్స్‌పై టెలికామ్ ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు. -
ప్రీ డేటా ఓకే, కానీ క్వాలిటీ....
న్యూఢిల్లీ: మార్కెట్లో టెల్కోలను హడలెత్తిస్తున్న రిలయన్స్ జియోను తట్టుకునేందుకు, దిగ్గజ కంపెనీలన్నీ ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. జియో తాకిడిని తట్టుకునేందుకు, ఎయిర్ టెల్ ఇటీవలే తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం, పోస్టుపెయిడ్ కస్టమర్ల కోసం ఉచిత డేటా ప్రయోజనాలు ప్రకటించింది. పోస్ట్ పెయిడ్ కస్టమర్లకైతే ఏకంగా 30జీబీ వరకు ఉచిత డేటా అందించనున్నట్టు ప్రకటించింది. ఇలా ఇతర కంపెనీలు కూడా డేటా ప్రయోజనాలను తమ కస్టమర్ల కోసం తీసుకొచ్చాయి. ఉచిత డేటాలనైతే కంపెనీలు ప్రకటిస్తున్నప్పటికీ, ఎక్కడా కూడా ఏ కంపెనీ కూడా సర్వీసుల క్వాలిటీ గురించి ఊసైనా ఎత్తడం లేదు. ప్రమోసనల్ స్కీమ్స్ పై ఏ మేర క్వాలిటీ సర్వీసులు అందిస్తాయో కనీస గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఆపరేటర్లు అందించే స్కీమ్ లకు, వారు అందించే డెలివరీకి చాలా గ్యాప్ ఉంటుందని, వాటిని సమీక్షించడానికి కనీసం ఎలాంటి మెకానిజం లేదని వాలంటరీ ఆర్గనైజేషన్ ఇన్ ఇంటరెస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపకుడు ఎస్ఆర్ ఖన్నా ఆందోళన వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ కూడా సీరియస్ గా తీసుకుంటోంది. ప్రమోషనల్ ఆఫర్లో కూడా ఒకే విధమైన క్వాలిటీ సర్వీసులు అందించే విషయంపై ఆపరేటర్లతో చర్చించడానికి ట్రాయ్ ఈ వారంలో వారితో సమావేశమవుతోంది. ప్రమోషనల్ ఆఫర్లలో క్వాలిటీ సర్వీసులు ఆందోళనను కలిగిస్తున్నాయని, ఉచితంగా సర్వీసులు అందించడమంటే నాసిరకంగా అందించడం కాదని ట్రాయ్ అధికారి అన్నారు. త్వరలోనే ఆపరేటర్లతో మీటింగ్ నిర్వహించి దీనిపై చర్చించనున్నామని చెప్పారు. అయితే ప్రమోషనల్ ఆఫర్లలో సర్వీసుల క్వాలిటీ నాసిరకంగా ఉన్నాయనే దాన్ని టెల్కోలు ఖండిస్తున్నాయి.