
ఆషాఢమాసం ఆఫర్లను శ్రవణమాసంలోనూ కొనసాగించాలని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం నిర్ణయించింది. ఆషాఢమాసంలో కస్టమర్ల నుంచి వచ్చిన విశేష స్పందన నేపథ్యంలో... దక్షిణాది వాసులకు అత్యంత శుభప్రదమైన శ్రావణమాసంలో సైతం ఆఫర్లను కొనసాగించాలని నిర్ణయించినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. షోరూమ్‌లలో సరికొత్త స్టాక్స్‌ను కస్టమర్లకు అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. ఆషాఢమాసంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తూకం పద్దతిలో ప్రవేశపెట్టిన నంబర్ వన్ కిలో సేల్‌కు మంచి ఆదరణ లభించిందని తెలిపింది. అన్ని రకాల సరికొత్త స్టాక్‌పై 66 శాతం వరకూ ఇచ్చిన తగ్గింపు చీరల అమ్మకాన్ని భారీగా పెంచిందని కూడా పేర్కొంది.