పెళ్లికూతురు కావలెను అంటున్న హీరో | Hero arya released video about his marriage | Sakshi
Sakshi News home page

పెళ్లికూతురు కావలెను అంటున్న హీరో

Nov 21 2017 6:40 PM | Updated on Nov 21 2017 6:40 PM

Hero arya released video about his marriage - Sakshi

సాక్షి, చెన్నై: వధువు కావాలంటూ నటుడు ఆర్య తన సెల్‌ఫోన్‌ నంబరు సహా ప్రకటించిన వీడియో ప్రకటన ఒకటి మంగళవారం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. అందులో ఆయన స్నేహితులు కొందరు పెళ్లెప్పుడు చేసుకుంటావు? ప్రేమించిన అమ్మాయిని చేసుకోవచ్చుగా..అంటూ ప్రశ్నిస్తారు. అందుకు ఆర్య.. ‘నాకు ఆ విధంగా ఉంటే చెప్పకుండా దాస్తానా? అమ్మాయి ఎవరూ దొరకడం లేదు.. ఏప్రిల్‌లో ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి' అంటూ సమాధానం ఇస్తాడు. 

ఇది ఇలావుండగా వాట్సాప్‌లో మంగళవారం ఆర్య ఒక వీడియో విడుదల చేశాడు. అందులో ఆయన ఇటీవల విడుదలైన ఆ వీడియో గురించి మాట్లాడారు. ఆవీడియో తనకు తెలియకుండా జిమ్‌లో స్నేహితులు తీశారని, అందులో మాట్లాడిన విషయం నిజమేనన్నాడు. ప్రస్తుతం తాను అమ్మాయి కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నట్లు తెలిపాడు. బంధువులు, స్నేహితులు, వెబ్‌సైట్‌ ద్వారా వధువు కోసం అన్వేషిస్తారని పేర్కొన్నాడు. 

తాను ప్రస్తుతం మొబైల్‌ నంబర్‌ ఇస్తానని, తాను మంచి భర్త కాగలనని ఏఅమ్మాయైనా భావిస్తే, తనను 7330173301 నంబర్‌ ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. దీన్ని వేళాకోళంగా తాను చెప్పడం లేదని, తనకు ఎటువంటి నిబంధనలు, అంచనాలు లేవన్నారు. ఇది తన జీవితానికి సంబంధించిన విషయమని, అందుచేత మీ ఫోన్‌ కాల్స్‌ కోసం వేచిచూస్తానని ఆ వీడియోలో తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా వ్యాపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement