
భద్రాచలం (అర్బన్) : పవిత్ర పుణ్యక్షేత్రంలో విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన సెల్ టవర్లతో ప్రజలు రేడియేషన్ బారిన పడుతున్నారు. 3 ఎ, 4 ఎ అని సిగ్నల్స్ కోసం వివిధ రకాల మొబైల్ కంపెనీలు విచ్చలవిడిగా జనవాస ప్రాంతాలలో సెల్ టవర్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా దేవాలయలు, పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులు ఉన్న ప్రదేశాలకు దూరంగా విటిని నిర్మించాలనే నిబంధనను తుంగలోకి తొక్కి ఇష్టానుసారంగా విటిని నిర్మిస్తున్నారు. వృద్ధులకు, చిన్న పిల్లలకు, గర్భిణులకు ఈ రేడియేషన్ చాలా ప్రమాదకరం. మానవ శరీరంలో నిత్యం అనేక కణాలు నూతనంగా పుడుతుంటాయి కొన్ని మరణిస్తూ ఉంటాయి. సక్రమంగా కణ విచ్చిత్తి చర్య జరిగితేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు .
ఈ డియేషన్ వలన కణ విచ్చిత్తి చర్య గాడి తప్పి కణాలు ప్రవర్తించడం వలన క్యాన్సర్ కణుతులు ఏర్పడి మనిషి ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోతున్నాయి. ఈ టవర్లు ఏర్పాటు చేసుకున్న ఇంటి యజమానులు మొబైల్ కంపెనీలు ఇచ్చే అద్దెలకు, వారు ఇచ్చే ఆఫర్లుకు ఆశ పడి వాటి వలన వచ్చే ప్రమాదాలను ఊహించలేక పోతున్నారు. ఈ వైర్‌లెస్ టెక్నాలజీ పెరిగి మనిషి జీవితం సుఖవంతవుతుందని ఆనందం పడాలో రేడియేషన్ వలన వచ్చే వివిధ రకాల భయంకరమైన క్యానర్ తదితర రోగాలతో బాధ పడాలో అర్థం కాని అయోమయ స్థితిలో నేటి యువతరం ఉంది. రేడియేషన్ వలన చర్మ సంబంధ వ్యాధులతో పాటు, కళ్లు ఎర్రబడటం, తల తిరుగుతున్నట్లు అనిపించడం, జుట్టు ఊడిపోవడం, పురుషులకు సంతాన సామర్ధ్యం తగ్గిపోతుంది. ఇప్పుడు ప్రతి ఇంటికో షుగర్ వ్యాధి బాధితులు ఉన్నట్లయితే భవిష్యత్‌లో క్యాన్సర్ వ్యాధి బాధితులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
విద్యుదయస్కాంత తరంగాలతో..
గర్భిణులు, చంటి పిల్లలకు ప్రమాదం ఉంది.. సెల్ ఫోన్ నుంచి వచ్చే విద్యుదయస్కాంత తరంగాల వలన గర్భిణులకు, చంటి పిల్లలకు చాలా ప్రమాదం ఉంది. గర్భంలో శిశువు ఎదుగుదలకు అడ్డుగా మారి, కొన్నిసార్లు అబార్షన్, నెలలు నిండకుండా పిల్లలు పుట్టడం తదితర పరిణామాలు ఉంటాయి. సెల్ టవర్లు ఉన్న ప్రాంతంలో గర్భిణులు, చంటి పిల్లలు విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి.
- డాక్టర్. స్పందన, స్త్రీ, శిశు సంబంధ వైద్యనిపుణులు
తుమ్మెదలు, తేనెటీగలకు నష్టం..
ఈ రేడియేషన్‌తో మొక్కల కిరణ జన్య సంయోగ క్రియకు ఉపయోగపడే పత్రాలలోని క్లోరోఫిల్ నాశనమవుతుంది దీని వలన మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకోలేవు. తుమ్మెదలు, తేనెటీగలు, పిచుకలు ఇతర వివిధ రకాల మొక్కలుకు మేలు చేసే కీటకాలు, పక్షులు మరణిస్తున్నాయి. ఈ పరిస్థితి వలన మొక్కల çపరపరాగ సంప్కరం జరగకుండా పోతూ విత్తనవుత్పత్తికి ఆలస్యమవుతూ పర్యావరణ అసమతుల్యంగా మారి గ్లోబల్ వార్మింగ్‌కు దారితీస్తుంది.
-డి.రమేష్, బోటనీ అధ్యాపకులు
Comments
Please login to add a commentAdd a comment