ప్రపంచంలో రెండో స్థానానికి భారత్‌ | India Now World's 2nd Largest 5G Mobile Market | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో రెండో స్థానానికి భారత్‌

Published Sun, Sep 8 2024 6:51 AM | Last Updated on Sun, Sep 8 2024 1:04 PM

India Now World's 2nd Largest 5G Mobile Market

అమెరికాను వెనక్కి నెట్టి భారత్ తొలిసారిగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద 5జీ మొబైల్‌ మార్కెట్‌గా అవతరించింది. గ్లోబల్‌గా 5జీ మొబైళ్ల వాడకంలో గతేడాదితో పోలిస్తే 2024 మొదటి అర్ధ భాగంలో 20 శాతం పెరిగిందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక తెలిపింది. 5జీ ఫోన్లలో యాపిల్‌ మొబైళ్లను ఎక్కువగా వాడుతున్నారని పేర్కొంది.

కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం..ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా 5జీ మొబైళ్లు వాడుతున్న దేశాల్లో అమెరికా తర్వాత భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న చైనాను వెనక్కి నెట్టి భారత్‌ ఒక స్థానం ముందుకు చేరింది. 5జీ ఫోన్లలో ఎక్కువగా యాపిల్‌ మొబైళ్లను వాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కేటగిరీలో 25 శాతం కంటే ఎక్కువ వాటా యాపిల్‌ సొంతం చేసుకుంది. ఐఫోన్ 15, 14 సిరీస్‌ల్లో ఈ సాంకేతికతను ఎక్కువగా వాడుతున్నారు.

బడ్జెట్ విభాగంలో ఎక్కువగా షావోమీ, వివో, శామ్‌సంగ్‌ ఇతర బ్రాండ్‌లకు చెందిన మొబైళ్లను వాడుతున్నారు. 5జీ వాడుతున్నవారిలో 21 శాతం మంది శామ్‌సంగ్‌ గెలాక్సీ ఏ సిరీస్, ఎస్‌24 సిరీస్‌లను ఉపయోగిస్తునారు. ఇప్పటికే ఈ టెక్నాలజీ కొన్ని ప్రాంతాల్లో వాడుతున్నా పూర్తిస్థాయిలో ఇంకా దాన్ని వినియోగించట్లేదు. 4జీ కంటే కొన్ని రెట్ల వేగంతో ఇంటర్నెట్‌ పనిచేస్తుంది. 4జీలో ఒక సినిమా డౌన్‌లోడ్‌ కావాలంటే కొన్ని నిమిషాలు పడితే.. ఇందులో రెప్పపాటులోనే అల్ట్రా హెచ్‌డీ సినిమాలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఇదీ చదవండి: అమెరికాకు కమల్ హాసన్: ఆ కోర్సు నేర్చుకోవడానికే..    

ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే వీఆర్‌, ఏఆర్‌ సాంకేతికతలో వేగం పెరగనుంది. భద్రతతో కూడిన రవాణా వ్యవస్థ, రిమోట్‌ ప్రాంతాలకు ఆరోగ్యసేవలు, వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగం, సరకు రవాణాలో డిజిటల్‌ సేవలు వంటి ఎన్నో అంశాల్లో 5జీ కీలకం కానుంది. రిమోట్‌ ఆధారిత సేవలు అందుబాటులోకి రానున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement