సాక్షి,ముంబై: దేశీయ ఆన్‌లైన్ చెల్లింపుల సంస్థ పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. పేటీఎం వినియోగదారులు యూపీఐ ద్వారా ఏ మొబైల్ నంబరుకైనా డిజిటల్ చెల్లింపు చేయవచ్చు. అంతేకాదు రిసీవర్ పేటీఎంలో రిజిస్టర్ కాక పోయినా కూడా వారి యూపీఐ ఐడీద్వారా ఏదైనా మొబైల్ నంబర్‌కు డబ్బు పంపవచ్చు లేదా స్వీకరించ వచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం రిజిస్టర్డ్ UPI IDతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సార్వత్రిక డేటాబేస్‌ను యాక్సెస్‌కు, యూపీఎల్ చెల్లింపులకు అనుమతి పొందినట్టు తెలిపింది. (వన్‌ప్లస్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదే లక్కీ చాన్స్!)
పేటీఎం యూపీఐ ద్వారా నగదు ఎలా పంపాలి
♦ Paytm యాప్‌లోని ‘UPI మనీ ట్రాన్స్‌ఫర్’ విభాగంలో, ‘ టూ UPI యాప్స్’ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
♦ ఇక్కడ మొబైల్ నంబర్‌ను నమోదు చే గ్రహీత మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.
♦ నగదును నమోదు చేసి, తక్షణ నగదు బదిలీ కోసం ‘పే నౌ ’ బటన్ క్లిక్ చేయాలి.
యూపీఐ నెట్ వర్క్ ఇదొక కీలక పరిణామామని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ప్రతినిధి తెలిపింది. ఇది తమ వినియోగదారులుమ రింత మంది వినియోగదారులు ఏదైనా UPI యాప్ ద్వారా డబ్బు పంపడానికి, స్వీకరించడానికి వీలు కల్పిస్తుందని, అంతరాయం లేని, సురక్షితమైన చెల్లింపులకవసరమైన బలమైన మౌలిక సదుపాయాలను వినియోగదారులకు అందిస్తున్నట్టు తెలిపారు. (ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్! ఇక కనీస రీచార్జ్ ప్లాన్ ఎంతంటే?)
కాగా ఎన్‌పీసీఐ తాజా నివేదిక ప్రకారం, పేటీఎం లబ్ధిదారు బ్యాంకుగా PPBL 1,614 మిలియన్ లావాదేవీలను నమోదు చేసింది, రెమిటర్ బ్యాంక్‌గా, అక్టోబర్ 2022లో 362 మిలియన్లకు పైగా లావాదేవీలను నమోదు చేసింది.అలాగే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ UPI లావాదేవీల పరిమాణంలో అతిపెద్ద లబ్ధిదారుల బ్యాంక్‌గా టాప్‌లో ఉంది. అక్టోబర్ 2022లో 1,614 మిలియన్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు కంపెనీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment