కోల్‌కతా: దేశవ్యాప్తంగా జనాలు కరోనాతో విలవిల్లాడుతుంటే.. ధైర్యం చెప్పాల్సిన రాజకీయ నాయకులు బాధ్యతరహితంగా ప్రవర్తిస్తున్న విధం చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. అవును మరి ఎన్నికల సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో పార్టీలు భారీ ఎత్తున జనాలను పోగు చేసి ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించారు. ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోలేదు. ఆ ఫలితం ఇప్పుడు జనాలు అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో రాజకీయ నాయకులకు బుద్ది చెప్పడం కోసం పశ్చిమబెంగాల్ నెటినులు చేసిన ఓ వినూత్న ఆలోచన తాజాగా నెట్టింట్లో తెగ వైరలవుతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేసిన నేతలు ప్రస్తుతం ఇళ్లకే పరిమితయ్యారు. ఎన్నికల వేళ ఎలాంటి నిబంధనలు పాటించకుండా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించి వైరస్ వ్యాప్తికి కారణమయిన రాజకీయ నాయకులు ప్రసుత్తం వైరస్ విజృంభిస్తున్న వేళ ఎవరూ కనిపించడం లేదు. దాంతో నెటిజనులు సదరు నాయకుల పేర్లు, వారి వ్యక్తిగత ఫోన్ నంబర్లున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీరిలో టీఎంసీ, బీజేపీ రెండు పార్టీల నేతలున్నారు.
ఫోన్ నంబర్లున్న ఫోటోతో పాటు ‘‘కరోనా అంటే భయం ఎందుకు. మన దగ్గర రాజకీయ నాయకులున్నారు. జనాలకు కష్టం వచ్చిందంటే చాలు.. వారు ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా ప్రజల కోసం పాటు పడతారు. మీకు ఆక్సిజన్, రక్తం, మాస్క్, శానిటైజర్, అంబులెన్స్ వంటి సేవలు కావాల్సి వస్తే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఫోటోలోని నాయకుల నంబర్‌కు కాల్ చేయండి’’ అనే మెసేజ్ చేశారు. ఈ ఫోటోల 14 మంది బీజేపీ, టీఎంసీ నాయకుల పేర్లు, వారి వ్యక్తిగత మొబైల్ నంబర్లు ఉన్నాయి. వీరిలో సువేందు అధికారి, బాబుల్ సుప్రియో, రాజ్ చక్రవర్తి వంటి ప్రముఖులు పేర్లు కూడా ఉండటం గమనార్హం.
ఇక బెంగాల్‌లో ఆదివారం ఒక్కరోజన 15,889 కేసులు వెలుగు చూశాయి. చాలా ఆస్పత్రుల్లో బెడ్లు, మందులు, ఆక్సిజన్ కొరత నెలకొంది. దాంతో పలు ఆస్పత్రులు కొత్త వారిని ఎవరిని చేర్చుకోవడం లేదు. ఇక వైరస్ వ్యాప్తికి అసెంబ్లీ ఎన్నికలే కారణమని జనాలు బలంగా విశ్వసిస్తున్నారు. అన్ని పార్టీలు ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించాయి. జనాలు పెద్ద ఎత్తున గుమిగూడారు. వీరిలో చాలా మంది మాస్క్ కూడా ధరించలేదని.. అందువల్లే వైరస్ వ్యాప్తి ఉధృతం అయ్యిందని సామాన్యులుఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment