
5జీ నెట్‌వర్క్‌లో రిలయన్స్ జియో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వివరాల ప్రకారం.. బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో దేశంలోనే అత్యంత వేగవంతమైన 5జీ నెట్‌వర్క్‌ను రూపొందించడానికి, అల్ట్రా-హై స్పీడ్ ఇంటర్నెట్‌ను అందించడానికి దాదాపు 1 లక్ష టెలికాం టవర్‌లను నిర్మించింది. ఇది దాని సమీప ప్రత్యర్థి కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ.
ఇదీ చదవండి: ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్ సేల్ సృష్టికర్త.. మింత్రాకు సీఈవో.. ఈ సూపర్ ఉమన్!
డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నేషనల్ ఈఎంఎఫ్ పోర్టల్‌లో ఉంచిన రోజువారీ స్థితి నివేదిక ప్రకారం.. జియో రెండు ఫ్రీక్వెన్సీలలో (700 MHz, 3,500 MHz) 99,897 బేస్ ట్రాన్స్‌సీవర్ స్టేషన్‌లను (బీటీఎస్) ఇన్‌స్టాల్ చేసింది. మరోవైపు ఎయిర్‌టెల్‌కు 22,219 బీటీఎస్ లు ఉన్నాయి. ప్రతి బేస్ స్టేషన్‌కు జియోకు 3 సెల్ సైట్‌లు ఉండగా ఎయిర్‌టెల్‌కు 2 మాత్రమే ఉన్నట్లు పీటీఐ వార్తా సంస్థ ఇటీవల పేర్కొంది.
ఇదీ చదవండి: 5జీ అన్‌లిమిటెడ్ డేటా: ఎయిర్‌టెల్‌లో అదిరిపోయే ప్లాన్‌లు!
ఇంటర్నెట్ స్పీడ్‌కు, సెల్ సైట్‌లు, టవర్‌లకు పరస్పర సంబంధం ఉంటుంది. జియో ఉత్తమ ఇంటర్నెట్ సగటు వేగం సెకనుకు 506 మెగాబైట్లు (Mbps) కాగా ఎయిర్‌టెల్ యావరేజ్ ఇంటర్నెట్ స్పీడ్ 268 Mbps అని ఇంటెలిజెన్స్, కనెక్టివిటీ ఇన్‌సైట్ గ్లోబల్ లీడర్ అయిన ఊక్లా గత ఫిబ్రవరి నెలలో నివేదించింది.
Comments
Please login to add a commentAdd a comment