ఎయిర్టెల్ నెట్వర్క్కు శనివారం ఉదయం అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో ఎయిర్టెల్ పనిచేయటం లేదు.
హైదరాబాద్ : ఎయిర్టెల్ నెట్వర్క్కు శనివారం ఉదయం అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో ఉదయం ఆరు గంటల నుంచి ఎయిర్టెల్ నెట్ వర్క్ పనిచేయటం లేదు. దాంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. దాంతో ఎయిర్టెల్ కస్టమర్ కేర్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఫిర్యాదు చేసినా స్పందించటం లేదని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా నెట్వర్క్ పునరుద్దరణకు మరో గంట సమయం పడుతుందని సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.