న్యూఢిల్లీ: ఎస్‌టీడీ కాల్ చార్జీలు తగ్గనున్నాయి. క్యారేజీ చార్జీలను ట్రాయ్ సగానికి తగ్గించడం దీనికి కారణం. నిమిషానికి 65 పైసలుగా ఉన్న క్యారేజీ చార్జీ పరిమితిని 35 పైసలకు తగ్గించింది. దీనితో ఎస్‌టీడీ కాల్ రేట్లు తగ్గుతాయని ట్రాయ్ కార్యదర్శి చెప్పారు. ఈ మార్పు వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తుందని వివరించారు. ఒక నెట్‌వర్క్‌కు చెందిన వినియోగదారుడు వేరే నెట్‌వర్క్‌కు ఎస్‌టీడీ కాల్‌చేస్తే, ఆ వేరే నెట్‌వర్క్‌కు చెల్లించే క్యారేజీ చార్జీ.. ఎస్‌టీడీ టారిఫ్‌ల్లో కీలకం.