ఆ ఫ్లాట్‌లో హీరో సూసైడ్.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్! | Is Adah Sharma Buying Sushant Singh Rajput House In Bandra West? - Sakshi
Sakshi News home page

Adah Sharma: ఆదా శర్మకేమైంది.. హీరో సూసైడ్ చేసుకున్న ఫ్లాట్‌ను!

Published Sat, Aug 26 2023 6:31 PM | Last Updated on Sat, Aug 26 2023 6:51 PM

Adah Sharma Buys Sushant Singh Rajput Suicide Home At Bandra West - Sakshi

ఈ ఏడాది ది కేరళ స్టోరీ సినిమాతో క్రేజ్ దక్కించుకున్న భామ ఆదా శర్మ. కేరళలో జరిగిన బాలికల మిస్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా ఆదా శర్మకు మరింత గుర్తింపును తీసుకొచ్చింది. ఇటీవల కమాండో వెబ్ సిరీస్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సిరీస్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రీమియర్ అవుతోంది. అయితే తాజాగా ఆదా శర్మకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరలవుతోంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం. 

(ఇది చదవండి: సినిమాల్లో కూడా అవకాశాలొచ్చాయి.. కానీ: అభిషేకం సీరియల్ నటి)

ఎంఎస్ ధోని చిత్రంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. ఊహించని పరిణామాలతో ఆత్మహత్య చేసుకున్నారు. ముంబయిలోని బాంద్రాలోని మాంట్ బ్లాంక్ అపార్ట్‌మెంట్స్‌లో సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ ఇంటిని ది కేరళ స్టోరీ స్టార్ ఆదా శర్మ కొనుగోలు చేసినట్లు బీటౌన్‌ సమాచారం.

అయితే గతంలో సుశాంత్ ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఆ ఇంటికి సుశాంత్ నెలకు రూ.4.5 లక్షలు అద్దె చెల్లించేవారట. అయితే ఈ విషయంపై ఆమె ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం పెద్దఎత్తున వైరలవుతోంది. అయితే త్వరలోనే ఆ ఇంటికి మారబోతున్నట్లు కూడా తెలుస్తోంది. కాగా.. 2009లో హిందీ హారర్ చిత్రం 1920తో రజనీష్ దుగ్గల్ సరసన బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది ఆదాశర్మ. 

(ఇది చదవండి: క్రైమ్ థ్రిల్లర్‌ నేపథ్యంలో వస్తోన్న 'క్రిమినల్' !)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement