కమలా హారిస్, వాల్జ్‌లపైనా దాడి జరిగినట్లు అనుమానం
దర్యాప్తు చేపట్టామన్న అమెరికా ప్రభుత్వ వర్గాలు
వాషింగ్టన్: చైనాకు చెందిన సైబర్ నేరగాళ్లు , మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, ఆయన రన్నింగ్ మేట్ జేడీ వాన్స్‌లు వాడే ఫోన్లు, నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకున్నారని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ట్రంప్–వాన్స్‌ల ఎన్నికల ప్రచార బృందాన్ని అప్రమత్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
భారత సంతతికి చెందిన ఉపాధ్యక్షురాలు, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, ఆమె రన్నింగ్ మేట్ వాల్జ్ ఎన్నికల ప్రచారాన్ని కూడా చైనా సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారని బీబీసీ పేర్కొంది. అదే నిజమైతే, ఏ మేరకు సమాచారం నేరగాళ్ల చేతికి చిక్కి ఉంటుందనే విషయం స్పష్టత రాలేదు. అధ్యక్ష ఎన్నికల అభ్యర్థులు సైబర్ నేరగాళ్లకు లక్ష్యమయ్యారా అనే ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, ఎఫ్‌బీఐలు నిరాకరిస్తున్నాయి.
చైనాకు చెందిన సైబర్ నేరగాళ్లు దేశంలోని వాణిజ్య టెలీకమ్యూనికేషన్స్ వ్యవస్థల్లోకి దొంగచాటుగా ప్రవేశించిన విషయమై అమెరికా ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించిందని ఎఫ్‌బీఐ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ(సీఐఎస్‌ఏ) ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. అయితే, నేరగాళ్లు చేసిన ప్రయత్నాలను తాము గుర్తించామని తెలిపాయి. ఆ వెంటనే సంబంధిత సంస్థలను అప్రమత్తం చేయడంతోపాటు ఇతర బాధితులను అలెర్ట్ చేసి, అవసరమైన సహాయ సహకారాలు అందించామని ఆ ప్రకటనలో వివరించాయి.
కమర్షియల్ కమ్యూనికేషన్స్ రంగంలో సైబర్ రక్షణలను బలోపేతం చేసేందుకు, దాడులను ఎదుర్కొనేందుకు సంబంధిత విభాగాలను సమన్వయం చేస్తున్నామని ఎఫ్‌బీఐ, సీఐఎస్‌ఏ తెలిపాయి. అయితే, దీనిని ఎన్నికల ప్రచారాన్ని ప్రభావితం చేసేలా సైబర్ దాడికి జరిగిన యత్నంగా కాకుండా, గూఢచర్యంగాభావిస్తున్నామని న్యాయ విభాగం తెలిపింది.ఈ పరిణామంపై ట్రంప్ ప్రచార బృందం తీవ్రంగా స్పందించింది. ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవకుండా చేసే కుట్రగా అభివర్ణించింది. ఈ నెల మొదట్లో కూడా హ్యాకర్లు ట్రంప్, వాన్స్‌లే లక్ష్యంగా సైబర్ దాడికి పాల్పడ్డారని సంబంధిత వెరిజోన్ అనే టెలీ కమ్యూనికేషన్ సంస్థ ఆరోపించింది. సెపె్టంబర్‌లో ఇరాన్‌కు చెందిన ముగ్గురు హ్యాకర్లు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో జోక్యం చేసుకునేందుకు ప్రయతి్నంచినట్లు అమెరికా ప్రభుత్వం ఆరోపించడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment