కాబోయే వదినా మరుదులు.. కనువిందు | South India Shopping Mall Opening | Sakshi
Sakshi News home page

కాబోయే వదినా మరుదులు.. కనువిందు

Published Sat, Dec 3 2016 4:29 AM | Last Updated on Mon, Sep 4 2017 9:44 PM

కాబోయే వదినా మరుదులు.. కనువిందు

కాబోయే వదినా మరుదులు.. కనువిందు

తారా తోరణం

  • కనువిందుగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం
  • సమంత, అఖిల్ రాకతో వెల్లివిరిసిన కోలాహలం
  • షాపింగ్ మాల్‌లో ఇద్దరు స్టార్‌ల సందడి

కాబోయే వదినా మరుదులు, సినీ నటులు సమంత, అఖిల్‌లు శుక్రవారం విశాఖలో సందడి చేశారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న వారిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.

విశాఖపట్నం : ఆర్థిక, వాణిజ్య రాజధానిగా విఖ్యాతి పొందిన విశాఖలో వినియోగదారులకు మరో రసవత్తర షాపింగ్ అనుభవానికి శ్రీకారం చుట్టినట్టరుుంది. తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది స్టోర్లతో తెలుగువారి ఆదరాన్ని చూరగొన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ విశాఖలో శుక్రవారం పదో అడుగు వేసింది. నయనమనోహర రీతిలో సాగిన కార్యక్రమంలో షాపింగ్‌మాల్‌కు తెర తొలిగింది. యువ హీరో అక్కినేని అఖిల్, అందాల నటి సమంతల సమక్షంలో మంత్రి గంటా శ్రీనివాసరావు జగదాంబ సెంటర్‌లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అఖిల్, సమంత విశాఖ వాసులకు వినూత్న వస్త్ర సోయగాలను పరిచయం చేశారు. షాపింగ్ మాల్‌లో కలియ తిరిగారు. ఆరేళ్ల క్రితం హైదరాబాద్‌లోని కొత్తపేటలో ఆరంభమైన సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో దేశంలోని విభిన్న సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అఖిల్ అన్నారు. ఇలాంటి మాల్ విశాఖకు గర్వకారణమన్నారు. సంస్థ మేనేజింగ్ డెరైక్టర్లు సురేష్, స్పందన, అభినయ్, రాకేశ్, కేశవ్‌లు విశాఖ వాసులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్సీ ఎమ్‌వీవీఎస్ మూర్తి, ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్, విష్ణుకుమార్ రాజు, రామకృష్ణబాబు, గణబాబు, పల్లా శ్రీనివాసరావు, బం డారు సత్యనారాయణమూర్తి, ఎంవీఆర్, సీఎంఆర్ షోరూమ్‌ల అధినేత ఎమ్‌వి రమణ పాల్గొన్నారు.కాగా హీరో అఖిల్, హీరోరుున్ సమంతలను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. చుట్టుప్రక్కల భవనాలు ఎక్కిమరీ వారిని చూసేందుకు ప్రయత్నించారు. సమంత నిండైన చీరకట్టులో ఆకట్టుకున్నారు. అఖిల్ ఫ్యాషన్ ఐకాన్‌గా అందరి దృష్టినీ ఆకర్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement