బాలికపై పది రోజుల పాటు అత్యాచారం | a man committed rape for ten days | Sakshi
Sakshi News home page

బాలికపై పది రోజుల పాటు అత్యాచారం

Published Wed, Mar 4 2015 12:08 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

బాలికను అపహరించి రోజుల తరబడి అత్యాచారం చేసిన నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

బంజారాహిల్స్ (హైదరాబాద్): బాలికను అపహరించి రోజుల తరబడి అత్యాచారం చేసిన నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నెం. 11లోని ఉదయ్‌నగర్‌లో నివసించే బట్టు రాము(21) తన ఇంటి పక్కన నివసిస్తున్న ఆరో తరగతి విద్యార్థిని(11)ని గత కొంత కాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. వారం క్రితం బాలికను అపహరించి నిజామాబాద్ జిల్లా బాన్సువాడకు తీసుకెళ్లి అక్కడ తనకు బాగా తెలిసిన వారి ఇంట్లో ఉంచాడు. పది రోజుల పాటు ఆమెపై అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించి... సెల్‌ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement