మాట్లాడుతున్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్
మాదాపూర్: ఓటరు ఐడీ కార్డులపై ప్రతి ఒక్క రూ అవగాహన పెంపొందించుకోవాలని, పాస్‌పోర్ట్‌ల కోసం ఎలా ఆసక్తి చూపుతారో అదే విధ ంగా ఓటర్ ఐడీల కోసం కూడా ఆసక్తి చూపాలని తెలంగాణ సీఈఓ రజత్‌కుమార్, వెస్ట్ జోనల్ కమిషనర్ హరిచందన అన్నారు. మాదాపూర్ లోని సైబర్ కన్వెన్షన్ సెంటర్‌లో మంగళవారం ఓటర్ ఐడీల వెరిఫికేషన్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటర్ ఐడీలో ఉన్న తప్పు ఒప్పులను ఎప్పటికప్పుడు సరి చూసుకోవాలని, ఆన్‌లైన్‌లో తప్పు ఉన్నా పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు, చిరునామాల్లో తప్పులు గుర్తిస్తే వెంటనే సరిదిద్దుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు డేటాను సరి చేసుకోవడం వల్ల ఎన్నికల సమయంలో సరైన డేటా అందుబాటులో ఉండడం వల్ల ఏలాంటి ఇబ్బందులకు గురి కావాల్సిన అవసరం లేదన్నా రు. డోర్ టూ డోర్ వెరిఫికేషన్ సమయంలో ఇం టి యాజమానులు లేనప్పుడు ఇరుగు పొరుగు చెప్పే సమాధానాలు తప్పుగా ఉండడంతో తప్పుడు సమాచారం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. కాలనీలు, గ్రామాల్లో ఓటర్ ఐడీల పై పూర్తిగా అవగాహన కల్పించాలన్నారు. రెండు కిలో మీటర్ల దూరంలో పోలింగ్ బూత్ ఉండేలా చూసుకోవాలన్నారు.
సంక్షేమ సంఘా లు, స్వచ్ఛంద సంస్థలు తమవంతు బాధ్యతగా సహకరించాలన్నారు. 1 జనవరి 2001 లోపు పుట్టినట్లయితే ఓటరు గుర్తింపు కార్డును పొందవచ్చన్నారు. www.nvrp.in లేదా నా ఓట్ యాప్‌లో చూసుకోవచ్చన్నారు. తెలుగులో కూడా వెబ్‌సైట్ అందుబాటులో ఉందని తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవచ్చునని, జాబితాలో పేరు లేకుంటే, పేరు పరిశీలించుటకు, వివరాలను సరి చేసుకోవడానికి www.nvrp.in పాస్ పోర్ట్‌లు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లే దా ధృవీకరణ పత్రాలను ఆప్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 1950 టోల్ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు. అనంతరం సంక్షేమ సంఘాలు, డ్వాక్రా సంఘాలు, సీనియర్ సిటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. కార్యక్రమంలో తెలంగాణ జాయింట్ సీఈఓ రవికిరణ్, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్ భరణి, శ్రీనివాసులు, డిప్యూటీ కమిషనర్లు రమేష్, వెంకన్న, యాదగిరిరావు, బాలయ్య, లెట్స్ ఓటు ఆర్గనైజేషన్ నిర్వాహకులు సుబ్బ రంగయ్య, మహిళా సంఘాలు, వెల్ఫేర్ అసోసియేషన్లు, డ్వాక్రా మహిళలు, సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment