
ఆదా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులు సృష్టించింది. తాజాగా ఇటీవల రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది. సుదీప్తోసేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఊహించని వసూళ్లు రాబడుతూ అద్భుతాలు సృష్టిస్తోంది. ఈ మూవీ విడుదలకు ముందు కొన్ని వివాదాలు చుట్టిముట్టినా అవేవీ సినిమాపై పెద్దగా ప్రభావితం చూపలేకపోయాయి. విపుల్ షా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా మే 5న విడుదలైంది.
(ఇది చదవండి: 'ది కేరళ స్టోరీ' ప్రభంజనం.. ఆలియా భట్ సినిమా రికార్డ్ బ్రేక్!)
తాజాగా ఆదా శర్మకు మరో షాక్ తగిలింది. సోషల్ మీడియా ద్వారా ఓ వ్యక్తి ఆమె వ్యక్తిగత వివరాలను లీక్ చేశారు. అదా శర్మ ఫోన్ నంబర్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ సంఘటన తర్వాత అదా శర్మకు వేధింపులు ఎక్కువయ్యాయని తెలుస్తోంది. అయితే ఆదా శర్మ వివరాలు షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ యూజర్ అకౌంట్‌ను వెంటనే డీ యాక్టివేట్ చేశారు. అంతే కాకుండా ఆమె కొత్త కాంటాక్ట్ నంబర్‌ను లీక్ చేస్తానని బెదిరించినట్లు సమాచారం.
(ఇది చదవండి: ఉపాసనకు ప్రెగ్నెన్సీ.. రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్!)
కాగా.. ఆదా శర్మ, దర్శకుడు సుదీప్తో సేన్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ది కేరళ స్టోరీ బృందం కరీంనగర్‌లో జరిగే హిందూ ఏక్తా యాత్రలో పాల్గొనాల్సి ఉండగా.. రోడ్డు ప్రమాదం జరగడంతో విరమించుకున్నారు. ఈ విషయాన్ని ఆదా శర్మ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment