New voter registration
-
ఈసీపై పిటిషన్ కొట్టేసిన సుప్రీం
న్యూఢిల్లీ: ఓటరు గుర్తింపు కార్డు అప్డేట్, కొత్త ఓటరు నమోదు దరఖాస్తుల్లో ఆధార్ సంఖ్యను జత చేయడానికి సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పష్టమైన మార్పులను చేపట్టనందుకు ఎన్నికల సంఘం అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం కొట్టేసింది. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ వేసిన పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం విచారించింది. ఈ విషయంలో ఈసీకి మేం డెడ్లైనేదీ పెట్టలేదని పేర్కొంది. -
ఓటరు నమోదుకు ఏడాదిలో 4 కటాఫ్ తేదీలు
న్యూఢిల్లీ: కొత్త ఓటర్ల నమోదుకు ఏడాదిలో నాలుగు కటాఫ్ తేదీలను అందుబాటులోకి తేవాలని కేంద్రం యోచిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఎన్నికల చట్టంలో సవరణలు చేయనుంది. దీనివల్ల దేశంలో జరిగే స్థానిక సంస్థలు, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ఉపయోగపడే ఉమ్మడి ఓటరు జాబితా రూపకల్పనకు వీలవుతుంది. యువజన ఓటర్లు మరింత మందిని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములను చేయడానికి కూడా ఈ ప్రయత్నం తోడ్పడుతుందని పార్లమెంటరీ కమిటీకి కేంద్ర న్యాయశాఖ తెలిపింది. ప్రస్తుతం జనవరి ఒకటో తేదీన, అంతకంటే ముందు 18 ఏళ్లు నిండిన వారు మాత్రమే ఆ ఏడాది తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవచ్చు. ఆ ఏడాదిలో జరిగే ఎన్నికల్లో ఓటు వేసేందుకు వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. అయితే, జనవరి 2 జన్మించినా వారు మళ్లీ ఏడాదిదాకా ఆగాల్సిందే. అందుకే, ఏడాదిలో నాలుగు కటాఫ్ తేదీలను జత చేస్తూ ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 14(బి)ని సవరించాలని యోచిస్తున్నట్లు న్యాయశాఖ తెలిపింది. సంవత్సరంలో.. జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1లను కటాఫ్ తేదీలుగా మార్చే ప్రతిపాదనలను ఎన్నికల సంఘం పరిశీలిస్తోందని కేంద్రం తెలిపింది. -
పెరిగిన ఓటర్లు
వరంగల్ రూరల్: ఓటు హక్కును వినియోగించుకోవడం అందరి బాధ్యత.. ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రభుత్వ అధికారులు చేసిన ప్రయత్నం సక్సస్ అయింది. త్వరలో నిర్వహించనున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని భార త ఎన్నికల సంఘం ఇచ్చిన ఓటరు నమోదు, సవరణ, పోలింగ్ కేంద్రాల మార్పునకు జిల్లా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభి ంచింది. ఏకంగా జిల్లా నుంచి 34, 291 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల ఓటరు నమోదు, సవరణలు, చేర్పులు, మార్పులకు సంబంధించి జిల్లా, రాష్ట్ర ఎన్నికల కమిషన్లు అవకాశాలు కల్పించాయి. నర్సంపేట శాసనసభ నియోజకవర్గంలో ఫాం–6లో 18,586 దరఖాస్తులు, ఫాం –7లో 334 దరఖాస్తులు, ఫాం–8 లో 2638 దరఖాస్తులు వచ్చాయి. ఫాం –8ఏ లో 546 దరఖాస్తులు వచ్చాయి. పరకాల శాసనసభ నియోజవర్గంలో ఫాం–6లో 9137 దరఖాస్తులు నమోదయ్యాయి. ఫాం–7లో 1254 దరఖాస్తులు, ఫాం –8లో 1631 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఫాం–8ఏలో 185 దరఖాస్తులు నమోదయ్యాయి. ఈ నెల 4తో ఓటర్ల నమోదు గడువు ముగిసింది. ఈ నెల 14 లోపు దరఖాస్తుల పరిశీలన, 22న తుది జాబితా విడుదల చేస్తారు. ఇప్పటికే నర్సంపేట, పరకాల శాసనసభ స్థానాల్లో 4,07,960 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో జనవరి 25తో ముగిసిన ఓటరు నమోదు గడువును ఫిబ్రవరి 4 వరకు భారత ఎన్నికల సంఘం పొడిగించింది. జిల్లాలో భౌతికంగా వర్ధన్నపేట, నర్సంపేట, పరకాల శాసనసభ నియోజవర్గాలు ఉన్నాయి. కాని వర్ధన్నపేట నియోజకవర్గం ఓటర్ల నమోదు, సవరణలు, మార్పులు, చేర్పులను వరంగల్ అర్బన్ జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తుంది. నర్సంపేట, పరకాల శాసనసభ నియోజకవర్గాల ఓటర్ల నమోదు, సవరణ, మార్పులు, చేర్పులు తొలగింపులు చేపడుతుంది. జిల్లాలో ఓటర్ల నమోదు ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరిత, జాయింట్ కలెక్టర్ రావుల మహేందర్‌రెడ్డి పర్యవేక్షించారు. నర్సంపేట నియోజకవర్గంలో.. నర్సంపేట శాసనసభ నియోజకవర్గంలో ఫాం 6, ఫాం–7 , ఫాం –8 , ఫాం–8ఏ కింద 18,586 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఫాం –6లో 17,245 దరఖాస్తులు పరిష్కరించగా, 1341 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఫాం –7లో 334 దరఖాస్తులు రాగా, వాటిలో 273 దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. ఇంకా 61 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఫాం –8లో 2,638 దరఖాస్తులు రాగా ఇప్పటికే 670 పరిష్కారమయ్యాయి. 1968 పెండింగ్‌లో ఉన్నాయి. ఫాం –8ఏలో 546 దరఖాస్తులు రాగా 306 పరిష్కారమయ్యాయి. 240 పెండింగ్‌లో ఉన్నాయి. పరకాల నియోజకవర్గంలో.. పరకాల నియోజకవర్గంలో 9137 దరఖాస్తులు రాగా, ఫాం –6లో 8277 దరఖాస్తులు పరిష్కరించగా 860 పెండింగ్‌లో ఉన్నాయి. ఫాం–7లో 1583 దరఖాస్తులు రాగా 1476 పరిష్కరించగా 112 పెండింగ్‌లో ఉన్నాయి. ఫాం–8లో 1611 దరఖాస్తులు రాగా 1216 దరఖాస్తులను పరిష్కరించారు. ఇంకా 394 పెండింగ్‌లో ఉన్నాయి. ఫాం–8ఏలో 183 దరఖాస్తులు రాగా 74 పరిష్కరించగా 111 పెండింగ్‌లో ఉన్నాయి. 22కల్లా తుది జాబితా వెల్లడి భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం జనవరి 1, 2019 వరకు 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కొత్త ఓటర్లకు ఓటరు నమోదుకు అవకాశం కల్పించింది. ఈ నెల 12 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తాం. 14 లోపు డాటాబేస్‌లో నమోదు చేసి , 22న కల్లా ఓటర్ల తుది జాబితా వెల్లడిస్తాం. – మహేందర్‌రెడ్డి, ఇన్చార్జి కలెక్టర్ -
దగ్గరుండి చూసుకోండి!
సాక్షి, హైదరాబాద్: కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో క్రియాశీలకంగా వ్యవహరించాలని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. అర్హులైన అందరి పేర్లను ఓటరు జాబితాలో చేర్పించేందుకు ప్రతి గ్రామంలోనూ చొరవ తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఓటర్ల జాబితా సవరణ, టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. ‘ఓటర్ల జాబితాలో సవరణలపై దృష్టి సారించాలి. ఎన్నికల కమిషన్ మరో నెల రోజులపాటు కొత్త ఓటర్ల నమోదుకు, జాబితాలో గల్లంతైన ఓటర్లను చేర్పించేందుకు అవకాశం కల్పిస్తోంది. ప్రతి గ్రామంలోనూ టీఆర్ఎస్ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకునిపోవాలి. టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు.. ఎమ్మెల్యేలతో, నియోజకవర్గ ఇన్‌చార్జీలతో సమన్వయం చేస్తూ.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరినీ జాబితాలో చేర్పించేలా చొరవతీసుకోవాలి. ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పార్టీ అధినేత ఆదేశించారు. ఈనెల రోజుల్లో సాధ్యమైనంత ఎక్కువ మందిని ఓటర్ల జాబితాలో చేర్చేలా చూడాలి. పార్టీ మండలాధ్యక్షులతో, ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నేరుగా మాట్లాడి ఓటర్ల నమోదు ప్రక్రియను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలి. ప్రధాన కార్యదర్శులు ఈ నెలలో వీలైనన్ని ఎక్కువ రోజులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ శ్రేణులకు దిశానిర్దేశం చేయాలి. కొత్త ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియను పర్యవేక్షించేందుకు తెలంగాణభవన్‌లో ప్రత్యేక బందాన్ని ఏర్పాటు చేస్తున్నాం. టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌రెడ్డి ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తారు’అని కేటీఆర్ పేర్కొన్నారు. జిల్లాల్లో భవనాలు టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాల భవనాల నిర్మాణాలన్ని వేగంగా పూర్తి చేయాలని కేటీఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. ‘టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాల భవనాల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసే బాధ్యతను సీఎం కేసీఆర్ మనకు అప్పగించారు. ప్రభుత్వ అనుమతి మేరకు ప్రతి జిల్లా కార్యాలయానికి ఒక ఎకరం స్థలాన్ని కొనుగోలు చేసేందుకు అవకాశముంది. ఇప్పటికే దాదాపు 20 జిల్లా కేంద్రాల్లో స్థలాల ఎంపిక పూర్తయింది. మిగిలిన జిల్లాల్లో స్థలాలను ఎంపిక కోసం ఎమ్మెల్యేలతోపాటు టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు స్వయంగా వెళ్లి పరిశీలించాలి. సంక్రాంతి తర్వాత వరుసగా జిల్లా కార్యాలయాలకు శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతాయి’అని ఆయన వెల్లడించారు. పెద్దపల్లి గొడవపై దృష్టి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెద్దపల్లి లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో నెలకొన్న వర్గపోరుకు తెరదించడంపై కేటీఆర్ దృష్టి పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రభుత్వ సలహాదారు జి.వివేక్ తమకు ఇబ్బంది కలిగించారని ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్ (ధర్మపురి), బాల్క సుమన్ (చెన్నూరు), దాసరి మనోహర్‌రెడ్డి(పెద్దపల్లి) ఇటీవల కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ ఇన్చార్జ్ బస్వరాజు సారయ్య, జి.వివేక్, బాల్క సుమన్‌లను క్యాంపు కార్యాలయానికి పిలిచి మాట్లాడారు. నేతల మధ్య సమన్వయలోపంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారి అభిప్రాయాలను విన్న తర్వాత ఇకముందు ఇలాంటివి జరగొద్దని.. అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, అరూరి రమేశ్‌లు కూడా క్యాంపు కార్యాలయంలో కేటీఆర్‌ను కలిశారు. యాంకర్ సుమ భేటీ తెలంగాణ భవన్లో గురువారం కేటీఆర్‌ను టీవీ యాంకర్ సుమ కలిశారు. ‘ఒక మంచి పని కోసం వచ్చాను. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలను వెల్లడిస్తాను’అని భేటీ అనంతరం ఆమె వెల్లడించారు. ఎమ్మెల్యేలు టి.రాజయ్య, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జి.విఠల్ రెడ్డి, ఎన్. నరేందర్, పట్నం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. -
నేటితో గడువు పూర్తి
కరీంనగర్‌సిటీ: మంచి పాలన కావాలి.. మంచి నేత రావాలి.. మరి ఏం చేయాలి? నినదించా లి? నిలువరించాలి? ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి? అంటే.. ఓటు వేయాలి? వేయాలంటే ముందు ఓటరుగా నమోదు చేసుకోవాలి.. ఇదే ఆఖరి అవకాశం.. వదిలితే అథఃపాతాళం.. ‘లేవండి! మేల్కొనండి! ఇకపై నిద్రించకండి.. అజ్ఞానాంధకారం నుం చి బయటికి రావాలి..’ అన్న స్వామీ వివేకానంద మాటలను స్ఫూర్తిగా తీసుకుని ఓటు అనే వజ్రాయుధం సంధించడంలో ముందు వరుసలో నిలవాల్సిన తరుణమిదే. ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం ఆఖరి అవకాశం ఇ చ్చింది. యువతకు ప్రాధాన్యం కల్పించాలన్న ప్రధాన ఉద్దేశంతోపాటు అర్హులైన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలనే లక్ష్యంతో విస్తృత అవగాహన కల్పిస్తోంది. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రత్యేక శ్రద్ధతో రెవెన్యూ, ఇతర శా ఖల అధికారులు, ఉద్యోగులు బిజీబిజీగా ఉన్నా రు. విధుల్లో దాదాపు 90 శాతం ఎన్నికల నిర్వహణ కసరత్తుపైనే దృష్టిసారించారు. ఓటరు నమోదుకు గడువు సమీపించడంతో అవగాహ న సదస్సులు, ర్యాలీలు విస్తృతం చేశారు. ఎన్నిక ల సంఘం ఈనెల 10న ప్రకటించిన ముసాయిదా జాబితా అనంతరం సెప్టెంబర్ 25 వరకు ఓటరుగా నమోదు చేసుకునేందుకు, మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించింది. జిల్లాలో ఇంకా 60 వేలకు పైగా ఓటు హక్కు పొందాల్సి ఉన్నట్లు జిల్లా యంత్రాంగం చెబుతోంది. ఓటరు నమోదుకు స్పందన ఇప్పటివరకు ఓటరు నమోదుకు గాను 57,040 దరఖాస్తులు వచ్చాయి. ఈ లెక్కన ఓటరు న మోదుకు మంచి స్పందనే లభించినట్లు తెలు స్తోంది. తొలగింపు, ఆక్షేపణలకు సంబంధించి (ఫారం–7) 10,125, వివరాలను సరిదిద్దేందు కు (ఫారం–8) 4,314, ఒక పోలింగ్ నుంచి మరో పోలింగ్ కేంద్రానికి మార్పునకు (ఫారం–8ఏ) 3,640 దరఖాస్తులు వచ్చాయి. చిరునా మాలు మారడం, ఆధార్ ఇవ్వకపోవడం తదిత ర కారణాలతో జాబితాల్లో నుంచి భారీగా ఓట్లు తొలగించిన క్రమంలో దరఖాస్తుల సంఖ్య పెరగకపోవడం గమనార్హం. గల్లంతయిన పేర్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులకు ఓటు కల్పిం చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఓటరు జా బితాలో పేరు ఉందో లేదో చూసి లేకుంటే అక్క డే ఫారం–6 ద్వారా ఓటు నమోదుకు దరఖాస్తులు ఇస్తున్నారు. కొత్త ఓటర్లతో పాటు మార్పులు, చేర్పులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గడువు పొడిగించేనా..? కొత్తగా ఓటర్లుగా నమోదు కావాలన్నా.. మా ర్పులు, చేర్పులు చేయించుకోవాలన్నా మంగళవారం (నేటి వరకు) వరకే అవకాశముంది. ఈ నెల 15 నుంచి ప్రా రంభమైన ఈ కార్యక్రమం 25 తేదీతో ముగియనుంది. తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పులు చేర్పులకు అవకాశం ఉండదని అధికారులు చె బుతున్నారు. బూత్‌స్థాయి అధికారులకు నేరుగా దరఖాస్తులు ఇవ్వడంతోపాటు ఆన్‌లైన్‌లోనూ ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం ఉంది. పోలింగ్ ఏజెంట్ల సాయంతో ప్రతి గ్రా మంలో జాబితాలో లేని వారిని గుర్తించి వారితో దరఖాస్తులు సమర్పించేలా చేస్తే ఫలితం ఉం టుంది. అయితే ఓటరు నమోదుకు మరిన్ని రోజులు గడువు పొడిగిస్తారా? లేదా అనే విషయంపై సందిగ్ధం నెలకొంది. సహాయ కేంద్రంలో సేవలు.. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రం ద్వారా ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు సేవలందిస్తున్నారు. ఫోన్‌కాల్స్ స్వీకరించి వారి పే రు ఓటరు జాబితాలో ఉందో లేదో తెలియజేస్తున్నారు. బీఎల్వోలు అందుబాటులో ఉన్నారా లే దా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. నగరంలోని 50 డివిజన్లలో 250 మంది బీఎల్వో లు, 100 మున్సిపల్ సిబ్బంది విధుల్లో ఉన్నా రు. డిగ్రీ పీజీ కళాశాలలల్లోనూ ఫారం–6లు అందజేస్తున్నారు. అందుకు ఎంపీడీవోలను పర్యవేక్షకులుగా నియమించారు. కలెక్టరేట్లో సహాయ కేంద్రం నంబర్ 0878–2234731కు సంప్రదించాలని సూచిస్తున్నారు. -
ఓటు నమోదుకు వసూళ్లు
నెల్లూరు(వీఆర్సీ సెంటర్): నెల్లూరు నగరంలోని ఐదో డివిజన్ పాత చెక్‌పోస్టు, అహ్మద్‌నగర్ ప్రాంతాల్లో గత నాలుగు రోజులుగా పోలింగ్ బూత్ నంబరు 106లో కొత్త ఓటుహక్కు నమోదు కార్యక్రమాన్ని పోలింగ్ బూత్ ఆఫీసర్ మంజుల చేపట్టారు. అయితే నమోదు ప్రక్రియలో అవకతవకలు జరిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొత్తగా నమోదు చేసుకునే ఓటరు నుంచి రూ.30 వసూలు చేశారని కొందరు స్థానికులు తెలిపారు. అలాగే ఇంటింటికీ వెళ్లి ఈ ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా ఒకచోట కూర్చుని కొందరి వద్దే వివరాలు సేకరించి వెళ్లిపోయారని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఇప్పటికీ 400 మందికి కొత్తగా ఓటు నమోదు చేసుకునే అవకాశం లేకుండాపోయిందని వాపోతున్నారు. అంతేకాక బీఎల్ఓ ఇంటికి వచ్చి మీరు ఎవరికి ఓటువేస్తారు? అని అడగడం.. చంద్రబాబునాయుడుకు ఓటు వేయండంటూ బహిరంగంగానే ప్రచారం చేయడంపై స్థానికులు, నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఓటు నమోదు చేయలేదు కొత్తగా ఓటు నమోదు ప్రక్రియకు ఆదివారం చివరిరోజు. మా ఇంటికి ఎవరూ రాలేదు. నాకు ఓటు హక్కు రాదేమోనని భయంగా ఉం ది. ప్రతి ఇంటికి వచ్చి కొత్త ఓటర్లను నమోదు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు అలాంటిది జరగలేదు. – ఎస్కే మస్తాన్, బేల్దారి, అహ్మద్‌నగర్ ఓటు నమోదుకురూ.30 తీసుకున్నారు మంజుల రెండు రోజుల నుంచి ఇక్కడ ఓటు నమోదు కార్యక్రమమంటూ వచ్చింది. అయితే మా ఇంట్లో పాత ఓట్లకు ఎలాంటి డబ్బులు తీసుకోలేదు. కొత్తగా ఓటు రాయించుకున్నందుకు రూ.30 అడిగి తీసుకుంది. ఎందుకని అడిగితే ఖర్చులకు కావాలి, పోస్టు ఖర్చులకు అని చెప్పింది. – ఖాదర్‌బీ, బోడిగాడితోట -
ఓటర్ల నమోదు కార్యక్రమం
విజయనగరం కలెక్టరేట్,న్యూస్‌లైన్: కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం ఓటికుండ వ్యవహారంలా మారింది. ఒక వైపు భారీ ఎత్తున ప్రచారం చేస్తూ మరో వైపు హక్కు ఉన్నవారికి ఓటులేకుండా చేస్తున్నారు. ప్రజాస్వామ్యమనే పునాది నిర్మాణానికి మూలస్తంభం ఓటు. అంతటి ప్రాధాన్యం ఉన్న విషయంలో ఓటరుగా చేరడానికి యువత ఆసక్తి కనబరచడం లేదు. దానికి తోడు ఓ వైపు ఓటు వజ్రాయుధం అని ప్రసంగాలు చేస్తున్నప్పటికీ అందుకు అనుగుణంగా ఓటర్ల నమోదు కన్పించడం లేదు. దీనిపై పాలకులు సైతం పెద్దగా శ్రద్ధ కనుబరచడం లేదు. దీంతో ప్రతి ఏడాదీ ఓటర్ల నమోదుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ నామమాత్రంగానే ఉంటున్నాయి. యువత భాగస్వామ్యం పెరిగితే తమ ఉనికికే ప్రమాదమని భావిస్తున్న కొంతమంది నేతలు పూర్తిస్థాయిలో ఓటరు నమోదుకు ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గణాంకాలు కూడా ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ప్రత్యేక కార్యక్రమాల స్పందన కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఓటరుగా చేరడానికి వేలాది మందికి అవకాశం ఉన్నప్పటికీ ముందుకు రావడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కొన్ని గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అధికార పార్టీ నేతలకు అనుకూలంగా పని చేస్తున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. దీని వల్లే 50 ఏళ్లు వయసున్న కొంతమందికి ఓటు లేకుండా పోయింది. బొండపల్లి మండలంలో ఈ పరిస్థితి స్పష్టంగా కన్పిస్తోంది. ఇక్కడ బీఎల్ఓలుగా ఉన్న వారిలో అధికంగా అధికార పార్టీనాయకులు,వారి కుటుంబ సభ్యులకు అనుకూలంగా ఉండే వారే కావడంతో తమకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు బలంగా ఉన్నాయి. కొత్తగా పెళ్లయిన దంపతులతో పాటు ఎక్కడా ఓటు లేకుండా ప్రస్తుతం అదే గ్రామంలో స్థిరనివాసం ఉంటున్నప్పటికీ వారికి ఓటరుగా చేరే అవకాశం లభించడం లేదు. అవకతవకలకు పాల్పడుతున్న వారిపై ఎటువంటిచర్యలు తీసుకోవడం లేదు. ఇదీ పరిస్థితి జిల్లా జనాభా 23.42 లక్షలు. అందులో 16.19 లక్షల మంది ఓటర్లు. వారిలో మహిళా జనాభాతో పాటు మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. అయితే 18 ఏళ్లు దాటిన యువఓటర్ల నమోదు అంతంతమాత్రంగానే ఉంది. జనాభా ప్రకారం 68.34 శాతం మంది ఓటర్లు ఉండాలి. జిల్లాలో ఆ సంఖ్య పెరగాల్సి ఉంది. అలాగే జనాభా ప్రకారం 18 ఏళ్లు దాటిన యువకులు 53 వేల మంది ఉండగా కేవలం ఇప్పటివరకూ 22వేల మంది మాత్రమే ఓటర్లుగా నమోదయ్యారు. ఈ పరిస్థితి చూస్తే యువత ఓటరుగా నమోదులో ఎంత ఆసక్తి చూపిస్తున్నారో స్పష్టమవుతోంది. ప్రభుత్వ అధికారుల సన్నాహాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రచారానికే పరిమితమవుతున్న ప్రత్యేక క్యాంపులు... శతశాతం ఫొటోతో కూడిన ఓటరు జాబితా సిద్ధం చేయడమే లక్ష్యమని అధికారులు చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న కార్యక్రమాలకు పొంతన లేకుం డా పోతోంది. డిసెంబర్ 10 వరకూ ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దీనికి గాను ఆదివారాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి ఓటు చేర్పు,మా ర్పులు,తొలగింపులకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించాలి. దీనికోసం బీఎల్ఓలు సంబంధిత పోలింగ్ కేంద్రంలో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకూ అందుబాటులో ఉండి క్లెయిములు స్వీకరించాలి. అయితే ఇది ప్రచారం వరకూ బాగానే జరుగుతున్నా అనేక కేంద్రాల్లో బీఎల్ఓలు పత్తా ఉండడం లేదు. ఆదివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టరేట్‌కు కూత వేటు దూరంలో ఉన్న కంటోన్మెంట్ ఆర్సీఎం పాఠశాల ఆవరణలో బీఎల్ఓ లేరు. ఇక్కడ ఓటరుగా నమోదయ్యేందుకు వచ్చిన వారు అక్కడ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఆశ్చర్యపోయారు. దీంతో అక్కడ ఫోన్ నంబరు కోసం వెతికారు. అది కూడా కన్పించక పోవడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మరి కొంతమంది ‘ న్యూస్‌లైన్’ రిపోర్టర్లకు ఫోన్ చేసి పరిస్థితి వివరించారు. అధికారులకు సమాచారం అందించడంతో ఎట్టకేలకు ఆర్ఐని కేంద్రంలో అందుబాటులోకి తెచ్చారు. పట్టణం నడిబొడ్డున ఉన్న పాఠశాలల్లోనే పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన ప్రాంతాల్లో ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదేమో. ఈమె పేరు బి. రాజమ్మ. బొండపల్లి మండలంలోని దేవుపల్లి గ్రామం. వయస్సు 45 సంవత్సరాలు పైనే. గతంలో జరిగిన ఎన్నికల్లో ఈమె ఓటు వేసింది. విచిత్రమేమిటంటే ఓటరు జాబితాలో ఇప్పుడు ఈమె పేరు లేదు. ఈ మధ్యకాలంలోనే విషయం తెలిసింది. ఓటు హక్కు కోసం మళ్లీ ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక ఈమె అయోమయంలో ఉంది. ఈమె పేరు పి. రామలక్ష్మి. బొండపల్లి మండలంలోని దేవుపల్లి గ్రామం. ఈమెకు నాలుగు సంవత్సరాల క్రితం వివాహమైంది. రేషన్ కార్డు కూడా ఉంది. ఓటు హక్కు కోసం రెండు దఫాలు దరఖాస్తు చేసుకుంది. అయినా ఓటరు జాబితాలో పేరు లేదు. మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.