
లాక్‌డౌన్ ఎత్తివేయడంతో జనాలు రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కరోనా పోకముందే షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్‌కు క్యూ కడుతున్నారు. కోవిడ్ నిబంధనలను గాలికొదిలేసిన ప్రజలు ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలుగా కనిపిస్తున్నారు. ఈ క్రమంలో కోవిడ్ నిబంధనలు పాటించకపోవంతో తిరుపతిలోని సౌత్ ఇండియా షాపింగ్‌మాల్‌కు భారీ జరిమానా విధించారు. షాపింగ్‌మాల్‌ను సందర్శించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరిషా అక్కడి జనాల్ని చూసి అవాక్యయారు. షాపింగ్ మాల్‌కు వచ్చిన జనాలు మాస్క్‌లు లేకుండా భౌతిక దూరం పాటించకుండా ఉండటం గుర్తించిన కమిషనర్ మాల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో షాపింగ్ మాల్‌పై రూ.50 వేలు జరిమానా విధించారు. మరోసారి కోవిడ్ నిబంధనలు పాటించకపోతే 50 లక్షల జరిమానా విధించడంతోపాటు షాప్‌ను సీజ్ చేస్తామని కమిషనర్ బెదిరించారు. తిరుపతిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని. భౌతిక దూరం పాటించాలని కోరారు. నిబంధనలు పాటించకపోతే థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా రూల్స్ పాటించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment