వివిద నెట్‌వర్క్ ప్రతినిధులు, ఆన్‌లైన్ సిబ్బంది సమావేశంలో మాట్లాడుతున్న జేసీ గిరీషా
చిత్తూరు (కలెక్టరేట్): ప్రజాసాధికార సర్వేలో ఎదురయ్యే నెట్‌వర్క్, సాంకేతిక లోపాలను సరిదిద్దాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీషా తెలిపారు. శుక్రవారం స్థానిక జేసీ కార్యాలయ సమావేశ మందిరంలో వివిద నెట్‌వర్క్ ప్రతినిధులు, ఆన్‌లైన్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 70 శాతం మాత్రమే సర్వే పూర్తయిందని నెట్‌వర్క్ అందక, ఆన్‌లైన్ సమస్యలతో సర్వే ముందుకుసాగడంలేదని వివరించారు. సర్వే పూర్తయ్యేందుకు నెట్‌వర్క్ ప్రతినిధులు సహకరించాలని కోరారు. దీనిపై నెట్‌వర్క్ ప్రతినిధులు మాట్లాడుతూ నెట్‌వర్క్ కెపాసిటీ పెంచే చర్యలు చేపడుతామన్నారు. అదే విధంగా నెట్‌వర్క్‌లేని గ్రామాల్లో కొత్త టవర్లను నిర్మిస్తామని జేసీకి తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ రవిప్రకాష్‌రెడ్డి, ఏపీ స్వాన్ జిల్లా మేనేజర్ సోమసుందరం, బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్, ఐడియా, డొకోమో తదితర నెట్‌వర్క్ ప్రతినిధులు పాల్గొన్నారు.