కడప సెవెన్‌రోడ్స్ : కడప గాంధీనగర్ ఉన్నత పాఠశాలలో సోమవారం ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ మానసిక దివ్యాంగురాలు జగనన్న విద్యాకానుక పంపిణీ కార్యక్రమం వద్దకు వచ్చింది. దానం చేయాలని కోరింది. ఆర్‌డీఓ ధర్మచంద్రారెడ్డి ఆమెకు రూ.వంద నోటును ఇవ్వబోగా ఆమె తిరస్కరించింది.
కలెక్టర్ సారు ఇస్తేనే తీసుకుంటానని పట్టుబట్టడంతో ఆయనే స్వయంగా స్టేజీ దిగి వచ్చి రూ. 500 నోటు ఇచ్చారు. దాంతో ఆమె సంతృప్తి చెందక మరొకటి కావాలనడంతో కడప కలెక్టర్ పీఎస్ గిరీషా మరో రూ. 500 ఆమెకు ఇచ్చారు. దీంతో ఆమె కలెక్టర్ పాదాలకు నమస్కరించి చిరునవ్వుతో వెళ్లిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment