ఈరోజుల్లో ప్రతిఒక్కరికీ మొబైల్ ఫోన్ ఉంటుంది. ఫోన్ లేనివారు ఉండటం చాలా అరుదు. ఇప్పుడన్నీ డ్యుయల్ సిమ్ ఫోన్ కావడంతో చాలా మందికి రెండు ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయి. ఇంకొంత మందికి అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు.
ఏదైనా టెలికామ్ సంస్థ నుంచి కొత్తగా సిమ్ తీసుకుంటున్నప్పుడు చాలామంది తమకు నచ్చిన కస్టమైజ్డ్ మొబైల్ నంబర్‌లను ఇష్టపడతారు. కొంతమందికి ప్రత్యేకమైన ఇష్టమైన నంబర్‌లు ఉంటే, మరికొందరు కొన్ని నంబర్‌లను అదృష్టంగా భావిస్తారు. ఇలా మంచి నంబర్‌ల కలయిక కోసం శోధిస్తారు. అయితే తమకు కావలసిన నంబర్ కాంబినేషన్‌లను ఎంచుకునే అవకాశం ఉందని చాలా మందికి తెలియదు.
వొడాఫోన్ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్, రిలయన్స్‌తో సహా భారతీయ టెలికాం మార్కెట్‌లోని కొన్ని కంపెనీలు ఆసక్తిగల సబ్‌స్క్రైబర్‌లకు వారికి నచ్చిన మొబైల్ నంబర్‌ల నిర్దిష్ట అంకెలను అందిస్తున్నాయి. వీటిలో రిలయన్స్ జియో తక్కువ ధరకే ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు కావాల్సిన నిర్దిష్టమైన మొబైల్ నంబర్లను అందిస్తోంది. ఈ ఛాయిస్ నంబర్ స్కీమ్ ద్వారా కస్టమర్లు పూర్తి నంబర్‌ను ఎంచుకోలేనప్పటికీ తమ కొత్త జియో నంబర్‌లోని చివరి 4 నుంచి 6 అంకెలను ఎంచుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment