వేగంగా నెట్‌వర్క్ సేవలందించడంలో జియో దూసుకుపోతుంది. నెట్‌వర్క్ స్పీడ్, కవరేజ్, స్థిరమైన సర్వీసులు అందించడంలో జియో మరింత మెరుగుపడిందని ఓపెన్ సిగ్నల్ నివేదించింది. దేశంలోని టెలికాం కంపెనీలతో పోలిస్తే జియో అధికంగా 89.5 ఎంబీపీఎస్ స్పీడ్ నెట్‌వర్క్‌ను అందిస్తున్నట్లు పేర్కొంది. ‘ఇండియా మొబైల్ నెట్‌వర్క్ ఎక్స్‌పీరియన్స్’ పేరుతో విడుదల చేసిన నివేదికలో భారత టెలికాం నెట్‌వర్క్ కంపెనీల సేవలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించింది.
నివేదికలోని వివరాల ప్రకారం..రిలయన్స్ జియో గరిష్ఠంగా 89.5 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడ్ కలిగిన నెట్‌వర్క్‌ను అందిస్తుంది. ఎయిర్‌టెల్ 44.2 ఎంబీపీఎస్, వొడాఫోన్ ఐడియా 16.9 ఎంబీపీఎస్‌తో తర్వాత స్థానాల్లో నిలిచాయి. జియో నెట్‌వర్క్ స్పీడ్ ఎయిర్‌టెల్ కంటే రెండింతలు ఎక్కువగా ఉంది. ఇది స్ట్రీమింగ్, గేమింగ్, ఇతర డేటా సేవలను మరింత మెరుగ్గా అందించే అవకాశం ఉంది. జియో నెట్‌వర్క్ సేవలు చాలా మారుమూల ప్రాంతాల్లో కూడా విస్తరించాయి.
ఇదీ చదవండి: విదేశాలకు వెళ్తున్నారా? ఈ పాలసీ మీ కోసమే..
దేశీయంగా టెలికాం నెట్‌వర్క్ సేవలకు సంబంధించి కస్టమర్ల అంచనాలు పెరుగుతున్నాయి. ఆన్‌లైన్ గేమ్‌లు, వీడియో స్ట్రీమింగ్, ఇతర డేటా అవసరాల కోసం వేగంగా నెట్‌వర్క్ ఉండాలనుకుంటున్నారు. అదే సమయంలో టెలికాం కంపెనీల మధ్య పోటీ పెరుతుతోంది. దాంతో సంస్థలు మెరుగైన సర్వీసులు ఇచ్చేందుకు సన్నద్ధం అవుతున్నాయి. ఈ ఏడాది జులైలో జియోతోపాటు ఇతర కంపెనీలు టారిఫ్ రేట్లను పెంచిన విషయం తెలిసిందే. దాంతో కస్టమర్ల అట్రిషన్ రేటు(నెట్‌వర్క్ మారడం) పెరగడంతో జియో విభిన్న మార్గాలు అనుసరిస్తోంది. టారిఫ్ రేట్లను పెంచినప్పటి నుంచి నెట్‌వర్క్ స్పీడ్ తగ్గిపోయిందనే అభిప్రాయాలున్నాయి. కాబట్టి క్రమంగా నెట్‌వర్క్ స్పీడ్ పెంచుతున్నట్లు కొందరు నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment