South India Shopping Mall
-
బుట్టబొమ్మ.. వచ్చిందమ్మా
కడప కార్పొరేషన్: యువనటి పూజా హెగ్డే కడపలో తళుక్కుమన్నారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో పటేల్ రోడ్డు వద్ద సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభించేందుకు బుట్టబొమ్మ వచ్చింది. పూజను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తాను నటించిన సినిమా పాటలకు స్టెప్పులు వేసి అభిమానులను అలరించారు.యువకుల కేరింతలు, ఈలలతో ఆ ప్రాంతం సందడిగా మారింది. కమలాపురం శాసనసభ్యులు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ ఏ. మల్లికార్జునరెడ్డి, డిప్యూటీ మేయర్ ముంతాజ్‌బేగం, 13వ డివిజన్ కార్పొరేటర్ ఎం.రామలక్ష్మణ్‌రెడ్డిలు విశిష్ట అతిథు లుగా విచ్చేశారు. ఈ సందర్భంగా పూజహెగ్డే మాట్లా డుతూ కడప ప్రజలు తనపై చూపిన ప్రేమాభిమనాలను మరిచిపోలేనన్నారు. కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ వరలక్ష్మి వ్రతం పండుగ రోజు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభం కావడం సంతోషదాయకమన్నారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ డైరెక్టర్ సురేష్ సీర్ణ మాట్లాడుతూ షాపింగ్ మాల్ కడపలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు పీవీఎస్ అభినయ్, రాకేష్, కేశవ్, ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పులి సునీల్ కుమార్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు పాకా సురేష్ కుమార్ పాల్గొన్నారు. -
రెండోరోజూ ఐటీ దాడులు
సాక్షి, హైదరాబాద్: ఆదాయపన్ను శాఖ అధికారులు శుక్రవారం ఉదయం ఆర్ఎస్ బ్రదర్స్, సౌతిండియా షాపింగ్ మాల్స్‌తోపాటు లాట్ మొబైల్స్, బిగ్‌సీ సంస్థల్లో ప్రారంభించిన సోదాలు శనివారం కూడా కొనసాగించారు. ఈ సంస్థల యజమానులు పెద్దఎత్తున నిధులను రియల్ ఎస్టేట్ సంస్థలోకి మళ్లించినట్లు ఐటీ అధికారుల దాడుల్లో బయటపడ్డట్లు సమాచారం. దాడుల గురించి ఐటీ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకున్నా రెండోరోజు కూడా ఈ సోదాలు కొనసాగించారు. ఇక్కడ నుంచి వచ్చిన లాభాలను హానర్ రియల్ ఎస్టేట్ సంస్థలోకి నిధులు మళ్లించినట్లు చెబుతున్నారు. ఆదాయానికి సంబంధించి పన్నులు చెల్లించకుండా తప్పించుకోవడానికి ఈ విధంగా ఒకదానిలో నుంచి మరో సంస్థకు నిధులు మళ్లించినట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ దాడుల సమయంలో పెద్ద ఎత్తున డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకోవడమేకాక నిధుల మళ్లింపుపై అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. -
సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌కు భారీ జరిమానా
లాక్డౌన్ ఎత్తివేయడంతో జనాలు రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కరోనా పోకముందే షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్‌కు క్యూ కడుతున్నారు. కోవిడ్ నిబంధనలను గాలికొదిలేసిన ప్రజలు ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలుగా కనిపిస్తున్నారు. ఈ క్రమంలో కోవిడ్ నిబంధనలు పాటించకపోవంతో తిరుపతిలోని సౌత్ ఇండియా షాపింగ్‌మాల్‌కు భారీ జరిమానా విధించారు. షాపింగ్‌మాల్‌ను సందర్శించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరిషా అక్కడి జనాల్ని చూసి అవాక్యయారు. షాపింగ్ మాల్‌కు వచ్చిన జనాలు మాస్క్‌లు లేకుండా భౌతిక దూరం పాటించకుండా ఉండటం గుర్తించిన కమిషనర్ మాల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో షాపింగ్ మాల్‌పై రూ.50 వేలు జరిమానా విధించారు. మరోసారి కోవిడ్ నిబంధనలు పాటించకపోతే 50 లక్షల జరిమానా విధించడంతోపాటు షాప్‌ను సీజ్ చేస్తామని కమిషనర్ బెదిరించారు. తిరుపతిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని. భౌతిక దూరం పాటించాలని కోరారు. నిబంధనలు పాటించకపోతే థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా రూల్స్ పాటించాలన్నారు. -
