
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల గుర్తింపు కార్డుగా ఆధార్‌ను ఎందుకు ఉపయోగించకూడదని మాజీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి టీఎస్ కృష్ణమూర్తి మంగళవారం అన్నారు. ఎన్నికల్లో ఆధార్ కార్డును ఏకైక వ్యక్తిగత గుర్తింపు కార్డుగా ఉపయోగిస్తే.. మంచిదని ఆయన సూచించారు. ఎన్నికల సమయంలో ఓటర్ గుర్తింపు కార్డు లేనివారికోసం అనేక ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులను ఎన్నికల సంఘః అనుమతిస్తోందని చెప్పారు. దీని వల్ల అనేక సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఓటర్ గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయంగా ఆధార్ కార్డును ఉపయోగించుకోవడం మంచిదని ఆయన తెలిపారు. అక్రమాలుఓట జరిగే అవకాశముందని ఆయన అన్నారు.
ఆధార్ కార్డును ఇప్పుడు దేశమంతా వ్యక్తిగత గుర్తింపు కార్డుగా వినియోగిస్తున్నారు. అంతేకాక పలు పథకాలను ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నారు. ఇదే పద్దతిని ఎన్నికల్లో కూడా చేస్తే బాగుంటుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం దేశంలోని ఓటర్లందరికీ ఓటర్ గుర్తింపు కార్డులు లేవు.. కానీ దేశంలోని 90 శాతం జనాభాకు ఆధార్ ఉంది. కాబట్టి ప్రత్యేకంగా ఓటర్ గుర్తింపు కార్డు రూపొందిచేకన్నా.. ఆధార్‌నే అందుకు వినియోగిస్తే.. సమయం, డబ్బు, శ్రమ ఆదా అవుతాయని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment