లబ్బీపేట(విజయవాడతూర్పు) : నగదు రహిత సేవలను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకు వచ్చే లక్ష్యంగా జిల్లాలో ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్స్ అందుబాటులోకి వచ్చాయి. తమ మొబైల్ నంబర్‌నే అకౌంట్ నంబరుగా వినియోగిస్తూ నగదు డిపాజిట్, విత్‌డ్రాల్‌తోపాటు, అన్ని జాతీయ బ్యాంకులు, ఫోన్ బిల్స్, కరెంటు, ఇతర పన్నులను చెల్లించే అవకాశం ఉన్నట్లు నగరంలోని ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్ ప్రతినిధి మద్ది శరత్ చెప్పారు. గవర్నర్‌పేట రాజగోపాలచారి వీధిలోని తన షోరూమ్‌లో గురువారం ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్ వినియోగంపై మీడియాకు వివరించారు. ఈ నెట్‌వర్క్‌కు చెందిన మొబైల్ నంబరు ఉన్నా, తమ స్మార్ట్‌ఫోన్‌లోకి ఎయిర్‌టెల్ మనీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే, పేమెంట్ బ్యాంక్ అకౌంట్‌ను పొందవచ్చన్నారు. ఆ కౌంట్‌లో రూ. వంద నుంచి ఎంత మొత్తాన్ని అయినా డిపాజిట్ చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్‌లోని నగదును తమ ఇతర బ్యాంక్ ఖాతాలోకి, ఇతరుల ఖాతాలోకి సులువుగా ట్రాన్స్‌ఫర్ చేయవచ్చన్నారు. ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్ సేవింగ్ అకౌంట్‌లోని మొత్తంపై దేశంలోనే అత్యధికంగా 7.50 శాతం వడ్డీ చెల్లించనున్నట్లు తెలిపారు. ప్రతి అకౌంట్ దారునికి రూ.లక్ష పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూ్యరెన్స్ సౌకర్యం కల్పించనున్నట్లు శరత్ తెలిపారు. ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్ ఖాతాదారుల్లో 70 శాతం గ్రామీణులు ఉండేలా చూడడమే లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల వాసులకు నగదు రహిత సేవలు అందుబాటులోకి తీసుకు రావడమే లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు.