
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కస్టమర్లకు మరింత మెరుగైన 4జీ సర్వీసులను అందించేందుకు నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేసుకున్నట్లు టెలికం సంస్థ వొడాఫోన్-ఐడియా (వీఐ) వెల్లడించింది. 1800 మెగాహెట్జ్ రేడియో తరంగాలను రెట్టింపు స్థాయిలో వినియోగంలోకి తేవడంతో డేటా డౌన్‌లోడ్, అప్‌లోడింగ్ మరింతగా వేగవంతంగా ఉంటుందని పేర్కొంది.
తెలుగు రాష్ట్రాల్లో 4జీకి సంబంధించి సమర్ధమంతమైన 2500 మెగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రం ఉన్న ఏకైక ప్రైవేట్ టెల్కో తమదేనని వివరించింది. 2018 సెప్టెంబర్ నుంచి 11035 బ్రాడ్‌బ్యాండ్ టవర్లను ఏర్పాటు/అప్‌గ్రేడ్ చేసినట్లు కంపెనీ క్లస్టర్ బిజినెస్ హెడ్ సిద్ధార్థ జైన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment