Jio 5G Services: మరో 14 నగరాల్లో జియో సర్వీసులు ప్రారంభం: వెల్‌కమ్‌ ఆఫర్‌ కూడా.. | Jio 5G Services In 14 More Cities Of Telangana - Sakshi
Sakshi News home page

5G Services: జోరు పెరిగిన జియో విస్తరణ: తెలంగాణాలో మరో 14 నగరాల్లో..

Published Fri, Apr 14 2023 8:35 AM | Last Updated on Fri, Apr 14 2023 10:16 AM

Jio 5g services available more towns in telangana - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రిలయన్స్‌ జియో తన ట్రూ 5జీ సర్వీసులను తెలంగాణలో మరింతగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా మరో 14 నగరాల్లో లాంఛనంగా సేవలను ప్రారంభింంది. కామారెడ్డి, మిర్యాలగూడ, గద్వాల్, సిరిసిల్ల, భువనగిరి తదితర నగరాలు ఉన్నాయి. ఈ నగరాల్లోని వినియోగదారులకు జియో వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా 1 జీబీపీఎస్‌ పైగా వేగంతో అపరిమిత డేటా లభించగలదని సంస్థ తెలిపింది. 

తెలంగాణలో ఇప్పటికే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్‌ సహా 19 నగరాల్లో ట్రూ 5జీ సర్వీసులను జియో అందిస్తోంది. కొత్తగా మొదలుపెట్టిన వాటితో కలిపి రాష్ట్రంలో మొత్తం 33 నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వ్చనట్లవుతుందని జియో తెలంగాణ సీఈవో కేసీ రెడ్డి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement