వరంగల్ రూరల్: ఓటు హక్కును వినియోగించుకోవడం అందరి బాధ్యత.. ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రభుత్వ అధికారులు చేసిన ప్రయత్నం సక్సస్ అయింది. త్వరలో నిర్వహించనున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని భార త ఎన్నికల సంఘం ఇచ్చిన ఓటరు నమోదు, సవరణ, పోలింగ్ కేంద్రాల మార్పునకు జిల్లా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభి ంచింది. ఏకంగా జిల్లా నుంచి 34, 291 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల ఓటరు నమోదు, సవరణలు, చేర్పులు, మార్పులకు సంబంధించి జిల్లా, రాష్ట్ర ఎన్నికల కమిషన్లు అవకాశాలు కల్పించాయి. నర్సంపేట శాసనసభ నియోజకవర్గంలో ఫాం–6లో 18,586 దరఖాస్తులు, ఫాం –7లో 334 దరఖాస్తులు, ఫాం–8 లో 2638 దరఖాస్తులు వచ్చాయి. ఫాం –8ఏ లో 546 దరఖాస్తులు వచ్చాయి. పరకాల శాసనసభ నియోజవర్గంలో ఫాం–6లో 9137 దరఖాస్తులు నమోదయ్యాయి.
ఫాం–7లో 1254 దరఖాస్తులు, ఫాం –8లో 1631 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఫాం–8ఏలో 185 దరఖాస్తులు నమోదయ్యాయి. ఈ నెల 4తో ఓటర్ల నమోదు గడువు ముగిసింది. ఈ నెల 14 లోపు దరఖాస్తుల పరిశీలన, 22న తుది జాబితా విడుదల చేస్తారు. ఇప్పటికే నర్సంపేట, పరకాల శాసనసభ స్థానాల్లో 4,07,960 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో జనవరి 25తో ముగిసిన ఓటరు నమోదు గడువును ఫిబ్రవరి 4 వరకు భారత ఎన్నికల సంఘం పొడిగించింది. జిల్లాలో భౌతికంగా వర్ధన్నపేట, నర్సంపేట, పరకాల శాసనసభ నియోజవర్గాలు ఉన్నాయి. కాని వర్ధన్నపేట నియోజకవర్గం ఓటర్ల నమోదు, సవరణలు, మార్పులు, చేర్పులను వరంగల్ అర్బన్ జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తుంది. నర్సంపేట, పరకాల శాసనసభ నియోజకవర్గాల ఓటర్ల నమోదు, సవరణ, మార్పులు, చేర్పులు తొలగింపులు చేపడుతుంది. జిల్లాలో ఓటర్ల నమోదు ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరిత, జాయింట్ కలెక్టర్ రావుల మహేందర్‌రెడ్డి పర్యవేక్షించారు.
నర్సంపేట నియోజకవర్గంలో..
నర్సంపేట శాసనసభ నియోజకవర్గంలో ఫాం 6, ఫాం–7 , ఫాం –8 , ఫాం–8ఏ కింద 18,586 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఫాం –6లో 17,245 దరఖాస్తులు పరిష్కరించగా, 1341 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఫాం –7లో 334 దరఖాస్తులు రాగా, వాటిలో 273 దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. ఇంకా 61 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఫాం –8లో 2,638 దరఖాస్తులు రాగా ఇప్పటికే 670 పరిష్కారమయ్యాయి. 1968 పెండింగ్‌లో ఉన్నాయి. ఫాం –8ఏలో 546 దరఖాస్తులు రాగా 306 పరిష్కారమయ్యాయి. 240 పెండింగ్‌లో ఉన్నాయి.
పరకాల నియోజకవర్గంలో..
పరకాల నియోజకవర్గంలో 9137 దరఖాస్తులు రాగా, ఫాం –6లో 8277 దరఖాస్తులు పరిష్కరించగా 860 పెండింగ్‌లో ఉన్నాయి. ఫాం–7లో 1583 దరఖాస్తులు రాగా 1476 పరిష్కరించగా 112 పెండింగ్‌లో ఉన్నాయి. ఫాం–8లో 1611 దరఖాస్తులు రాగా 1216 దరఖాస్తులను పరిష్కరించారు. ఇంకా 394 పెండింగ్‌లో ఉన్నాయి. ఫాం–8ఏలో 183 దరఖాస్తులు రాగా 74 పరిష్కరించగా 111 పెండింగ్‌లో ఉన్నాయి.
22కల్లా తుది జాబితా వెల్లడి
భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం జనవరి 1, 2019 వరకు 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కొత్త ఓటర్లకు ఓటరు నమోదుకు అవకాశం కల్పించింది. ఈ నెల 12 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తాం. 14 లోపు డాటాబేస్‌లో నమోదు చేసి , 22న కల్లా ఓటర్ల తుది జాబితా వెల్లడిస్తాం. – మహేందర్‌రెడ్డి, ఇన్‌చార్జి కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment