5జీ నెట్‌వర్క్ ఎక్స్‌పీరియన్స్‌లో రిలయన్స్ జియో నెంబర్ వన్‌గా అవతరించింది. 5జీ నెట్‌వర్క్ కవరేజ్‌లో మాత్రమే కాకుండా , లభ్యతలో కూడా జియో అద్భుతమైన పనితీరును ప్రదర్శిచింది. తాజాగా ఓపెన్ సిగ్నల్ విడుదల చేసిన నివేదికలో.. ఆంధ్రప్రదేశ్ టెలికామ్ సర్కిల్ (ఆంధ్ర, తెలంగాణ) జియో అసాధారణమైన పనితీరును కనపరిచినట్లు వెల్లడించింది.
ఓపెన్ సిగ్నల్ నివేదిక ప్రకారం.. జియో 5జీ కవరేజ్ టవర్లు 66.7 శాతం నెట్‌వర్క్ లభ్యత స్కోర్‌తో దాని ప్రత్యర్థుల కంటే ముందంజలో ఉంది. దీన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లోని జియో వినియోగదారులు మూడింట రెండు వంతులు 5జీ సేవలను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద విస్తృతమైన, స్థిరమైన 5జీ కనెక్టివిటీని అందించడంలో జియో ముందంజలో ఉందని నివేదిక స్పష్టం చేస్తోంది.
5జీ కవరేజ్ ఎక్స్‌పీరియన్స్‌లో జియో.. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలలో ముందుంది. 10 పాయింట్ల స్కేల్‌పై జియో 9.0 పాయింట్ల స్కోర్‌తో.. దాని ప్రధాన ప్రత్యర్థి ఎయిర్‌టెల్ (7.1 స్కోర్) కంటే ముందు వరసలో ఉంది. జియో ఎప్పటికప్పుడు నిరంతరాయ సేవలను అందిస్తూ ముందుకు సాగుతుండటంతో వినియోగదారులు ఈ సర్వీస్ ఎక్కువగా ఉపయోగించడానికి సుముఖత చూపుతున్నారు.
జియో, ఎయిర్‌టెల్ తరువాత వోడాఫోన్ ఐడియా 3.7 పాయింట్ల స్కోర్, బీఎస్ఎన్ఎల్ 1.2 పాయింట్ల స్కోర్స్ సాధించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలో 5G కవరేజీని విస్తరించడంలో బీఎస్ఎన్ఎల్, వోడాఫోన్ ఐడియాకు సవాలుగా మారింది. అయితే ప్రస్తుతం వినియోగదారులు జియో 5జీ ద్వారా స్పీడ్ డౌన్‌లోడ్ పొందుతూ మెరుగైన నెట్‌వర్క్ అనుభవం పొందుతున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment