శేషాచలం అడవుల్లో తమిళ తంబీలు | Seshachalam the woods Tamil tambilu | Sakshi
Sakshi News home page

శేషాచలం అడవుల్లో తమిళ తంబీలు

Published Thu, Sep 19 2013 4:26 AM | Last Updated on Wed, Oct 3 2018 5:26 PM

Seshachalam the woods Tamil tambilu

 సాక్షి, తిరుపతి: ఒకప్పుడు దట్టమైన సత్యమంగళం అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్, అతని ముఠా రోజుల తరబడి అడవుల్లోనే తిష్టవేసి గంధపు చెక్కలు నరికి స్మగ్లింగ్ చేసేవారు. ఇప్పుడు అదే సీన్ తిరుపతి శేషాచల అడవుల్లో తర చూ కనబడుతోంది. అటవీశాఖ, పోలీసులు, సంయుక్త టా స్క్‌ఫోర్స్ బృందాలు దాడులు చేస్తున్నా ఎర్రచందనం దొంగ లు అడవుల్లోకి యథేచ్ఛగా వెళున్నారు.

రోజుల తరబడి అక్క డే ఉంటున్నారు. సరుకులు తీసుకెళ్లి అక్కడే వంట చేసుకుని తిని ఎర్రచందనం చెట్లను నరికేస్తున్నారు. ఇటీవల అటవీ శాఖ, పోలీసులు నిర్వహించిన కూంబింగ్‌లో ఈ విషయాలు వెలుగు చూశాయి. సిబ్బంది కొరత కారణంగా అటవీ శాఖ అధికారులు వారిని ఏమీ చేయలేకపోతున్నారు. అటవీ శాఖ ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు, స్ట్రయికింగ్ ఫోర్స్‌లు దాడులకు వెళ్లినా ఆ సమాచారం ముందుగానే స్థానిక నెట్‌వర్కు ద్వారా స్మగ్లర్లకు తెలిసిపోతోంది. స్థానికుల సహకారంతో తమిళ కూలీలు, స్మగ్లర్ల క్యాంపులు కొనసాగుతూనే ఉన్నాయి.

 వీరప్పన్‌ను తలపిస్తున్న తమిళ తంబీలు

 శేషాచలం కొండల్లోని 2వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఎ ర్రచందనం చెట్లు విస్తరించి ఉన్నాయి. చిత్తూరు జిల్లా, అర్బ న్ పోలీసు జిల్లాల పరిధిలో చామల, తిరుపతి, మామండూ రు ఫారెస్టు రేంజ్‌ల్లోనూ, రాజంపేట డివిజన్ శెట్టిపల్లె, బా లయపల్లె ప్రాంతాల్లోనూ ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. అం తర్జాతీయ మార్కెట్‌లో ఎర్రచందనం టన్ను రూ.20 లక్షల వరకు మొదటి గ్రేడ్ పలుకుతుండడంతో తమిళనాడు, కర్ణాటకకు చెందిన స్మగ్లర్లు శేషాచలం అడవుల్లో రెచ్చిపోతున్నారు. పాపవినాశనం దాటి లోతైన లోయల్లోనూ, చామల రేంజ్‌లో తలకోన దాటి ఎత్తు అయిన కొండలపైన వారం, పది రోజులు ఉండే విధంగా వంట సరుకులు, బియ్యం, మంచినీళ్లు తీసుకుని వెళుతున్నారు. అక్కడే తిష్టవేసి రాత్రిపూట యథేచ్ఛగా ఎర్రచందనం చెట్లు నేలకూల్చుతున్నారు. అక్కడి నుంచి కాలిదారిలో అటవీ సమీప గ్రామాలకు తెచ్చి లారీలు, వ్యాన్లలో లోడ్ చేసి తరలిస్తున్నారు.

 కూంబింగ్‌లతో వెలుగులోకి

 అటవీ శాఖ, పోలీసు శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న టాస్క్‌ఫోర్స్ వచ్చాక రెండున్నర నెలలుగా దట్టమైన అడవిలోకి డీఎఫ్‌వో శ్రీనివాసులు, టాస్క్‌ఫోర్స్ చీఫ్ ఉదయ్‌కుమార్ నేతృత్వంలో చామల, మామండూరు, తిరుపతి రేం జ్‌ల్లో ఎస్వీ నేషనల్ పార్కు పరిధిలో కూంబింగ్‌లు చేపట్టా రు. అదే సమయంలో పులిబోనుకు పైన ఉన్న అటవీ ప్రాం తంలో ఆర్ముడు రిజర్వు స్పెషల్ పోలీసు పార్టీ నిరంతరాయంగా కూంబింగ్ కొనసాగిస్తోంది. చామల రేంజ్‌లో కడప జిల్లా సరిహద్దులోని కొండ ప్రాంతాల నుంచి ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణాకు తెస్తుండగా 30 మందిని టాస్క్‌ఫోర్స్ పట్టుకుంది. రెండు రోజుల క్రితం మామండూరు నుంచి లోపల దట్టమైన అటవీ ప్రాంతంలో కలివిలేటి కోన వద్ద మరో 30 మంది ఎర్రచందనం నరుకుతూ కనిపించినా ఏడుగురిని మాత్రమే అటవీ శాఖ అధికారులు పట్టుకోగలిగారు. 23 మంది తప్పించుకున్నారు. సరైన వ్యూహంతో వెళ్లకపోవడం కారణంగానే విఫలమవుతున్నారన్న ఆరోపణలున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement