girisha
-
కలెక్టర్ సారే ఇవ్వాలి!
కడప సెవెన్‌రోడ్స్ : కడప గాంధీనగర్ ఉన్నత పాఠశాలలో సోమవారం ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ మానసిక దివ్యాంగురాలు జగనన్న విద్యాకానుక పంపిణీ కార్యక్రమం వద్దకు వచ్చింది. దానం చేయాలని కోరింది. ఆర్డీఓ ధర్మచంద్రారెడ్డి ఆమెకు రూ.వంద నోటును ఇవ్వబోగా ఆమె తిరస్కరించింది. కలెక్టర్ సారు ఇస్తేనే తీసుకుంటానని పట్టుబట్టడంతో ఆయనే స్వయంగా స్టేజీ దిగి వచ్చి రూ. 500 నోటు ఇచ్చారు. దాంతో ఆమె సంతృప్తి చెందక మరొకటి కావాలనడంతో కడప కలెక్టర్ పీఎస్ గిరీషా మరో రూ. 500 ఆమెకు ఇచ్చారు. దీంతో ఆమె కలెక్టర్ పాదాలకు నమస్కరించి చిరునవ్వుతో వెళ్లిపోయింది. -
సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌కు భారీ జరిమానా
లాక్డౌన్ ఎత్తివేయడంతో జనాలు రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కరోనా పోకముందే షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్‌కు క్యూ కడుతున్నారు. కోవిడ్ నిబంధనలను గాలికొదిలేసిన ప్రజలు ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలుగా కనిపిస్తున్నారు. ఈ క్రమంలో కోవిడ్ నిబంధనలు పాటించకపోవంతో తిరుపతిలోని సౌత్ ఇండియా షాపింగ్‌మాల్‌కు భారీ జరిమానా విధించారు. షాపింగ్‌మాల్‌ను సందర్శించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరిషా అక్కడి జనాల్ని చూసి అవాక్యయారు. షాపింగ్ మాల్‌కు వచ్చిన జనాలు మాస్క్‌లు లేకుండా భౌతిక దూరం పాటించకుండా ఉండటం గుర్తించిన కమిషనర్ మాల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో షాపింగ్ మాల్‌పై రూ.50 వేలు జరిమానా విధించారు. మరోసారి కోవిడ్ నిబంధనలు పాటించకపోతే 50 లక్షల జరిమానా విధించడంతోపాటు షాప్‌ను సీజ్ చేస్తామని కమిషనర్ బెదిరించారు. తిరుపతిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని. భౌతిక దూరం పాటించాలని కోరారు. నిబంధనలు పాటించకపోతే థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా రూల్స్ పాటించాలన్నారు. -
తిరుపతి కమిషనర్‌గా గిరీషా
సాక్షి, చిత్తూరు కలెక్టరేట్/తిరుపతి తుడా: తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్‌గా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వరిస్తున్న పీఎస్ గిరీషా నియమితులయ్యారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్‌ల బదిలీలను చేపట్టింది. ఇందులో భాగంగా కొంతమందిని శుక్రవారం రాత్రి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ బదిలీల్లో తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్‌గా ఉన్న వి.విజయ్ రామరాజును రాష్ట్ర మార్క్‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఉన్న గిరీషాను నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలానే తుడా వైస్ చైర్మన్‌గానూ గిరీషాను నియమించారు. రాష్ట్ర ఎన్నికల సంఘ కార్యాలయంలో సంయుక్త ఎన్నికల అధికారిగా పనిచేస్తున్న మార్కండేయులును జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమించారు. జాయింట్ కలెక్టర్‌గా తనదైన మార్క్ అన్ని శాఖల్లో కీలకమైన రెవెన్యూ శాఖకు ఉన్నతాధికారిగా ఉండే జాయింట్ కలెక్టర్ పోస్టులో గత రెండు సంవత్సరాల్లో గిరీషా తనదైన మార్క్‌ను సంపాదించుకున్నారు. సంవత్సరాల కొద్ది పరిష్కారం కాని భూ సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు. కబ్జాలకు గురైన ప్రభుత్వ భూముల సంరక్షణకు కృషి చేశారు. గత ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ ఆర్వో, జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారిగా విధులు నిర్వహించి ఎన్నికలను సజావుగా నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిలో భూములు కోల్పోయిన రైతులకు, ప్రజలందరికి నష్టపరిహారం అందించే విషయంలో ప్రత్యేక చొరవ చూపారు. నూతన జేసీగా మార్కాండేయులు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో సంయుక్త ఎన్నికల అధికారిగా పనిచేస్తున్న మార్కాండేయులును జిల్లా జాయింట్ కలెక్టర్ గా నియమించారు. ఆయన సోమవారం బాధ్యతలను స్వీకరించనున్నారు. ఎంతో సంతృప్తినిచ్చింది జిల్లాలో జేసీగా పనిచేయడం ఎంతో సంతృప్తినిచ్చింది. కార్పొరేషన్లో పనిచేయాలనే కోరిక ఉండేది అది ప్రస్తుతం లభించింది. సీఎం ఆశయాలను నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా విధులు నిర్వహిస్తాను. ఇన్నాళ్లు రెవెన్యూలో విధులు నిర్వహించాను. ఇకపై కార్పొరేషన్లో పనిచేయడం ఓ కొత్త అనుభూతినిస్తుందని భావిస్తున్నాను. సోమ లేదా మంగళవారంలో తిరుపతి మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరిస్తాను. – జాయింట్ కలెక్టర్ గిరీష కీలక ప్రాజెక్టులను పట్టాలెక్కించిన విజయ్‌రామరాజు 2018 మే12న తిరుపతి కమిషనర్‌గా విజయ్‌రామరాజు బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన రామజహేంద్రవరం కమిషనర్‌గా కమిషనర్‌గా పనిచేశారు. ఏడాదికి పైగా 40 రోజుల పాటు తిరుపతి కమిషనర్‌గా పనిచేశారు. ఆయన ఆధ్వర్యంలో స్మార్ట్ సిటీలోని పలు కీలక ప్రాజెక్టులను పట్టాలెక్కించారు. ఎలివేటెడ్ కారిడార్, మల్టీపర్పస్ కాంప్లెక్స, ఇండోర్ స్టేడియం, పార్కుల అభివృద్ధి, అండర్ కేబుల్ సిస్టమ్, ఈ స్కూటర్ వంటి పలు ప్రాజెక్టులను టెండర్ దశకు తీసుకెళ్లారు. స్వచ్చ సర్వేక్షన్ పోటీల్లో తిరుపతిని జాతీయ స్థాయిలో 8వ స్థానంలో నిలిపారు. ప్లాస్టిక్ నిషేధం అమలుకు కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ నేపధ్యంలో ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా తిరుపతిని నిలిపి జాతీయ స్థాయిలో మరోసారి మంచి గుర్తింపు పొందేలా చేశారు. -
సాంకేతిక సమస్యలను పరిష్కరించండి
చిత్తూరు (కలెక్టరేట్): ప్రజాసాధికార సర్వేలో ఎదురయ్యే నెట్వర్క్, సాంకేతిక లోపాలను సరిదిద్దాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీషా తెలిపారు. శుక్రవారం స్థానిక జేసీ కార్యాలయ సమావేశ మందిరంలో వివిద నెట్వర్క్ ప్రతినిధులు, ఆన్లైన్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 70 శాతం మాత్రమే సర్వే పూర్తయిందని నెట్వర్క్ అందక, ఆన్లైన్ సమస్యలతో సర్వే ముందుకుసాగడంలేదని వివరించారు. సర్వే పూర్తయ్యేందుకు నెట్వర్క్ ప్రతినిధులు సహకరించాలని కోరారు. దీనిపై నెట్వర్క్ ప్రతినిధులు మాట్లాడుతూ నెట్వర్క్ కెపాసిటీ పెంచే చర్యలు చేపడుతామన్నారు. అదే విధంగా నెట్‌వర్క్‌లేని గ్రామాల్లో కొత్త టవర్లను నిర్మిస్తామని జేసీకి తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్డీఏ పీడీ రవిప్రకాష్‌రెడ్డి, ఏపీ స్వాన్ జిల్లా మేనేజర్ సోమసుందరం, బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, ఐడియా, డొకోమో తదితర నెట్వర్క్ ప్రతినిధులు పాల్గొన్నారు.