network expansion
-
జియో స్పీడ్ ఎక్కువే: ఓపెన్ సిగ్నల్!
వేగంగా నెట్వర్క్ సేవలందించడంలో జియో దూసుకుపోతుంది. నెట్వర్క్ స్పీడ్, కవరేజ్, స్థిరమైన సర్వీసులు అందించడంలో జియో మరింత మెరుగుపడిందని ఓపెన్ సిగ్నల్ నివేదించింది. దేశంలోని టెలికాం కంపెనీలతో పోలిస్తే జియో అధికంగా 89.5 ఎంబీపీఎస్ స్పీడ్ నెట్‌వర్క్‌ను అందిస్తున్నట్లు పేర్కొంది. ‘ఇండియా మొబైల్ నెట్వర్క్ ఎక్స్పీరియన్స్’ పేరుతో విడుదల చేసిన నివేదికలో భారత టెలికాం నెట్వర్క్ కంపెనీల సేవలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించింది.నివేదికలోని వివరాల ప్రకారం..రిలయన్స్ జియో గరిష్ఠంగా 89.5 ఎంబీపీఎస్ డౌన్లోడ్ స్పీడ్ కలిగిన నెట్‌వర్క్‌ను అందిస్తుంది. ఎయిర్టెల్ 44.2 ఎంబీపీఎస్, వొడాఫోన్ ఐడియా 16.9 ఎంబీపీఎస్‌తో తర్వాత స్థానాల్లో నిలిచాయి. జియో నెట్వర్క్ స్పీడ్ ఎయిర్టెల్ కంటే రెండింతలు ఎక్కువగా ఉంది. ఇది స్ట్రీమింగ్, గేమింగ్, ఇతర డేటా సేవలను మరింత మెరుగ్గా అందించే అవకాశం ఉంది. జియో నెట్వర్క్ సేవలు చాలా మారుమూల ప్రాంతాల్లో కూడా విస్తరించాయి. ఇదీ చదవండి: విదేశాలకు వెళ్తున్నారా? ఈ పాలసీ మీ కోసమే..దేశీయంగా టెలికాం నెట్వర్క్ సేవలకు సంబంధించి కస్టమర్ల అంచనాలు పెరుగుతున్నాయి. ఆన్లైన్ గేమ్‌లు, వీడియో స్ట్రీమింగ్, ఇతర డేటా అవసరాల కోసం వేగంగా నెట్వర్క్ ఉండాలనుకుంటున్నారు. అదే సమయంలో టెలికాం కంపెనీల మధ్య పోటీ పెరుతుతోంది. దాంతో సంస్థలు మెరుగైన సర్వీసులు ఇచ్చేందుకు సన్నద్ధం అవుతున్నాయి. ఈ ఏడాది జులైలో జియోతోపాటు ఇతర కంపెనీలు టారిఫ్ రేట్లను పెంచిన విషయం తెలిసిందే. దాంతో కస్టమర్ల అట్రిషన్ రేటు(నెట్వర్క్ మారడం) పెరగడంతో జియో విభిన్న మార్గాలు అనుసరిస్తోంది. టారిఫ్ రేట్లను పెంచినప్పటి నుంచి నెట్వర్క్ స్పీడ్ తగ్గిపోయిందనే అభిప్రాయాలున్నాయి. కాబట్టి క్రమంగా నెట్వర్క్ స్పీడ్ పెంచుతున్నట్లు కొందరు నిపుణులు చెబుతున్నారు. -
వొడాఫోన్ ఐడియా భారీ కాంట్రాక్టులు
న్యూఢిల్లీ: టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) తాజాగా భారీ కాంట్రాక్టులకు తెరతీసింది. 4జీ, 5జీ నెట్వర్క్ పరికరాల కొనుగోలు కోసం రూ. 30,000 కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చింది. మూడేళ్లలో వీటిని సరఫరా చేసేందుకు దిగ్గజాలు నోకియా, ఎరిక్సన్, శామ్‌సంగ్‌లను ఎంపిక చేసుకుంది. వెరసి ఈ ఏడాది భారీ ఆర్డర్లను ఇచ్చిన టెలికం ఆపరేటర్‌గా వొడాఫోన్ ఐడియా నిలిచింది. మూడేళ్ల కాలంలో 6.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 55,000 కోట్లు) పెట్టుబడులు వెచి్చంచేందుకు కంపెనీ ప్రణాళికలు వేసిన సంగతి తెలిసిందే. వీటిలో భాగంగా తొలి దశ కింద తాజా కాంట్రాక్టులకు తెరతీసింది. మూడేళ్లలో 4జీ, 5జీ కవరేజీకి వీలుగా నోకియా, ఎరిక్సన్, శామ్‌సంగ్‌లు పరికరాలు సరఫరా చేయవలసి ఉంటుందని వొడాఫోన్ ఐడియా ప్రకటన పేర్కొంది. సరఫరాలు డిసెంబర్ క్వార్టర్ నుంచి ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. తద్వారా 4జీ కవరేజీని 1.03 బిలియన్ నుంచి 1.2 బిలియన్ల జనాభాకు పెంచడం, కీలక మార్కెట్లలో 5జీ సేవలను ప్రవేశపెట్టడం, డేటా వినియోగానికి అనుగుణంగా సామర్థ్యాన్ని విస్తరించడం చేపట్టనున్నట్లు తెలియజేసింది. తొలుత 4జీ కవరేజీని 120 కోట్ల మందికి చేరువ చేయడానికి ప్రాధాన్యత ఇస్తుంది. వీఐఎల్ 2.0కు శ్రీకారం... వీఐఎల్ 2.0 పేరుతో పెట్టుబడుల ప్రక్రియను ప్రారంభించినట్లు వొడాఫోన్ ఐడియా సీఈవో అక్షయ మూంద్రా తెలియజేశారు. నోకియా, ఎరిక్సన్ కంపెనీ ప్రారంభం నుంచి భాగస్వాములుకాగా.. తాజాగా శామ్సంగ్తో ప్రయా ణం ప్రారంభించడం ప్రోత్సాహకర అంశమని వ్యాఖ్యానించారు. 2018లో ఐడియా సెల్యులర్‌తో విలీనం అనంతరం వొడాఫోన్ ఐడియాగా ఏర్పాటైనప్పుడు 40.8 కోట్లమంది కస్టమర్లతో అతిపెద్ద టెలికం ఆపరేటర్‌గా అవతరించింది. అయితే ఆపై జియో, ఎయిర్‌టెల్‌తో ఎదురైన తీవ్ర పోటీలో వెనకబడటంతో ప్రతీ నెలా కస్టమర్ల సంఖ్య తగ్గుతూ వచి్చంది. ప్రస్తుతం వీఐఎల్ వినియోగదారుల సంఖ్య 21.5 కోట్లు. -
ప్రైవేట్ టెలికం నెట్‌వర్క్‌ల ఏర్పాటుకు డాట్ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ప్రైవేట్ టెలికం నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేయడంపై ఆసక్తి గల సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర టెలికం శాఖ (డాట్) ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. రూ. 100 కోట్ల పైగా నికర విలువ ఉండి, డాట్ నుండి నేరుగా స్పెక్ట్రం తీసుకోవడం ద్వారా క్యాప్టివ్ నాన్–పబ్లిక్ నెట్‌వర్క్‌లను (సీఎన్‌పీఎన్) నెలకొల్పాలనుకునే సంస్థలు ఆగస్టు 10 నుండి సెప్టెంబర్ 9 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. సీఎన్‌పీఎన్ ఏర్పాటు చేసే సంస్థలకు నేరుగా స్పెక్ట్రంను కేటాయించేందుకు నెలకొన్న డిమాండ్‌ను అధ్యయనం చేసేందుకు కూడా డాట్ ఈ ప్రక్రియను ఉపయోగించుకోనుంది. ‘సీఎన్‌పీఎన్ నెలకొల్పే సంస్థలు స్పెక్ట్రంను టెలికం సంస్థల నుంచి లీజుకు తీసుకోవచ్చు లేదా డాట్ నుంచి నేరుగా తీసుకోవచ్చు’ అని డాట్ తెలిపింది. ప్రస్తుత టెలికం ఆపరేటర్లు వ్యతిరేకిస్తున్నప్పటికీ సీఎన్‌పీఎన్ కోసం స్పెక్ట్రం నేరుగా కేటాయించే ప్రతిపాదనను డాట్ తెరపైకి తెచ్చింది. -
నెట్వర్క్ కంపెనీలకు ప్రధాని మోడీ పుష్
బ్రాడ్‌బ్యాండ్, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ తదితర పలు నెట్వర్క్ కంపెనీలకు ప్రధాని మోడీ ప్రసంగం జోష్‌నిస్తోంది. 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద ప్రసంగించిన ప్రధాని మోడీ.. రానున్న 1,000 రోజుల్లో దేశంలోని ప్రతీ గ్రామాన్నీ ఆప్టికల్ ఫైబర్‌తో అనుసంధానం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఐదేళ్లలో 1.5 లక్షల గ్రామ పంచాయితీలకు బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాలను కల్పించినట్లు తెలియజేశారు. భారత్‌నెట్ పేరుతో ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఆప్ఠికల్ ఫైబర్ నెట్‌వర్క్‌కు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. దీంతో నెట్వర్క్ సంబంధిత పలు లిస్టెండ్ కంపెనీల కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. జోరుగా హుషారుగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో ప్రస్తుతం పలు నెట్వర్క్ ఆధారిత కంపెనీల షేర్లు జోరు చూపుతున్నాయి. స్టెరిలైట్ టెక్నాలజీస్ 9 శాతం దూసుకెళ్లి రూ. 142ను తాకగా.. పాలీక్యాబ్ ఇండియా 3 శాతం ఎగసిరూ. 900కు చేరింది. ఈ బాటలో బిర్లా కేబుల్స్ 7.2 శాతం జంప్‌చేసి రూ. 57 వద్ద ట్రేడవుతోంది. ఇతర కౌంటర్లలో కార్డ్స్ కేబుల్ ఇండస్ట్రీస్, ఫినొలెక్స్ కేబుల్స్, అక్ష్ ఆప్టిఫైబర్, ఐటీఐ, కేఈఐ ఇండస్ట్రీస్, వింధ్యా టెలీలింక్స్, డెల్టన్ కేబుల్స్, పారామౌంట్ కమ్యూనికేషన్స్, యూనివర్శల్ కేబుల్స్ తదితరాలు 11-2 శాతం మధ్య లాభాలతో హల్చల్ చేస్తున్నాయి. -
జియోకు చెక్: రూ.32వేల కోట్లతో ప్లాన్
సాక్షి, న్యూఢిల్లీ : టెలికాం మార్కెట్లో దూసుకుపోతున్న రిలయన్స్ జియోకు చెక్ పెట్టడానికి దిగ్గజ కంపెనీలన్నీ భారీ ఎత్తున్న ప్లాన్లు వేస్తున్నాయి. టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ అయితే ఏకంగా రూ.32వేల కోట్లను వెచ్చించబోతుంది. తమ నెట్‌వర్క్‌ను విస్తరించుకోవడానికి వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ.32వేల కోట్లకు పైగా వెచ్చించాలని చూస్తున్నట్టు తెలిసింది. అదేవిధంగా రెవెన్యూ మార్కెట్ షేరులో 3-4 శాతం పాయింట్లను అధికంగా ఇది దక్కించుకోవాలనుకుంటోంది. మిగతా కంపెనీలు ఐడియా సెల్యులార్, వొడాఫోన్ ఇండియాలు కూడా జియోకు అడ్డుకట్ట వేయడానికి విలీన ప్రక్రియకు తెరతీశాయి. ఇలా జియో దెబ్బకు అల్లాడుతున్న కంపెనీలన్నీ మార్కెట్లో నిలదొక్కుకోవడానికి పలు వ్యూహాలను రచిస్తున్నాయి. జియో గతేడాది సెప్టెంబర్‌లో లాంచ్ చేసిన కమర్షియల్ సర్వీసులతో టెలికాం ఇండస్ట్రిలోని ఇంక్యుబెంట్లు భారీ ఎత్తున్న నష్టపోతున్నాయి. జియోను తట్టుకోవడానికి ఎన్ని ప్లాన్స్ వేసినా.. అవి వర్క్‌వుట్ కావడం లేదు. కానీ ఈ సారి ఎయిర్టెల్ పెద్ద ఎత్తునే ప్లాన్ వేస్తోంది.ఈ టెలికాం దిగ్గజం ఆర్పూ(ఒక్కో యూజర్‌పై ఆర్జించే కనీస రెవెన్యూ)ను కాపాడుకోవడం కోసం ధరలను మరింత తగ్గించుకోవాలనుకోవడం లేదని కూడా తెలుస్తోంది. ఎయిర్టెల్ ప్రస్తుతం పెడుతున్న పెట్టుబడులతో డేటా నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించనుంది. అంతేకాక వీటిని స్పెక్ట్రమ్ కొనుగోలుకు వెచ్చించనుంది. ఈ ఏడాది రూ.16వేల కోట్ల నుంచి రూ.17వేల కోట్ల వరకు మూలధన ఖర్చు రూపంలో వెచ్చించనున్నామని, వచ్చే రెండేళ్లలో కూడా అంతేమొత్తంలో ఇన్వెస్ట్ చేయనున్నట్టు కంపెనీకి చెందిన ఓ అధికారి తెలిపారు. ఈ కంపెనీకి క్యాష్‌ఫ్లోస్ కూడా వార్షికంగా రూ.20వేల కోట్లు మేర ఉన్నట్టు తెలిసింది. గతేడాది కూడా ఎయిర్టెల్ తన నెట్‌వర్క్‌లను అప్‌గ్రేడ్ చేసుకోవడానికి భారీగానే వెచ్చించింది. వీటికోసం రూ.15వేల కోట్లను ఖర్చుచేసింది. వొడాఫోన్ రూ.8300 కోట్లను, ఐడియా రూ.8000 కోట్లను తమ నెట్‌వర్క్‌ల అప్‌గ్రేడ్ కోసం ఖర్చు చేసినట్టు తెలిసింది.