తిరుపతిలో సౌతిండియా షాపింగ్‌మాల్‌కు రూ. 50 వేల ఫైన్
-
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ శ్రావణ సంబరాలు
ఆషాఢమాసం ఆఫర్లను శ్రవణమాసంలోనూ కొనసాగించాలని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం నిర్ణయించింది. ఆషాఢమాసంలో కస్టమర్ల నుంచి వచ్చిన విశేష స్పందన నేపథ్యంలో... దక్షిణాది వాసులకు అత్యంత శుభప్రదమైన శ్రావణమాసంలో సైతం ఆఫర్లను కొనసాగించాలని నిర్ణయించినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. షోరూమ్‌లలో సరికొత్త స్టాక్స్‌ను కస్టమర్లకు అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. ఆషాఢమాసంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తూకం పద్దతిలో ప్రవేశపెట్టిన నంబర్ వన్ కిలో సేల్కు మంచి ఆదరణ లభించిందని తెలిపింది. అన్ని రకాల సరికొత్త స్టాక్‌పై 66 శాతం వరకూ ఇచ్చిన తగ్గింపు చీరల అమ్మకాన్ని భారీగా పెంచిందని కూడా పేర్కొంది. -
రాజమండ్రిలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 20వ షోరూమ్
రాజమండ్రిలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 20వ షోరూమ్ ఏర్పాటయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హోమ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప షోరూమ్‌ను ప్రారంభించారు. పార్లమెంటు సభ్యులు మాగంటి మురళీమోహన్ కార్యక్రమానికి హాజరయ్యారు. సినీ నటులు అక్కినేని నాగార్జున, ఆయన కుమారుడు అఖిల్, సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. బ్రహ్మశ్రీ చంద్రబట్ల గణపతి శాస్త్రి షోరూమ్‌లో పసిడి విభాగాన్ని ప్రారంభించారు. -
కరీంనగర్లో అఖిల్, సమంత..!
అక్కినేని తారలు అఖిల్, సమంత కరీంనగర్లో సందడి చేశారు. ప్రస్తుతం సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌కు ప్రచార కర్తలుగా వ్యవహరిస్తున్న వీరు.. కొత్త మాల్ ఓపెనింగ్‌లో పాల్గొన్నారు. బుధవారం ఉదయం 9.30కు జరిగిన ఓపెనింగ్ కార్యక్రమంలో అఖిల్, సమంతలు పాల్గొన్నారు. వీరిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తన వదిన సమంతతో కలిసి కరీంనగర్ లోని కొత్త సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌ను ప్రారంభించటం గర్వంగా ఉందని ట్వీట్ చేశాడు అఖిల్. 11వ మాల్ ఓపెనింగ్ సందర్భంగా సంస్థ నిర్వాహకులు సురేష్, అతని కుటుంబ సభ్యులకు అఖిల్ శుభాకాంక్షలు తెలిపాడు. My privilege and honour to open the newest #southindiashoppingmall in #karimnagar with my sister in law @Samanthaprabhu2 pic.twitter.com/NHr6xaxCoM — Akhil Akkineni (@AkhilAkkineni8) 5 July 2017 Congrats to my brother Suresh and his whole family for this incredible growth. 11th mall in no time. Keep going rockstar ! God bless :) pic.twitter.com/5o1UEL80A5 — Akhil Akkineni (@AkhilAkkineni8) 5 July 2017 -
కాబోయే వదినా మరుదులు.. కనువిందు
తారా తోరణం కనువిందుగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సమంత, అఖిల్ రాకతో వెల్లివిరిసిన కోలాహలం షాపింగ్ మాల్లో ఇద్దరు స్టార్ల సందడి కాబోయే వదినా మరుదులు, సినీ నటులు సమంత, అఖిల్‌లు శుక్రవారం విశాఖలో సందడి చేశారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న వారిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. విశాఖపట్నం : ఆర్థిక, వాణిజ్య రాజధానిగా విఖ్యాతి పొందిన విశాఖలో వినియోగదారులకు మరో రసవత్తర షాపింగ్ అనుభవానికి శ్రీకారం చుట్టినట్టరుుంది. తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది స్టోర్లతో తెలుగువారి ఆదరాన్ని చూరగొన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ విశాఖలో శుక్రవారం పదో అడుగు వేసింది. నయనమనోహర రీతిలో సాగిన కార్యక్రమంలో షాపింగ్‌మాల్‌కు తెర తొలిగింది. యువ హీరో అక్కినేని అఖిల్, అందాల నటి సమంతల సమక్షంలో మంత్రి గంటా శ్రీనివాసరావు జగదాంబ సెంటర్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అఖిల్, సమంత విశాఖ వాసులకు వినూత్న వస్త్ర సోయగాలను పరిచయం చేశారు. షాపింగ్ మాల్లో కలియ తిరిగారు. ఆరేళ్ల క్రితం హైదరాబాద్‌లోని కొత్తపేటలో ఆరంభమైన సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో దేశంలోని విభిన్న సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అఖిల్ అన్నారు. ఇలాంటి మాల్ విశాఖకు గర్వకారణమన్నారు. సంస్థ మేనేజింగ్ డెరైక్టర్లు సురేష్, స్పందన, అభినయ్, రాకేశ్, కేశవ్‌లు విశాఖ వాసులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్సీ ఎమ్‌వీవీఎస్ మూర్తి, ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్, విష్ణుకుమార్ రాజు, రామకృష్ణబాబు, గణబాబు, పల్లా శ్రీనివాసరావు, బం డారు సత్యనారాయణమూర్తి, ఎంవీఆర్, సీఎంఆర్ షోరూమ్‌ల అధినేత ఎమ్‌వి రమణ పాల్గొన్నారు.కాగా హీరో అఖిల్, హీరోరుున్ సమంతలను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. చుట్టుప్రక్కల భవనాలు ఎక్కిమరీ వారిని చూసేందుకు ప్రయత్నించారు. సమంత నిండైన చీరకట్టులో ఆకట్టుకున్నారు. అఖిల్ ఫ్యాషన్ ఐకాన్‌గా అందరి దృష్టినీ ఆకర్షించారు. -
విశాఖలో సౌత్ఇండియా షాపింగ్‌మాల్ ప్రారంభం
హైదరాబాద్: సౌత్ఇండియా షాపింగ్‌మాల్ తాజాగా విశాఖపట్నంలోని జగదాంబ సెంటర్లో కొత్త షోరూమ్‌ను ప్రారంభించింది. ఏపీ మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ షోరూమ్‌ను ప్రారంభించారు. షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏపీ హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, నటుడు అఖిల్ అక్కినేని, నటి సమంత సహా పలువురు ప్రముఖుల పాల్గొన్నారు. అద్భుతమైన షాపింగ్ అనుభవాన్ని అన్ని వర్గాల ప్రజలకు అందిచడమే తమ లక్ష్యమని సంస్థ మేనేజింగ్ డెరైక్టర్లు సురేశ్, స్పందన, అభినయ్, రాకేశ్, కేశవ్‌లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాంప్రదాయశైలి మొదలుకొని ఆధునిక జీవనశైలిని ప్రతిబింబించే అన్ని రకాల వైవిధ్యభరితమైన వస్త్రాలను అందించడం సౌత్ఇండియా షాపింగ్‌మాల్ ప్రత్యేకతని అఖిల్ అక్కినేని తెలిపారు. -
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కొత్త షోరూమ్ ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కొత్త ఔట్‌లెట్‌ను హైదరాబాద్‌లోని సోమాజిగూడలో ఏర్పాటు చేసింది. సినీతారలు అఖిల్ అక్కినేని, సమంత ఈ స్టోర్‌ను గురువారం ప్రారంభించారు. ఇప్పటికే సంస్థ హైదరాబాద్‌లో కొత్తపేట్, ప్యాట్నీ సెంటర్, కూకట్పల్లి, అమీర్‌పేట్, గచ్చిబౌలి, అత్తాపూర్‌తోపాటు విజయవాడ, గుంటూరులోనూ ఔట్లెట్లను నిర్వహిస్తోంది. ఒకట్రెండు నెలల్లో సికింద్రాబాద్ పార్క్లేన్తోపాటు వైజాగ్‌లో సెంటర్లను ప్రారంభించనున్నట్టు సంస్థ డెరైక్టర్ సురేష్ సీర్న తెలిపారు. డెరైక్టర్లు స్పందన, అభినయ్, రాకేష్, కేషవ్తో కలిసి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఆరేళ్లలోనే నంబర్ 1 ఫ్యామిలీ షాపింగ్ మాల్గా ఎదిగామని వివరించారు. మరిన్ని నగరాలకు విస్తరిస్తామని చెప్పారు. -
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కొత్త షోరూమ్
హైదరాబాద్: సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మరో షోరూమ్‌ను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని అత్తాపూర్ మెయిన్ రోడ్డులో బుధవారం అతిపెద్ద ఫ్యామిలీ షాపింగ్ మాల్‌ను... సినీ హీరో అఖిల్ అక్కినేని, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రారంభించారు. హైదరాబాద్ కొత్తపేటలో మొదటి షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన తర్వాత ఐదేళ్లలో కూకట్పల్లి, అమీర్‌పేట్, గచ్చిబౌలి, విజయవాడ, గుంటూరు వంటి ప్రాంతాలకు విస్తరించిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్... అతిపెద్ద మాల్స్‌లో ఒకటిగా ఎదిగింది. తెలుగు రాష్ట్రాల్లో మరింతగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు ఈ సందర్భంగా చెప్పారు. -
గుంటూరులో అఖిల్, సమంత సందడి
-
బ్రాండ్ అంబాసిడర్‌గా అఖిల్
-
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్రాండ్ అంబాసిడర్‌గా అఖిల్
హైదరాబాద్: రిటైల్ రంగంలో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్రాండ్ అంబాసిడర్‌గా అఖిల్ అక్కినేని నియమితులయ్యారు. రిటైల్‌లో వేగంగా దూసుకుపోతున్న బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించడం గర్వంగా ఉందని ఈ సందర్భంగా అఖిల్ అన్నారు. శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అందరికీ అభిమాన షాపింగ్ మాల్ అని చెప్పారు. యువ కస్టమర్లతో అనుసంధానానికి అఖిల్ సరైన జోడి అని సంస్థ ఎండీ సురేశ్ సీర్న అభిప్రాయపడ్డారు. అయిదేళ్లలో నంబర్ వన్ ఫ్యామిలీ షాపింగ్ మాల్గా సంస్థ రూపుదిద్దుకుందని డెరైక్టర్ స్పందన పొట్టి తెలిపారు. హైదరాబాద్‌లోని కొత్తపేటలో తొలి మాల్తో ప్రారంభమైన సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌కు కూకట్పల్లి, అమీర్‌పేటతోపాటు విజయవాడలో స్టోర్లు ఉన్నాయి. ఇంటిల్లిపాదికీ అవసరమైన దుస్తులు, యాక్సెసరీస్ కేంద్రంగా వీటిని మలిచింది. త్వరలో హైదరాబాద్‌లోని అత్తాపూర్‌తోపాటు గుంటూరులో ఔట్లెట్లను తెరవనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన పట్టణాల్లో ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు సంస్థ ప్రకటించింది. మీడియా సమావేశంలో రాకేశ్, అభినయ్, కేశవ్ పాల్గొన్నారు. -
సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ ‘బిగ్ ఆషాఢం సేల్స్’
హైదరాబాద్: ప్రముఖ వస్త్రాభరణాల సంస్థ సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ‘బిగ్ ఆషాఢం సేల్స్’ పేరుతో వినియోగదారుల కోసం ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద మగవారి, మహిళల, చిన్నారుల వస్త్రాల ధరలపై 66 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్ కంచి ఉప్పాడ, ధర్మవరం, పోచంపల్లి, గద్వాల్, కోయంబత్తూర్ పట్టు చీరలపై కూడా వర్తిస్తుందని పేర్కొంది. -
షాపింగ్ మాల్ ప్రారంభించిన సమంత
-
‘సౌత్ ఇండియా’ అంబాసిడర్‌గా సమంత
సాక్షి, సిటీబ్యూరో: వస్త్ర వ్యాపారరంగంలో వినూత్న సంచనాలు సృష్టిస్తున్న వస్త్ర విక్రయు సంస్థ సౌత్ ఇండియూ షాపింగ్ వూల్ బ్రాండ్ అంబాసిడర్‌గా సినీనటి సవుంత నియుమితులయ్యూరు. ఈ మేరకు ఆ సంస్థ యూజవూన్యం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. 2011లో నగరంలోని కొత్తపేటలో తొలి షోరూంను ప్రారంభించిన సౌత్ ఇండియూ సంస్థ అనతి కాలంలోనే సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్, కూకట్‌పల్లితో పాటు విజయువాడలలో షోరూంలను ఏర్పాటు చేసి ప్రజాదరణ చూరగొందని యూజవూన్యం పేర్కొంది. ఉమెన్స్వేర్, మెన్స్‌వేర్, కిడ్స్వేర్లతో పాటు అన్ని రకాల ఆధునాత ఫ్యాషన్ వస్త్రాలను అందించి, వస్త్ర ప్రేమికులను అలరిస్తోందని వివరించింది. టాలీవుడ్లో సంచలనం సృష్టిస్తున్న సవుంతను తవు సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియుమించుకోవటం వ్యాపార అభివృద్ధికి వురింత తోడ్పడుతుందని వెల్లడించింది.