cell towers
-
మారుమూలనా హల్‘సెల్’
సాక్షి, అమరావతి: మారుమూల గిరిజన ప్రాంతాలకు సమర్థవంతమైన టెలికాం సేవలందించడంతో పాటు సంక్షేమాభివృద్ధి పథకాలు ప్రతి ఇంటికి పారదర్శకంగా అందాలన్న తపన, తాపత్రయంతో అడుగులు వేగంగా వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా దాదాపు రూ.400 కోట్లతో 400 సెల్ టవర్లను నిర్మించామని తెలిపారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వాటిని వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 400 సెల్ టవర్ల ద్వారా 2.42 లక్షల మందికి ప్రయోజనం చేకూరిందన్నారు. ప్రధానంగా అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ప్రకాశం, ఏలూరు, శ్రీకాకుళం, కాకినాడ జిల్లాల్లోని మారు మూల ప్రాంతాల వారు ఫోన్లలో మాట్లాడే వీలు కలుగుతోందన్నారు. ప్రస్తుతం ప్రారంభించిన టవర్ల ద్వారా 944 గ్రామాలకు కనెక్టివిటీ ఏర్పడుతుందని చెప్పారు. మొత్తంగా రూ.3,119 కోట్లతో 2,900 టవర్లను ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. తద్వారా 5,549 ఆవాసాలను కనెక్టివిటీలోకి తీసుకొచ్చేందుకు మార్గం ఏర్పడుతుందని తెలిపారు. దీన్ని సఫలీకృతం చేసేందుకు కేంద్రంతో మాట్లాడి.. ఇందులో భాగస్వామ్యం అయ్యేలా ఒప్పించామన్నారు. సెల్ టవర్ల ఏర్పాటుకు అవసరమైన భూములను 2,900 లొకేషన్లలో ఇప్పటికే ఇచ్చామని స్పష్టం చేశారు. ‘ఎటువంటి ఇబ్బంది లేకుండా సెల్ టవర్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చాం. పవర్ కనెక్షన్‌కు చర్యలు తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయాల్సినవన్నీ రెట్టించిన వేగంతో చేశాం. టవర్ల నిర్మాణ కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. దేవుడు ఆశీర్వదిస్తే ఇదే మాదిరిగా ప్రతి 3 నెలలకొకసారి...400 నుంచి 500 టవర్ల నిర్మాణం పూర్తి చేసి అన్నింటినీ అందుబాటులోకి తీసుకొస్తాం. మరో ఏడాది కాలంలో అన్ని టవర్ల నిర్మాణం పూర్తి చేస్తాం’ అని తెలిపారు. మారుమూల ఆవాసాల్లో టీవీలు, ఫోన్లు సెల్ టవర్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో.. కనెక్టివిటీ లేని ఆవాసాలను సమాజంతో కనెక్ట్ చేసే కార్యక్రమం జరుగుతోందని.. టీవీలు, ఫోన్లు పనిచేస్తాయని సీఎం వైఎస్ జగన్ అన్నారు. మనం ఇచ్చే పథకాలకు సంబంధించి వివరాలన్నింటినీ వెంటనే ఆన్లైన్లో నమోదు చేసే కార్యక్రమం వేగవంతంగా జరుగుతుందని చెప్పారు. మనం బటన్ నొక్కిన వెంటనే వాళ్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ కావడం కూడా అంతే వేగంగా జరుగుతుందన్నారు. వెంటనే వాళ్లు చూసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇవన్నీ వేగవంతంగా, ఎఫెక్టివ్‌గా, పారదర్శకంగా జరగడం కోసమే ఈ కనెక్టివిటీ చాలా అవసరంగా భావించి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకే వ్యవస్థ, విలేజ్ క్లినిక్‌లు, నాడు–నేడుతో బాగు పడుతున్న ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు.. ఇవన్నీ గ్రామ రూపురేఖలను మార్చే దిశగా పడుతున్న అడుగులని, ఈ నేపథ్యంలో కనెక్టివిటీ అన్నది అత్యంత ఉపయోగకరమైన అంశం అవుతుందన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించిన సీఎం క్యాంపు కార్యాలయంలో ఐటీ, పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్, కమ్యూనికేషన్స్ (ఐటీ శాఖ) డైరెక్టర్ సి చంద్రశేఖర్ రెడ్డి, భారతీ ఎయిర్టెల్, రిలయెన్స్ సంస్థల ప్రతినిధులు.. డుంబ్రిగుడ మండలం ఈదులపాలెంలో పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త మత్స్యరాస విశ్వేశ్వరరాజు, కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎస్పీ తుహిన్‌సిన్హా, సబ్‌కలెక్టర్ «ధాత్రిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. గతంలో ఫోన్ చేయాలంటే కొండ ఎక్కాల్సి వచ్చేది సార్.. మేం గతంలో చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. గతంలో ఫోన్ చేయాలంటే కొండల పైకి ఎక్కాల్సి వచ్చేది. ఇప్పుడు మా గ్రామంలోనే సెల్ టవర్ ఏర్పాటు చేశారు. సిగ్నల్ బాగా వస్తోంది. మా గ్రామస్తులందరూ సంతోషంగా ఉన్నారు. మాకు గతంలో సచివాలయం అంటే, కలెక్టర్ అంటే, వలంటీర్ అంటే తెలీదు. ఇప్పుడు అందరి గురించి తెలిసింది. జగనన్న మా బాధలు గమనించి మాకు సాయం చేస్తున్నారు. గతంలో రోడ్లు లేవు. ఇప్పుడు చక్కటి రోడ్లు వేశారు. మీరు (సీఎం) ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు మాకు అందుతున్నాయి. మీరు మా వెంట ఉన్నామన్న భరోసా ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. మీ పథకాల ద్వారా లబ్ధి పొంది మా కాళ్లపై మేం నిలబడ్డాం. మేమంతా కూడా మళ్లీ మీరే రావాలని కోరుకుంటున్నాం. గతంలో మీరు పాడేరు వచ్చినప్పుడు దగ్గర నుంచి చూడలేకపోయాను. ఇప్పుడు నేరుగా మీతో మాట్లాడే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. – చిట్టెమ్మ, గిరిజన మహిళ, పాడేరు మండలం, ఏఎస్ఆర్ జిల్లా ఐదు కిలోమీటర్లు వెళ్లాల్సిన బాధ తప్పింది అన్నా.. మా గిరిజన గ్రామాలకు ఇన్నాళ్లూ ఫోన్ సిగ్నల్ లేదు. 5 కిలోమీటర్లు వెళ్లి ఫోన్ చేయాల్సి వచ్చేది. ఏదైనా ప్రమాదం జరిగినా అంబులెన్స్ వాళ్లకు చెప్పడానికి కూడా ఫోన్ సిగ్నల్ ఉండేది కాదు. మా బంధువుల కష్టసుఖాలు తెలిసేవి కాదు. కానీ ఇప్పుడు నేరుగా వారితో మాట్లాడుతున్నాం. మా పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు. నేరుగా టీచర్స్‌తో మాట్లాడుతున్నాం. ఇదివరకు గవర్నమెంట్ స్కీమ్స్ గురించి తెలిసేది కాదు. ఇప్పుడు నేరుగా జగనన్నకు చెబుదాం నెంబర్ 1902కు కాల్ చేసి మాట్లాడగానే మా సమస్య పరిష్కారం అవుతోంది. ఆరోగ్యశ్రీ యాప్, దిశ యాప్ విలువ తెలిసింది. మా సచివాలయంలో ఇదివరకు సిగ్నల్ లేక ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు మీ చొరవ వల్ల ఇంటి నుంచే అన్నీ తెలుసుకుంటున్నాం. ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా ఊళ్లోనే అన్ని సేవలు అందుతున్నాయి. మీ వల్ల అందరం చాలా సంతోషంగా ఉంటున్నాం. – చలపతిరావు, గిరిజనుడు, పార్వతీపురం మన్యం జిల్లా -
మారుమూల గిరిజన ప్రాంతాలకు సమర్థవంతమైన టెలికాం సేవలు
-
మారుమూల గిరిజన ప్రాంతాలకు సమర్థవంతమైన టెలికాం సేవలు
-
చంద్రబాబు, నారా లోకేష్‌లకు ఎంపీ కేశినేని నాని మాస్ వార్నింగ్
-
300 సెల్‌టవర్లను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 సెల్‌టవర్లను క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి గురువారం ప్రారంభించారు. మారుమూల గిరిజన ప్రాంతాలకు సమర్థవంతమైన టెలికాం సేవలు అందించేందుకు ఎయిర్టెల్ ఆధ్వర్యంలో 136 , జియో ఆధ్వర్యంలో 164 టవర్లు ఏర్పాటు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 246, పార్వతీపురం మన్యం జిల్లాలో 44, ప్రకాశంలో 4, ఏలూరులో 3, శ్రీకాకుళంలో 2, కాకినాడలో 1 టవర్ ఏర్పాటయ్యాయి. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ‘‘ఇవాళ 300 టవర్లు, జూన్‌లో 100 టవర్లు ఏర్పాటు చేశారు. దాదాపు 400 కోట్లు ఖర్చు చేశారు. 400 టవర్ల ఏర్పాటు ద్వారా 2.42 లక్షల మందికి ఉపయోగకరం. ఇవాళ ఏర్పాటు చేసిన టవర్ల ద్వారా 2 లక్షల మందికి ఉపయోగం. మొత్తంగా కలిపి 2887 టవర్లను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా 3,119 కోట్లు ఖర్చు చేస్తున్నాం’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘టవర్లకు అవసరమైన భూములను వెంటనే అప్పగించడం జరిగింది. 5,549 గ్రామాలకు పూర్తి మొబైల్ టెలికాం సేవలు అందుతాయి. అత్యంత మారుమూల ప్రాంతాలు నెట్వర్క్ పరిధిలోకి వస్తాయి. సమాచార సంబంధాలు బాగా మెరుగుపడతాయి. ఈ ప్రాంతాలకు పథకాల అమలు మరింత సులభతరం అవుతుంది. వేగంగా, పారదర్శకంగా పనులు ముందుకు సాగుతాయి. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, ఇంగ్లిషు మీడియం స్కూల్స్ ఇవన్నీకూడా గ్రామ రూపురేఖలను మారుస్తాయి. ఈ ప్రాంతాల్లో టెలికాం సేవలు కారణంగా ఇవి మరింత బలోపేతంగా నడుస్తాయి’’ అని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, ఐటీశాఖ కార్యదర్శి కోన శశిధర్, కమ్యూనికేషన్స్ (ఐటీశాఖ) డైరెక్టర్ సి చంద్రశేఖర్ రెడ్డి, భారతీ ఎయిర్టెల్, రిలయెన్స్ సంస్ధల ప్రతినిధులు పాల్గొన్నారు. వర్చువల్ సమావేశంలో గిరిజనులు మాట్లాడారు. ఏమన్నారంటే...వారి మాటల్లోనే.. మళ్లీ మీరే రావాలి.. సార్.. మేం గతంలో చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. మాకు పాడేరు హెడ్ క్వార్టర్‌కు వెళ్ళాల్సి వచ్చేది ప్రతి విషయానికి గతంలో ఫోన్ చేయాలంటే కొండల పైకి ఎక్కాల్సి వచ్చేది. ఇప్పుడు నేరుగా మా గ్రామానికే సెల్‌టవర్స్ వేశారు. మాకు సిగ్నల్ కూడా వచ్చింది. మా గ్రామస్తులు అంతా సంతోషంగా ఉన్నారు, మాకు గతంలో సచివాలయం అంటే, కలెక్టర్ అంటే, వలంటీర్ అంటే ఏం తెలీదు, కానీ ఇప్పుడు అందరి గురించి తెలిసింది. జగనన్న మీరు మా బాధలు గమనించి మాకు సాయం చేస్తున్నారు. గతంలో రోడ్లు లేవు, కానీ ఇప్పుడు చక్కటి రోడ్లు వేశారు, మీరు ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు మాకు అందుతున్నాయి, మీరు మా వెంట ఉన్నామన్న భరోసా ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు, జగనన్నా మీరు మాకు అన్నీ ఇస్తున్నారు, మేం మీ పథకాల ద్వారా లబ్ధిపొంది మా కాళ్ళపై మేం నిలబడ్డాం, మేమంతా కూడా మళ్ళీ మీరే రావాలని కోరుకుంటున్నాం. గతంలో మీరు పాడేరు వచ్చినప్పుడు చూడాలనుకుని చూడలేకపోయాను, ఇప్పుడు నేరుగా మీతో మాట్లాడే అవకాశం వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్యూ అన్నా -చిట్టెమ్మ, గిరిజన మహిళ, పాడేరు మండలం, ఏఎస్ఆర్ జిల్లా చాలా సంతోషంగా ఉంది.. అన్నా, మా గిరిజన గ్రామాలకు ఫోన్ సిగ్నల్ లేదు. 5 కిలోమీటర్లు వెళ్లి ఫోన్ చేయాల్సి వచ్చేది. ఏదైనా ప్రమాదం జరిగినా అంబులెన్స్‌కి చెప్పడానికి కూడా ఫోన్ సిగ్నల్ ఉండేది కాదు, మా బంధువుల కష్టసుఖాలు తెలిసేవి కాదు. కానీ ఇప్పుడు నేరుగా వారితో మాట్లాడుతున్నాం. మా పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు. నేరుగా టీచర్స్‌తో మాట్లాడుతున్నాం. గవర్నమెంట్ స్కీమ్స్ గురించి తెలిసేది కాదు. కానీ ఇప్పుడు నేరుగా జగనన్నకు చెబుదాం నెంబర్ 1902 కి కాల్ చేసి మాట్లాడగానే మా సమస్య పరిష్కారం అయింది. గతంలో ఆరోగ్యశ్రీ యాప్, దిశ యాప్ ఎలా ఉపయోగించుకోవాలో తెలియలేదు. ఇప్పుడు మాత్రం అన్నీ వెంటనే తెలిసిపోతున్నాయి. మా సచివాలయంలో సిగ్నల్ లేక ఇబ్బందులు పడేవారు, ఇప్పుడు మీ చొరవ వల్ల ఇంటినుంచే అన్నీ తెలుసుకుంటున్నాం, ఏదైనా మా సచివాలయంలో ఇస్తున్నారు. బ్యాంకులకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్దే డబ్బు కూడా తీసుకుంటున్నాం, మాకు సెల్ టవర్ వచ్చిన తర్వాతే నిజంగా సంతోషంగా ఉంది. నిన్నటి కన్నా నేడు, నేటి కన్నా రేపు బావుండాలి, మీరు మళ్లీ వస్తేనే మాకు చాలా బావుంటుంది. మళ్లీ మీరే రావాలని కోరుకుంటున్నాం -చలపతిరావు, గిరిజనుడు, పార్వతీపురం మన్యం జిల్లా -
లక్ష టవర్లు.. 5జీ నెట్‌వర్క్‌లో రిలయన్స్ జియో దూకుడు!
5జీ నెట్‌వర్క్‌లో రిలయన్స్ జియో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వివరాల ప్రకారం.. బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో దేశంలోనే అత్యంత వేగవంతమైన 5జీ నెట్‌వర్క్‌ను రూపొందించడానికి, అల్ట్రా-హై స్పీడ్ ఇంటర్నెట్ను అందించడానికి దాదాపు 1 లక్ష టెలికాం టవర్లను నిర్మించింది. ఇది దాని సమీప ప్రత్యర్థి కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ. ఇదీ చదవండి: ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్ సేల్ సృష్టికర్త.. మింత్రాకు సీఈవో.. ఈ సూపర్ ఉమన్! డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నేషనల్ ఈఎంఎఫ్ పోర్టల్‌లో ఉంచిన రోజువారీ స్థితి నివేదిక ప్రకారం.. జియో రెండు ఫ్రీక్వెన్సీలలో (700 MHz, 3,500 MHz) 99,897 బేస్ ట్రాన్స్సీవర్ స్టేషన్లను (బీటీఎస్) ఇన్స్టాల్ చేసింది. మరోవైపు ఎయిర్‌టెల్‌కు 22,219 బీటీఎస్ లు ఉన్నాయి. ప్రతి బేస్ స్టేషన్‌కు జియోకు 3 సెల్ సైట్లు ఉండగా ఎయిర్‌టెల్‌కు 2 మాత్రమే ఉన్నట్లు పీటీఐ వార్తా సంస్థ ఇటీవల పేర్కొంది. ఇదీ చదవండి: 5జీ అన్లిమిటెడ్ డేటా: ఎయిర్‌టెల్‌లో అదిరిపోయే ప్లాన్లు! ఇంటర్నెట్ స్పీడ్‌కు, సెల్ సైట్లు, టవర్లకు పరస్పర సంబంధం ఉంటుంది. జియో ఉత్తమ ఇంటర్నెట్ సగటు వేగం సెకనుకు 506 మెగాబైట్లు (Mbps) కాగా ఎయిర్టెల్ యావరేజ్ ఇంటర్నెట్ స్పీడ్ 268 Mbps అని ఇంటెలిజెన్స్, కనెక్టివిటీ ఇన్సైట్ గ్లోబల్ లీడర్ అయిన ఊక్లా గత ఫిబ్రవరి నెలలో నివేదించింది. -
టెల్కోలకు రైల్వే గ్రీన్ సిగ్నల్! రైల్వే భూమిలో టెలికం టవర్లు
రైల్వే సంబంధ భూములలో రైల్‌టెల్ కార్పొరేషన్‌కు మినహా ఏ ఇతర టెలికం కంపెనీలూ టవర్లను ఏర్పాటు చేసేందుకు ఇప్పటివరకూ అనుమతించడం లేదు. అయితే తాజాగా ఇందుకు రైల్వే శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా భూములకు కొత్త లీజ్ విధానాలను సిద్ధం చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తద్వారా దేశీయంగా 5జీ టెలికం నెట్వర్క్ ఊపందుకునే వీలున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. న్యూఢిల్లీ: ర్వైల్వే భూములకు సంబంధించి ల్యాండ్ లైసెన్సింగ్ ఫీజు(ఎల్ఎల్ఎఫ్) నిబంధనలను కొద్ది నెలల క్రితం కేంద్ర క్యాబినెట్ సరళీకరించింది. వెరసి ప్రయివేట్ రంగం నుంచి పెట్టుబడులను ఆకట్టుకునే బాటలో రైల్వే శాఖ కొత్త ఎల్ఎల్ఎఫ్ పాలసీకి తెరతీసింది. దీంతో మొబైల్ టవర్ల ఆదాయంలో 7 శాతాన్ని పంచుకునే నిబంధనలకు తెరదించింది. దీని స్థానే భూముల మార్కెట్ విలువలో వార్షికంగా 1.5 శాతం చార్జీల విధింపునకు ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. తద్వారా దేశీయంగా 5జీ నెట్వర్క్ విస్తరణకు దారి ఏర్పడనుంది. దీనిలో భాగంగా అనుమతులు మంజూరు చేసే అంశంలో భవిష్యత్ నెట్వర్క్ అవసరాలను పరిగణించేలా జోనల్ రైల్వేలకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. రైల్‌టెల్ మాత్రమే... ప్రస్తుతం రైల్వే రంగ టెలికం అవసరాలకు రైల్‌టెల్ కార్పొరేషన్‌పై మాత్రమే ఆ శాఖ ఆధారపడుతూ వస్తోంది. ప్రస్తుతం ప్రయివేట్ రంగ కంపెనీలకూ టెండర్లను ప్రారంభించినట్లు సంబంధిత అధికారిక వర్గాలు వెల్లడించాయి. వీటిని ఆయా సంస్థలు వాణిజ్యంగా వినియోగించుకునేందుకు వీలుంటుంది. ఇదే సమయంలో ఈ మౌలిక సదుపాయాలను పోటీ ధరల ప్రాతిపదికన రైల్వేలు సైతం ఉపయోగించుకోనున్నాయి. 2016 పాలసీ ప్రకారం రైల్వే భూములలో రైల్‌టెల్‌కు మాత్రమే టవర్ల ఏర్పాటుకు వీలుండేది. తాజా విధానాలు వీటికి స్వస్తి పలికాయి. వీటి ప్రకారం 70 డివిజన్లు కార్యాలయాలు, స్టేషన్ పరిసరాలలో పోల్ మౌంట్లు, స్మాల్ సెల్స్ ఏర్పాటుకు అనుమతించనున్నాయి. రెండు నెలల గడువు సొంత నెట్‌వర్క్‌లో 5జీ సర్వీసుల వృద్ధికి కొద్ది రోజులుగా రైల్వే శాఖ ప్రయివేట్ నెట్వర్క్ ఆపరేటర్లతో చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. రైల్వే భూములలో ప్రయివేట్ టెలికం కంపెనీలు టవర్లను ఏర్పాటు చేసేందుకు అనుమతించడంతో వ్యయాలు తగ్గనున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా సామర్థ్య మెరుగుకు ఊతం లభించడంతోపాటు, అత్యుత్తమ గ్రిడ్ ప్రణాళికలకు వీలున్నట్లు తెలియజేశాయి. రైల్వేలకు ఆయా భూములు అవసరమైనప్పుడు రెండు నెలల నోటీసు ద్వారా తిరిగి సొంతం చేసుకునే నిబంధనలు జత చేసినట్లు తెలుస్తోంది. కాగా.. 5జీ టవర్ల ఏర్పాటుకు మొబైల్ సేవల దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ భూముల కోసం అన్వేషిస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ తాజా నిర్ణయాలు పరిశ్రమకు బూస్ట్‌నివ్వనున్నట్లు పేర్కొన్నాయి. దీంతో స్థానిక నెట్‌వర్క్‌లకు మరింత బలిమి చేకూరే వీలుంది. ప్రధానంగా పట్టణాలు, గ్రామీణ దూర ప్రాంతాల రైల్వే స్థలాలలో టవర్ల ఏర్పాటు కంపెనీలకు లబ్దిని చేకూర్చగలదని పరిశ్రమ నిపుణులు వివరించారు. తద్వారా టెలికం మౌలిక సదుపాయాల ఏర్పాటులో మరిన్ని ప్రణాళికలకు తెరలేస్తుందన్నారు. ఇది టెలికం పరిశ్రమ నుంచి చాలా కాలంగా వినిపిస్తున్న డిమాండ్లకు పరిష్కారాన్ని అందించనున్నట్లు అభిప్రాయపడ్డారు. అయితే టవర్లను వాణిజ్యపరంగా వినియోగించుకోవడం, రైల్వేకు తిరిగివ్వడం వంటి కొన్ని అంశాలలో సమస్యలను పరిష్కరించవలసి ఉన్నట్లు తెలియజేశారు. -
కేసులు ఎత్తివేయకపోతే... దూకి చచ్చిపోతా..!
పాల్వంచ: అతడిపై రెండు దొంగతనం కేసులున్నాయి. వేధిస్తున్నాడంటూ ఓ అమ్మాయి, మరో దళితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో మరో రెండు కేసులు నమోదయ్యాయి. పాల్వంచలోని కరకవాగు గ్రామస్తుడైన అతడి పేరు గన్నవరపు రాకేష్. ఇతడు మంగళవారం ఉదయం 9.00 గంటల సమయంలో, కేఎస్పీ రోడ్డులోని ఫిల్టర్ బెడ్ వద్దనున్న సెల్ టవర్ పైకి ఎక్కాడు. ‘‘పోలీసులు నాపై అకారణంగా కేసులు పెట్టారు. ఇబ్బందులపాలు చేస్తున్నారు’’ అనేది అతగాడి ఆరోపణ. తనపై కేసులన్నీ ఎత్తివేయకపోతే.. కిందికి దూకి చచ్చిపోతానంటూ అక్కడకు వచ్చిన పోలీసులను బెదిరించాడు. అతడిని కిందికి రప్పించేందుకు పోలీసులు ప్రయత్నించారు. చివరికి, సాయంత్రం 6.00 గంటల సమయంలో దిగొచ్చాడు. అతడిని స్టేషన్‌కు పోలీసులు తీసుకెళ్లారు. ‘‘అతడిపై రెండు చోరీ కేసులు, మరో రెండు వేధింపుల కేసులు ఉన్నాయి. అతడిని మేం వేధించలేదు’’ అని, ఎస్ఐ రవి చెప్పారు. -
శ్రీకాంతాచారి తల్లికి టికెట్ ఇవ్వాలని..
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇద్దరు యువకులు రేడియో టవర్ ఎక్కారు. శుక్రవారం ఎల్బీనగర్లోని చింతల్ కుంటలోని రేడియో టవర్ ను ఎక్కిన యువకులు శంకరమ్మకు టికెట్ ఇస్తేనే కిందకు దిగుతామని స్పష్టం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రెండు గంటల నుంచి ఇద్దరు యువకులు రేడియో టవర్ పైనే ఉండటంతో అక్కడ స్థానికులు భారీగా గుమిగూడారు. తెలంగాణ ఉద్యమంలో ఆమరణ దీక్షకు సిద్దమైన కేసీఆర్ అరెస్ట్‌ను నిరసిస్తూ.. నల్గొండ జిల్లాకు చెందిన శ్రీకాంతాచారి ఎల్బీనగర్ చౌరాస్తాలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో ప్రస్తుత పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. గత కొన్ని రోజులుగా తెలంగాణ అమరవీరులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె బహిరంగంగానే విమర్శిస్తున్న విషయం తెలిసిందే. -
వామ్మో.. రేడియేషన్
భద్రాచలం (అర్బన్) : పవిత్ర పుణ్యక్షేత్రంలో విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన సెల్ టవర్లతో ప్రజలు రేడియేషన్ బారిన పడుతున్నారు. 3 ఎ, 4 ఎ అని సిగ్నల్స్ కోసం వివిధ రకాల మొబైల్ కంపెనీలు విచ్చలవిడిగా జనవాస ప్రాంతాలలో సెల్ టవర్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా దేవాలయలు, పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులు ఉన్న ప్రదేశాలకు దూరంగా విటిని నిర్మించాలనే నిబంధనను తుంగలోకి తొక్కి ఇష్టానుసారంగా విటిని నిర్మిస్తున్నారు. వృద్ధులకు, చిన్న పిల్లలకు, గర్భిణులకు ఈ రేడియేషన్ చాలా ప్రమాదకరం. మానవ శరీరంలో నిత్యం అనేక కణాలు నూతనంగా పుడుతుంటాయి కొన్ని మరణిస్తూ ఉంటాయి. సక్రమంగా కణ విచ్చిత్తి చర్య జరిగితేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు . ఈ డియేషన్ వలన కణ విచ్చిత్తి చర్య గాడి తప్పి కణాలు ప్రవర్తించడం వలన క్యాన్సర్ కణుతులు ఏర్పడి మనిషి ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోతున్నాయి. ఈ టవర్లు ఏర్పాటు చేసుకున్న ఇంటి యజమానులు మొబైల్ కంపెనీలు ఇచ్చే అద్దెలకు, వారు ఇచ్చే ఆఫర్లుకు ఆశ పడి వాటి వలన వచ్చే ప్రమాదాలను ఊహించలేక పోతున్నారు. ఈ వైర్లెస్ టెక్నాలజీ పెరిగి మనిషి జీవితం సుఖవంతవుతుందని ఆనందం పడాలో రేడియేషన్ వలన వచ్చే వివిధ రకాల భయంకరమైన క్యానర్ తదితర రోగాలతో బాధ పడాలో అర్థం కాని అయోమయ స్థితిలో నేటి యువతరం ఉంది. రేడియేషన్ వలన చర్మ సంబంధ వ్యాధులతో పాటు, కళ్లు ఎర్రబడటం, తల తిరుగుతున్నట్లు అనిపించడం, జుట్టు ఊడిపోవడం, పురుషులకు సంతాన సామర్ధ్యం తగ్గిపోతుంది. ఇప్పుడు ప్రతి ఇంటికో షుగర్ వ్యాధి బాధితులు ఉన్నట్లయితే భవిష్యత్‌లో క్యాన్సర్ వ్యాధి బాధితులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విద్యుదయస్కాంత తరంగాలతో.. గర్భిణులు, చంటి పిల్లలకు ప్రమాదం ఉంది.. సెల్ ఫోన్ నుంచి వచ్చే విద్యుదయస్కాంత తరంగాల వలన గర్భిణులకు, చంటి పిల్లలకు చాలా ప్రమాదం ఉంది. గర్భంలో శిశువు ఎదుగుదలకు అడ్డుగా మారి, కొన్నిసార్లు అబార్షన్, నెలలు నిండకుండా పిల్లలు పుట్టడం తదితర పరిణామాలు ఉంటాయి. సెల్ టవర్లు ఉన్న ప్రాంతంలో గర్భిణులు, చంటి పిల్లలు విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. - డాక్టర్. స్పందన, స్త్రీ, శిశు సంబంధ వైద్యనిపుణులు తుమ్మెదలు, తేనెటీగలకు నష్టం.. ఈ రేడియేషన్‌తో మొక్కల కిరణ జన్య సంయోగ క్రియకు ఉపయోగపడే పత్రాలలోని క్లోరోఫిల్ నాశనమవుతుంది దీని వలన మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకోలేవు. తుమ్మెదలు, తేనెటీగలు, పిచుకలు ఇతర వివిధ రకాల మొక్కలుకు మేలు చేసే కీటకాలు, పక్షులు మరణిస్తున్నాయి. ఈ పరిస్థితి వలన మొక్కల çపరపరాగ సంప్కరం జరగకుండా పోతూ విత్తనవుత్పత్తికి ఆలస్యమవుతూ పర్యావరణ అసమతుల్యంగా మారి గ్లోబల్ వార్మింగ్‌కు దారితీస్తుంది. -డి.రమేష్, బోటనీ అధ్యాపకులు -
అంతరిస్తున్న ప్రకృతి నేస్తాలు
– పక్షిజాతికి ప్రాణాంతకంగా మారుతున్న సెల్ టవర్లు సందర్భం : నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం ఒకప్పుడు సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాలకు సంకేతం పక్షులు, పిచ్చుకల కిలకిలరావాలు అంటే ఈ తరం వారికి నమ్మశక్యంగా ఉండదేమో! ఎందుకంటే ఈ తరం పిల్లలకు స్వేచ్ఛగా విహరించే పక్షులు.. పిచ్చుకలు కంటికి కనిపించవు. ఫలితంగా వాటి గురించి ఆలోచించే తీరిక వారికీ ఉండదు. ఒకప్పుడు కొమ్మలపై, ఇళ్ల వాసరాల్లో తమ రెక్కల చప్పుడుతో జనం దృష్టిని ఆకర్షిస్తూ.. కిలకిల రావాలతో పలకరిస్తున్నట్లుండే పిచ్చుకలు.. జీవావరణ సమతుల్యతకు అత్యంత ఆప్త మిత్రులుగా వెలుగొందాయి. జనారణ్యాలు పెరగడం.. చెట్లు నరికి వేయడం.. శబ్ధ కాలుష్యం... సెల్టవర్ల రేడియేషన్ కారణంగా పక్షుల జాతి క్రమంగా కనుమరగవుతూ వస్తోంది. ప్రకృతి నేస్తాలైన పక్షిజాతులను కాపాడుకోవడంలో భాగంగా ప్రతి ఏటా మార్చి 20న పిచ్చుకల దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. - అనంతపురం కల్చరల్ పర్యావరణ సమతుల్యత లోపించి రోజురోజుకూ వేడెక్కుతున్న భూగోళం కారణంగా మానవ జాతి మనుగడనే ప్రశ్నార్థకమవుతోంది. ఇలాంటి తరుణంలో పక్షుల జాతులు పిట్టల్లా రాలిపోతున్నాయి. జిల్లాలోని వీరాపురం ప్రపంచంలోని వివిధ రకాల పక్షులకు స్థావరంగా నిలుస్తోంది. అరబ్, నైజీరియా, సైబీరియా, న్యూజిలాండ్ వంటి సుదూర ప్రాంతాల పక్షులను ఇక్కడి ప్రకృతి సూదంటురాయిలా ఆకర్షిస్తుంటే.. మన ఇంటి ముంగిళ్లలో, లోగిళ్లలో వాలే పిచ్చుకలను దూరం చేసుకోవడం స్వయంకృతాపరాధమే అవుతోంది. ఇంట్లో పిచ్చుకలు గూడు కట్టుకుంటే శుభం జరుగుతుందని పూర్వీకులు భావించి, వాటిని మురిపెంగా పిలుస్తూ ధాన్యాలను మూలలో వెదజల్లేవారు. పక్షులను కాపాడుకోవాలి ఒకప్పుడు ఇళ్లలో గువ్వలు గూళ్లు కట్టుకునేవి. వాటిని చూస్తూంటే మనసు ఎంతో ఆనందంగా ఉండేది. ఇప్పుడు పిచ్చుకలను టీవీల్లోనో, సినిమాల్లోనే చూడాల్సిన గతి పట్టింది. మా చిన్నప్పుడు మా ఇంట్లో పిచ్చుకల కోసం చిన్నపాటి గూడు ఏర్పాటు చేసే వాళ్లం. వాటితో ఉన్నామన్న ఫీలింగే.. ఎంత ఒత్తిళ్లు ఉన్నా మనసు తేలికగా మారిపోయేది. అతి ప్రమాదకరమైన రేడియేషన్ వెలువరిచే సెల్ టవర్స్ నిర్మాణాలు డబ్బు కోసం ఇంటిపైనే ఏర్పాటు చేసుకోవడానికి అవకాశమిస్తున్నాం. ఇది మంచిది కాదు. పిచ్చుకజాతి ప్రాధాన్యతను తెలిజేస్తూ జనంలో అవగాహన పెంచుతున్నాం. – మఠం నాగరాజు, ప్రకృతి ప్రేమికుడు, అనంతపురం -
సెల్..రెవెన్యూ నిల్
అనుమతి లేకుండానే టవర్ల ఏర్పాటు పట్టించుకోని అధికార యంత్రాంగం పంచాయతీల ఆదాయానికి గండి నిధుల కొరతతో పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. పంచాయతీల పరిధిలోని వనరుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశం ఉన్నా ఆ దిశగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవడం లేదు. పంచాయతీల పరిధిలో ఏర్పాటు చేసే సెల్టవర్ల క్రమబద్దీకరణ, పన్నుల ద్వారా రూ.లక్షల్లో ఆదాయం సమకూరే అవకాశం ఉన్నా పట్టించుకోకపోతుండడంతో పంచాయతీల ఆదాయానికి గండి పడుతోంది. కోట: జిల్లాలోని 46 మండలాల పరిధిలో వివిధ కంపెనీలకు సంబంధించి 972 వరకు సెల్‌టవర్లు ఉన్నాయి. నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు గూడూరు, కావలి, నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి, కోట, పొదలకూరు వంటి పట్టణ ప్రాంతాల్లో ఒక్కొక్క చోట 5 నుంచి 20 వరకు టవర్లు ఏర్పాటు చేసి ఉన్నారు. ఆధునిక సాంకేతిక వ్యవస్థ అందుబాటులోకి వచ్చాక గ్రామీణ ప్రాంతాల్లోనూ అవసరాల మేరకు ఆయా కంపెనీలు టవర్లు ఏర్పాటు చేశాయి. సెల్‌టవర్ ఏర్పాటుకు పంచాయతీల నుంచి రెండువిడతలుగా అనుమతి పొందాలి. ఇందుకు గానూ నిర్ణీత ప్రదేశంలో నేలపై ఏర్పాటు చేస్తే రూ.15వేలు, భవనాలపై ఏర్పాటు చేస్తే రూ.12వేలు వంతున పంచాయతీలకు చెల్లించాలి. ఏటా ఇదే మొత్తాన్ని చెల్లించి అనుమతులను రెన్యువల్ చేయించుకోవాలి. కానీ ఎక్కడా ఇది జరగడం లేదు. పట్టించుకుంటే ఆదాయమే పట్టణాల్లో సెల్‌టవర్లకు అనుమతులు పొందుతున్న సెల్‌కంపెనీలు పంచాయతీల్లో తీసుకోవడం లేదు. కోట మేజర్ పంచాయతీ పరిధిలో ఏడు టవర్లు ఉండగా, ఐదేళ్లలో ఒక్క టవర్ నిర్వాహకులు మాత్రమే రెన్యువల్ చేయించుకున్నట్లు సర్పంచ్ రాఘవయ్య తెలిపారు. ఇదే పరిస్థితి జిల్లాలోని అన్ని పంచాయతీల్లో నెలకొని ఉంది. కొన్ని చోట్ల స్థానిక నాయకుల అండదండలతో గ్రామకార్యదర్శులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. గూడూరు నియోజకవర్గం పరిధిలో ఏళ్లకు తరబడి అనుమతులు పొందని టవర్ల సంఖ్య అధికంగానే ఉంది. వీటిపై అధికారులు దృష్టి సారిస్తే పంచాయతీలకు లక్షల్లో ఆదాయం సమకూరే అవకాశం ఉంది. నోటీసులు జారీ చేస్తాం: రమేష్, డీఎల్పీఓ,గూడూరు గ్రామాల్లో అనుమతులు పొందని సెల్‌టవర్లకు నోటీసులు జారీ చేస్తాం. పంచాయతీల వారీగా పూర్తి సమాచారం సేకరించాలని ఈఓపీఆర్డీ, కార్యదర్శులను ఆదేశించాం. నెల రోజుల్లోగా నగదు చెల్లించేలా చర్యలు తీసుకుంటాం. -
సెల్ టవర్ల ఏర్పాటుపై ఆందోళన
బొబ్బిలి(విజయనగరం): విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. స్థానిక 14వ, 23వ వార్డుల్లో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయతలపెట్టిన సెల్ టవర్లను స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై వారు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం నుంచి పోలీసులు సెక్షన్ 30 విధించారు. ప్రజలు గుంపులుగా ఉండరాదని, ఆందోళనలు చేయరాదని హెచ్చరించారు. ప్రజల ఆందోళనలతో భారీగా పోలీసులను మోహరించారు. దీంతో పట్టణంలో ఉద్రిక్తత ఏర్పడింది. -
'మొబైల్, సెల్ టవర్స్‌తో కేన్సర్ రాదు'
కాకినాడ: మొబైల్ ఫోన్ల వినియోగం, సెల్ టవర్స్ వల్ల కేన్సర్ కారణం కాదని... ఒట్టి అపోహ మాత్రమేనని అంకాలజిస్ట్ సర్జన్ డా.సుంకవల్లి చినబాబు అన్నారు. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో డా.సుంకవల్లి చినబాబు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... కేన్సర్ చికిత్స విధానంలో రొబెటిక్ సర్జరీ అనే అధునిక పద్దతి వచ్చిందన్నారు. రొబెటిక్ సర్జరీతో కేన్సర్ రోగికి పెద్దగా నొప్పి తెలియదని డా. సుంకపల్లి చినబాబు అన్నారు. -
గోడలపై రాతలు..గ్రామాలకు కాసులు
వ్యాపార సంస్థల ప్రకటనలు గ్రామ సీమలకు ఆదాయ వనరు కాబోతున్నాయి. ఊళ్లల్లోకి వచ్చి గోడలమీద ఎడాపెడా రాసేసి, గీసేసి చెక్కెయాలని చూసే సంస్థలకు పంచాయతీ అధికారులు చెక్ పెట్టబోతున్నారు. ఈ కార్యాచరణలో గృహ యజమానులనూ భాగస్వాములను చేయనున్నారు. తద్వారా పంచాయతీలకు ఆర్థిక జవసత్వాలు చేకూర్చాలని యత్నిస్తున్నారు. ‘గ్రామాల్లో గోడలపై రాతలకు పన్ను’ విధానాన్ని అమలులోకి తీసుకురానున్నారు. తొలిసారిగా తెనాలి డివిజన్లో చేపట్టిన ఈ వినూత్న ప్రయోగం విజయవంతమైతే జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు కొంతలో కొంతైనా ఆర్థిక పరిపుష్టి చేకూరినట్టే. తెనాలిఅర్బన్ : గ్రామ పంచాయతీల ఆదాయం పెంపునకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇప్పటికే సెల్ టవర్లు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభా లపై పన్ను వసూలుకు కసరత్తు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రతిపాదనకు తెరతీయనుంది. వివిధ వ్యాపార సంస్థలకు చెందిన ప్రకటనలు ఇళ్ల గోడలపై వెలుస్తున్న నేపథ్యంలో వాటిపైనా పన్ను వసూలుకు సిద్ధమవుతోంది. తెనాలి డివిజన్లో 349 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా పంచాయతీల ఆదాయం పెంపునకు చేపల చెరువుల వేలం, పంచాయతీ స్థలాలు లీజుకివ్వటం, ఇంటిపన్ను నూరు శాతం వసూలు వంటి కార్యక్రమాలు చేపట్టిన అధికారులు ఇప్పుడు కొత్త ప్రతిపాదనలకూ శ్రీకారం చుడుతున్నారు. గ్రామాల్లో ఇళ్ల గోడలు, ఇంటి ప్రహరీ గోడలపైనా వ్యాపార ప్రకటనలు సర్వసాధారణం. సిమెంటు, పురుగుమందులు, సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్, వస్త్ర వ్యాపారాలు, సెల్ కంపెనీలు, సెల్ నెట్ వర్కులు తదితర ప్రకటనలూ గ్రామాల్లో దర్శనమిస్తుంటాయి. ఇలాంటి ప్రకటనలకు కొందరు గృహ యజమానులు ఆయా కంపెనీల నుంచి ఎంతో కొంత తీసుకునే అనుమతిస్తారు. మరి కొందరు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తారు. ఇలాంటి వ్యాపార ప్రకటనలనూ ఆదాయ వనరుగా మార్చుకునేందుకు పంచాయతీ అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ప్రకటనలు ఉన్న గోడలకు చెందిన యజమానులకు ప్రకటన పన్ను చెల్లించాల్సిందిగా నోటీసులు జారీ చేయనున్నారు. దీనిని కనీసం రూ.300గా నిర్ణయించినట్లు తెలిసింది. ప్రకటనదారుడు పన్నును పంచాయతీకి చెల్లించే విధంగా యజమాని చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఆ ప్రకటనను యజమాని చెరిపివేయాలి. ఈ రెండూ కానిపక్షంలో పంచాయతీ అధికారులే ఆ ప్రకటనలను చెరిపివేయాల్సి వస్తే తారుపూసే ప్రమాదం ఉంది. తిరిగి ఆ గోడలు శుభ్రం కావాలంటే పన్నుకు మించిన భారం గృహ యజమానిపై పడనుంది. ఇదిలా ఉంటే పెద్దపెద్ద ఐరన్ఫ్రేమ్లతో వ్యాపార ప్రకటనలు ఏర్పాటు చేస్తుంటారు. ఆయా సంస్థల నుంచి పన్ను వసూలుకు చర్యలు తీసుకుంటారు. వీలుకాని పక్షంలో ఆ స్థానంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలను ప్రదర్శనగా ఉంచుతారు. పంచాయతీల ఆదాయం పెంపు కోసమే ... గ్రామ పంచాయతీల ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే గ్రామాల్లో ఉన్న సెల్ టవర్లు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు తదితర వివరాలను సేకరించే పనిలో ఉన్నాం. అలాగే ఇంటి గోడలు, ప్రహరీ గోడలపై ప్రత్యక్షమయ్యే ప్రకటనలకూ పన్ను వసూలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. గృహ యజమానులకు నోటీసులు జారీ చేయనున్నాం. పన్ను యజమాని చెల్లించవచ్చు. కుదరని పక్షంలో ప్రకటనదారు ద్వారా చెల్లించేందుకైనా చర్యలు తీసుకోవాలి. అలా చేయని పక్షంలో పంచాయతీ సిబ్బంది తారుపూసి ఆ ప్రకటనను కనబడకుండా చేస్తారు. దీనిపై కార్యదర్శులకు మార్గదర్శకాలు సిద్ధమయ్యాయి. - ఎంవీఎస్ సుబ్రహ్మణ్యం, డివిజనల్ పంచాయతీ అధికారి, తెనాలి. -
సెల్ టవర్లపై విజి‘లెన్స్’
పన్నుల ఎగవేతపై ప్రభుత్వం దృష్టి ఎగ్గొడుతున్న సంస్థల వివరాల సేకరణ పనిలో నిమగ్నమైన కార్యదర్శులు నక్కపల్లి: నిబంధనలకు విరుద్ధంగా పుట్టగొడుగుల్లా ఏర్పాటవుతూ స్థానిక సంస్థలకు బకాయిలను ఎగ్గొడుతున్న సెల్ టవర్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఏళ్ల తరబడి చెల్లించాల్సిన బకాయిలను ముక్కుపిండి వసూలు చేసేందుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖను రంగంలోకి దించింది. ఈ చర్యల్లో భాగంగా జిల్లాలో ఏ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఎన్ని సెల్ టవర్లున్నాయి, వాటి ఏర్పాటులో ఆపరేటర్లు నిబంధనలు పాటించారా, లేదా, ఆయా పంచాయతీలు, మున్సిపాలిటీలకు లెసైన్స్ ఫీజు చెల్లించారా లేదా, సెల్‌టవర్ ఏర్పాటులో అన్ని అనుమతులు తీసుకున్నారా లేదా తదితర వివరాలను విజిలెన్స్, అండ్ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ అధికారులు ఆరా తీస్తున్నారు. వారం రోజులుగా పంచాయతీ కార్యదర్శులు తమ పరిధిలోని సెల్ టవర్ల నిర్మాణాల వివరాల సేకరణలో నిమగ్నమయ్యా రు. జిల్లా వ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలో 311 సెల్‌టవర్లు ఉండగా గ్రామీణ ప్రాంతంలో 161, పట్టణ ప్రాంతంలో 150 ఉన్నాయి. మరో 52 టవర్ల నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. వివిధ ప్రైవేటు సర్వీసు ప్రొవైడర్ల ఆధ్వర్యంలో మరో 2000కు పైగా సెల్టవర్లున్నాయి. వీటి ఏర్పాటుకు మార్గదర్శకాలున్నాయి. - భూ ఆధారిత, రూఫ్టాఫ్ (ఎత్తయిన భవనాలపై) సెల్ టవర్లను ఏర్పాటు చేయదలచుకుంటే ముందుగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అథారిటీ నుంచి అనుమతి, అగ్నిమాపకశాఖ, చుట్టుపక్కల భవనాల యజమానులనుంచి నుంచి నిరభ్యంతర ధ్రువపత్రాలను తీసుకోవాలి. రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉండే పక్షంలో సమీప నివాస ప్రాంతాలు, పాఠశాలలు, ఆస్పత్రులకు దూరంగా సెల్‌టవర్‌ను ఏర్పాటు చేయాలి. భూ ఆధారిత సెల్‌టవర్ ఏర్పాటు చేస్తే రైతు నుంచి ఒప్పందం తీసుకుని పంచాయతీకి దరఖాస్తు చేయాలి. లెసైన్స్ ఫీజు కింద రూ.15000 చెల్లించాలి. ఏటా రూ.వెయ్యి లెసైన్స్ నవీకరణ ఫీజు కింద చెల్లించాలి. భవనాలపై ఏర్పాటు చేస్తే రూ.12000 చెల్లించాలి. ఇప్పటివరకు ఏర్పాటైన సెల్‌టవర్లు ఎక్కడా ఈ నిబంధనలను పాటించలేదు సరికదా పంచాయతీలు, మున్సిపాలిటీలకు రుసుము చెల్లించ కుండా పన్ను ఎగవేతకు కోర్టును ఆశ్రయిస్తున్నారని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇలాంటిసెల్టవర్ల నుంచి పంచాయతీలు, మున్సిపాలిటీలకు రావలసిన బకాయిల వసూలుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను రంగంలోకి దించింది. -
ఏ టవర్ నుంచి ఎంత రేడియేషన్?
మీ ఇంటికి సమీపంలో ఎక్కడైనా సెల్‌ఫోన్ టవర్ ఉందా? దాన్నుంచి ఎంత రేడియేషన్ వెలువడుతోందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే.. నేషనరల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ (ఈఎంఎఫ్) ఎమిషన్ సైట్లోకి వెళ్లి చూడండి. అందులో దేశంలో ఉన్న ప్రతి ఒక్క టవర్ నుంచి ఎంతెంత రేడియేషన్ వస్తోందో స్పష్టంగా ఉంటుంది. ప్రస్తుతానికి పరీక్షల చివరి దశలో ఉన్న ఈ పోర్టల్.. వచ్చే ఏడాది ప్రారంభం నాటికల్లా ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. సెల్ టవర్లు నిజంగానే సురక్షితంగా ఉన్నాయా, లేవా అన్న విషయాన్ని నిర్ధారించేందుకు టెలికం శాఖ, టెలికం పరిశ్రమ కూడా చాలారోజులుగా ఒక వెబ్సైట్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని, ఇన్నాళ్లకు అది సాధ్యం అవుతోందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (కోయ్) డైరెక్టర్ జనరల్ రంజన్ ఎస్. మాథ్యూస్ తెలిపారు. రెండు నెలల్లో ఈ సైట్ టెస్టింగ్ పూర్తవుతుందని, పూర్తిస్థాయిలో ప్రారంభించేందుకు తొమ్మిది నెలల సమయం పడుతుందని ఆయన చెప్పారు. ముందుగా పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర రాష్ట్రాల్లో అమలుచేస్తామని, తర్వాత దేశం మొత్తంలోని టవర్ల సమాచారం ఇందులో ఉంటుందని అన్నారు. దీంతో టవర్ల గురించి ఉన్న అపోహలు తొలగిపోతాయని మాథ్యూస్ అన్నారు. -
మాస్ కాపీయింగ్‌పై నిఘా
కర్నూలు: ఇంటర్మీడియెట్ బోర్డు తొలిసారిగా పరీక్ష కేంద్రాలపై సెల్ టవర్ల సహాయంతో నిఘా సారించనుంది. ఈనెల 12 నుంచి పరీక్షలు ప్రారంభం కానుండటంతో మాస్ కాపీయింగ్.. అవకతవకలను అరికట్టేందుకు అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేందుకు సిద్ధమవుతోంది. హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డు ప్రధాన కార్యలయంలో ఏర్పాటు చేసిన జీపీఎస్‌తో అన్ని పరీక్షా కేంద్రాలను అనుసంధానించి సెల్టవర్ల సహాయంతో పర్యవేక్షించనున్నారు. సెల్ఫోన్లు, ఇంటర్నెట్ ద్వారా మాస్‌కాపీయింగ్ జరుగుతోందనే సమాచారంతో బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. యేటా కీలక పరీక్షల సమయంలో ఇన్విజిలేటర్లు, కొందరు ఉద్యోగులు అక్రమాలకు తెరతీస్తున్నారు. పరీక్షల ప్రారంభానికి ముందు ఫోన్ల ద్వారా ప్రశ్నపత్రం లీక్ చేస్తుండటంతో ప్రతిభావంతులైన విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోంది. కొన్ని కళాశాలలు పరస్పర ఒప్పందంతోఅవకతవకలకు తెరతీస్తున్నారు. వీటన్నింటినీ అడ్డుకట్ట వేసేందుకు జీపీఎస్ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ముగిసే వరకు ఇంటర్ బోర్డు కార్యాలయం నుంచి సెల్టవర్ల ద్వారా మొత్తం ప్రక్రియపై నిఘా వేయనున్నారు. పరీక్ష కేంద్రంలో సెల్‌ఫోన్ మోగినా, ఏదైనా సెల్‌కు మెసేజ్ వచ్చినా, ఇంటర్నెట్ వాడకం జరిగినా వెంటనే ఆ సమాచారం ఇంటర్ బోర్డు ప్రధాన కార్యాలయానికి చేరేలా ఏర్పాట్లు చేపట్టారు. ఆ వెంటనే బోర్డు అధికారులు తనిఖీ బృందాలను అప్రమత్తం చేసి మాస్ కాపీయింగ్‌ను అడ్డుకునేలా చర్యలు తీసుకున్నారు. 9 గంటల తర్వాత అనుమతించబోం: ఆర్ఐఓ విద్యార్థులను నిర్ణీత సమయం 9 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని ఆర్ఐఓ టీ.వీ.ఎస్. రావు ‘సాక్షి’కి తెలిపారు. గతంలోనూ పరీక్ష 9 గంటలకు ప్రారంభమవుతున్నా.. 9.45 గంటల వరకు అనుమతించేవారు. తాజా సంస్కరణల నేపథ్యంలో ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించకూడదని బోర్డు నిర్ణయించింది. కొన్ని పరీక్ష కేంద్రాల్లో ప్రశ్నపత్రం విప్పగానే సెల్‌ఫోన్ సహాయంతో ప్రశ్నలు చేరవేయడం.. విద్యార్థులు సమాధానాలు చదువుకుని కాస్త ఆలస్యంగా పరీక్షకు వెళ్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిర్ణీత సమయం తర్వాత విద్యార్థులను అనుమతించకూడదని బోర్డు ఆదేశించినట్లు ఆర్ఐఓ వెల్లడించారు -
పద్మవ్యూహం
కర్నూలు, న్యూస్‌లైన్: ఎన్నికలకు పోలీసు శాఖ సర్వసన్నద్ధమవుతోంది. రెండు నెలల సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే ముందస్తు వ్యూహం రచిస్తోంది. నెలాఖరు లోగా జిల్లాకు సంబంధించిన పూర్తి సమాచారం అందించాలనే ఎన్నికల కమిషన్ ఆదేశాలతో కసరత్తు ముమ్మరం చేసింది. ప్రధానంగా మావోయిస్టుల వివరాలు మొదలు.. సెల్ టవర్ల సంఖ్య వరకు లోతైన సమాచారం సేకరిస్తోంది. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి కింది స్థాయి అధికారులు, పోలీసులను సర్వసన్నద్ధం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో హడావుడి కన్నా.. ఇప్పటి నుంచే లోపాలను గుర్తిస్తే అప్పుడు విధి నిర్వహణ సులభతరం అవుతుందనే ఉద్దేశంతో ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో సమాచార వ్యవస్థ పక్కాగా లేకపోవడంతో గత ఎన్నికల సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణల సమాచారాన్ని ఉన్నతాధికారులకు సకాలంలో చేరవేయలేకపోయారు. ఈ సమస్యను అధిగమించేందుకు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. మారుమూల గ్రామాలపైనా కన్నేసి ఉంచాలనే ఉద్దేశంతో సెల్ టవర్ల వివరాలను సైతం సేకరిస్తున్నారు. సమగ్ర వివరాలు సేకరించిన తర్వాత ఏ ప్రాంతంలో ఏ నెట్వర్క్ అందుబాటులోకి వస్తుందో దానికి సంబంధించిన సిమ్ కార్డులను సిద్ధం చేసుకునే ఆలోచనలో ఉన్నారు. జిల్లాకు సంబంధించిన సమాచారం కొంత ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు నివేదించినట్లు సమాచారం. అదేవిధంగా జిల్లాలో కొంత కాలంగా నక్సల్స్ కదలికలు లేకపోయినా.. అనుమానంతో పోలీసులు అధికారులు అప్రమత్తం అవుతున్నారు. గతంలో చోటు చేసుకున్న సంఘటనల దృష్ట్యా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన నల్లమల అటవీ ప్రాంతంలోని వడ్లరామాపురం, వేంపెంట, వెంకటాపురం, ఇందిరేశ్వరం, నల్లకాలువ, కపిలేశ్వరం, సిద్ధేశ్వరం, జానాలగూడెం, ఎర్రమఠం, ముసలమడుగు, లింగాపురం ప్రాంతాలపై నిఘా కట్టుదిట్టం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో నిఘా నేత్రాల ఏర్పాటుపై దృష్టి రాష్ట్ర విభజన ప్రయత్నాల నేపథ్యంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం దృష్టి సారించింది. శాంతి భద్రతలకు సంబంధించి జిల్లాల వారీగా నివేదిక కోరింది. ఎన్నికల నిబంధనల ప్రకారం జిల్లాలో మూడేళ్ల పాటు పనిచేసిన సీఐ, ఎస్ఐలను బదిలీ చేయాలనే మార్గదర్శకాలకు అనుగుణంగా పోలీసు శాఖలో బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. కొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందనే సమాచారం నేపథ్యంలో పోలీసు శాఖ అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ దఫా ఎన్నికల్లో ప్రత్యేక అంశం నిఘా కెమెరాల ఏర్పాటు. ఇందుకు సంబంధించి రెవెన్యూ అధికారులు పోలింగ్ కేంద్రాల్లో కెమెరాల ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాలపై వివరాలు సేకరిస్తున్నారు. ఇదే సమయంలో శాంతిభద్రతలకు సంబంధించిన సమాచార సేకరణలో పోలీసుల శాఖ తలమునకలవుతోంది. -
టవరెక్కిన యువకులు
కందుకూరు, న్యూస్‌లైన్: గ్రామంలో సారా విక్రయాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ మండల పరిధిలోని తిమ్మాపూర్‌కు చెందిన ఆరుగురు యువకులు సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశారు. అధికారుల హామీతో వారు శాంతించారు. స్థానికుల కథనం ప్రకారం.. కొంతకాలంగా గ్రామంలో సారా విక్రయాలతో కుటుంబాలు వీధినపడుతున్నాయి. దీంతో యువకులు ఎక్సైజ్ పోలీసులతో కలిసి గ్రామంలో ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించారు. అయినా సారా అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. విక్రయదారులు స్థానికంగా కొందరికి సారా తాగించి యువకులపైకి ఉసిగొల్పుతున్నారు. ఎక్సైజ్ అధికారుల అండతోనే విక్రయదారులు చెలరేగిపోతున్నారని యువకులు తెలిపారు. గ్రామానికి చెందిన యువకులు మంద పాండు, బట్టీల నర్సింహ, ఉండేల శ్రీనివాస్, వట్నాల మహేందర్, వట్నాల గణేష్, పిట్టల శ్రీకాంత్‌లు ఎలాగైనా సారా మహమ్మారిని తరిమి కొట్టాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో వారు సోమవారం ఉదయం 7 గంటల సమయంలో గ్రామంలో ఉన్న ఓ సెల్ టవర్ ఎక్కారు. గ్రామంలో సారా విక్రయాలు అరికట్టకుంటే దూకేస్తామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ నాగార్జున, ఎక్సైజ్ ఎస్ఐ చంద్రశేఖర్, వీఆర్వో శ్రీరాములు, గ్రామస్తులు అక్కడికి చేరుకుని కిందికి దిగి రావాలని యువకుల్ని బతిమాలినా ఫలితం లేకుం డా పోయింది. ఉన్నతాధికారులు వచ్చి సారా విక్రయాలు అరికడతామని హామీ ఇస్తేనే దిగుతామని, లేదంటే దూకుతామని స్పష్టం చేశారు. 11.45 గంటల సమయంలో తహసీల్దార్ సరిత, ఎక్సైజ్ సీఐ జావిద్‌ఆలీ అక్కడికి చేరుకున్నారు. రెండు రోజుల్లో గ్రామ పంచాయతీ తీర్మానం చేయించి సారా విక్రయాలను పూర్తిగా అరికడతామని హామీ ఇచ్చారు. దీంతో యువకులు ఆందోళన విరమించి కిందికి దిగివచ్చారు. దాదాపు 5 గంటల పాటు కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. అనంతరం అధికారులు గ్రామం లో పర్యటించి సారా విక్రదారులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇకపై సారా అమ్మితే విక్రయదారులకు రేషన్ సరుకులతో పాటు సంక్షేమ పథకాలు నిలిపి వేస్తామని తహసీల్దార్ హెచ్చరించారు. -
సెల్ టవర్లు...‘హెల్’ టవర్లే!
‘సెల్ టవర్లతో రేడియేషన్ దారుణంగా విస్తరిస్తోంది. దాంతో మానవుల ఆరోగ్యం దెబ్బ తింటోంది. జనావాసాల నడుమ సెల్ టవర్ల ఏర్పాటును నిరోధించండి.’ అంటూ కొంతకాలంగా నిపుణులు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు మొరపెడుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. పెపైచ్చు కోర్టుల్ని కూడా తప్పుదోవ పట్టించి, సెల్ టవర్లతో రేడియేషన్ ప్రభావం పెద్దగా ఉండబోదంటూ వక్రభాష్యాలు చెప్పారన్న ఆరోపణలున్నాయి. సెల్ టవర్ల వల్ల కలిగే దుష్పరిణామాలపై ముంబై ఐఐటీకి చెందిన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం ఆచార్యుడు గిరీష్ కుమార్ ఓ సమగ్ర నివేదిక పొందించారు. ఈ నివేదికలను ప్రస్తావిస్తూ, తమ నివాస ప్రాంతాల్లో ఎదురవుతున్న రేడియేషన్ దుష్పరిణామాలపై న్యూ రేసపువానిపాలెం నివాసులు జీవీఎంసీ కమిషనర్ ఎం.వి.సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. నిబంధనల సడలింపు సెల్ టవర్ల ఏర్పాటు నిబంధనలు గత కొన్నాళ్లుగా సరళీకృతమవుతూ వస్తున్నాయి. జీవీఎంసీలో నివాస ప్రాంతాల్లో సెల్ టవర్ల ఏర్పాటుపై గత కొన్నేళ్లుగా స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరాలున్నా, కోర్టు ఉత్తర్వులను సాకుగా చూపించి అధికారులు తప్పించుకుంటున్నారని నగరవాసులు ఆరోపిస్తున్నారు. రేడియేషన్ ప్రభావం ఎంత? జీవీఎంసీలో 584 సెల్ టవర్లున్నట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. సెల్ టవర్ నుంచి వచ్చే రేడియేషన్ జేబులోని మొబైల్ ఫోన్ రింగయినపుడు వచ్చేంత మాత్రమే ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్ధారించినట్టు జీవీఎంసీ అధికారులు గతంలోనే వెల్లడించారు. సుప్రీం కోర్టు అభిప్రాయాన్ని కూడా పొందుపరిచారు. తమ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సెల్‌టవర్లపై మూడు మాసాల కిందట నాతయ్యపాలెం ప్రజలు కమిషనర్‌కు మొరపెట్టుకుంటే.. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో తాము చేసేదేం లేదని జీవీఎంసీ అధికారులు స్పష్టం చేశారు. అయితే న్యూరేసపువానిపాలెంలోని ఓ అపార్టుమెంట్‌వాసులు తమ అపార్ట్‌మెంట్‌పై ఏర్పాటు చేసిన సెల్‌టవర్లపై ఫిర్యాదు చేశారు. వీటివల్ల కొందరు తీవ్ర అనారోగ్యం పాలైనట్టు తెలిపారు. ఇందుకు సెల్ టవర్ల రేడియేషనే ప్రధాన కారణమంటూ ముంబయిలోని టాటా మెరియల్ హాస్పిటల్ అండ్ కేన్సర్ రీసెర్చ్ సంస్థ నిర్ధారించినట్టు పేర్కొన్నారు. ముంబయి ఐఐటీ ఆచార్యుడు గిరీష్ కుమార్ పరిశోధన నివేదికను కూడా జత చేశారు. బాధితులు ఎందరో.. నివాస భవనాలపై సెల్ టవర్ల వల్ల రేడియేషన్ మితిమీరి చాలా మంది రోగాలకు గురవుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. మా అపార్ట్‌మెంట్‌పైనే రెండు టవర్లున్నాయి. ఇప్పటి వరకు సుమారు 20 మంది రేడియేషన్ ప్రభావానికి లోనయ్యారు. ముగ్గురు తీవ్ర వ్యాధిగ్రస్తులయ్యారు. ఓ మహిళలకు బ్రెస్ట్ కేన్సర్ వచ్చింది. తక్షణమే వీటిని నివాస ప్రాంతాల నుంచి తొలగించాలి. - జి.ఎస్.సిద్దార్థ, ఫిర్యాది, న్యూ రేసపువానిపాలెం ప్రభుత్వానికి నివేదిస్తాం అపార్టుమెంట్‌వాసుల ఫిర్యాదును, ముంబయి ఐఐటీ ప్రొఫెసర్ గిరీష్ కుమార్ పరిశోధన బుక్‌లెట్‌ను ప్రభుత్వానికి అందిస్తాం. హైకోర్టు, సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు వీటిపై చర్యలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇపుడీ పరిశోధన పత్రం ఆధారంగా మరోసారి రేడియేషన్ ప్రభావంపై పరిశోధన చేయాల్సిందిగా ప్రభుత్వానికి నివేదించనున్నాం. - ఎం.వి.సత్యనారాయణ, జీవీఎంసీ కమిషనర్ -
ఇంటి దొంగల గుట్టు రట్టు
నూజివీడు, న్యూస్‌లైన్ : ‘తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన’ చందంగా ఉద్యోగం చేస్తున్న చోటే లక్షలాది రూపాయల విలువ చేసే సొత్తును దొంగిలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.7లక్షల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నూజివీడు సీఐ సిహెచ్.వి.మురళీకృష్ణ తెలిపిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. ఇండస్ టవర్స్ అనే సంస్థ ప్రైవేటు సెల్‌ఫోన్ కంపెనీలకు టవర్స్‌ను అద్దెకిస్తుంది. ఈ సంస్థకు నూజివీడులో సాంకేతిక నిపుణుడిగా తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరానికి చెందిన విత్తనాల నాగ సూర్యచంద్రరావు, సూపర్వైజర్గా తిరువూరు శాంతి నగర్‌కు చెందిన దాసరి రాజేష్ పనిచేస్తున్నారు. వీరిద్దరూ కలసి సెల్‌టవర్స్ వద్ద ఉండే కంట్రోల్ రూమ్‌లలోని స్టెబిలైజర్లు, కన్వర్టర్లు, జనరేటర్ ఇన్వర్టర్లు, బ్యాటరీలు, విలువైన వైర్లను దొంగిలించి బయట అమ్ముకుంటున్నారు. ఈ వ్యవహారం దాదాపు ఏడాది కాలంగా సాగుతోంది. కంట్రో ల్ రూమ్‌లలో సామగ్రి తరచూ అపహరణకు గుర వుతుండటంతో ఈ టవర్లకు రక్షణ బాధ్యత నిర్వహించే ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీ అధికారి మత్తె శ్రీనివాసరావు గతనెల 27న పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు నిర్వహించారు. నాగసూర్యచంద్రరావు పట్టణంలోని పోతురెడ్డిపల్లి రోడ్డులో అద్దెకు ఉంటున్న ఇంటిపై దాడి చేశారు. అపహరణకు గురైన దాదాపు రూ.7 లక్షల విలువైన సామగ్రిని ఆ ఇంటిలో స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి నాగసూర్యచంద్రరావును, అతడికి సహకరిస్తున్న రాజేష్‌ను శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో కృషిచేసిన ఎస్సై ఐవీ నాగేంద్రకుమార్, కానిస్టేబుల్ నాగరాజు తదితర సిబ్బందిని ఆయన అభినందించారు.