ఫిక్స్‌డ్ నెట్‌వర్క్ సాంకేతికతలో ఆవిష్కరణల కోసం నోకియా అతిపెద్ద గ్లోబల్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయనుంది. అందుకోసం భారత్‌లోని చెన్నైలో రూ.450 కోట్ల పెట్టుబడికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు పేర్కొంది. ఈమేరకు నోకియా, చెన్నై రాష్ట్ర ప్రభుత్వం పరస్పరం ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఫిన్‌లాండ్‌కు చెందిన నోకియా దేశంలో ఫిక్స్‌డ్ నెట్‌వర్క్ సాంకేతికతలో ఆవిష్కరణలు చేసేందుకు వీలుగా రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కేంద్రాన్ని చెన్నైలో ఏర్పాటు చేయలనే ఉద్దేశంతో రూ.450 కోట్లు కేటాయించబోతున్నట్లు తెలిపింది. ఈ ల్యాబ్‌లో రానున్న రోజుల్లో 10జీ, 25జీ, 50జీ, 100 జీ(జీపొన్-గిగాబిట్ ప్యాసివ్ ఆప్టికల్ నెట్‌వర్క్) నెట్‌వర్క్‌పై పరిశోధనలు చేస్తామని నోకియా ఆసియా పసిఫిక్ ఫిక్స్‌డ్ నెట్‌వర్క్‌ల హెడ్ విమల్ కుమార్ కోదండరామన్ తెలిపారు. భారత్‌తోపాటు అంతర్జాతీయంగా అడ్వాన్స్‌డ్ నెట్‌వర్క్ టెక్నాలజీ సేవలందించేలా కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అతిపెద్ద ఫిక్స్‌డ్ నెట్‌వర్క్‌ల ల్యాబ్ చెన్నైలో ఏర్పాటు చేయడంవల్ల స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని తమిళనాడు పరిశ్రమల మంత్రి టీఆర్‌బీ రాజా తెలిపారు.
ఇదీ చదవండి: ఆరోగ్య బీమా తీసుకుంటున్నారా..? ఒక్క నిమిషం..
Comments
Please login to add a commentAdd a comment