voters increased
-
బాబూ.. ఇదేమి డాబు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘ఈవీఎంలు పనిచేయలేదు.. ఏ ఓటు ఎటు వెళ్లిందో’ అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మేధావులు, న్యాయవాదులు, సామాన్య ఓటర్లు అంటున్నారు. ఈవీఎంలు కొన్నిచోట్ల మొరాయించిన మాట వాస్తవమే. అటువంటి చోట్ల రాత్రి వరకూ పోలింగ్ జరిగింది. దీనిని ఆసరాగా చేసుకుని తెలుగుదేశం పార్టీ ఆరోపణలకు దిగింది. ఈవీఎంల పనితీరుపై సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వకపోవడం, వాటిని ఆపరేట్ చేయడం రాకపోవడం వల్ల అవి మొరా యించాయి. చాలా వాటిలో సాంకేతిక సమస్యలు లేవని, సరిగా ఆపరేట్ చేయడం తెలియకపోవడం వల్లే సమస్య తలెత్తిందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కొన్నిచోట్ల గంట ఆలస్యంగా మొదలైనాపోలింగ్ను ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకూ పొడిగించిన నేపథ్యంలో ఇబ్బందులు లేకుండా పోయాయి. కేవలం నాలుగైదు చోట్ల మాత్రమే రాత్రి తొమ్మిది నుంచి పది గంటల వరకూ పోలింగ్ జరిగింది. వీవీ ప్యాట్‌లో స్పష్టంగా.. ఒక పార్టీ గుర్తుపై ఓటు వేస్తే మరో పార్టీకి వెళ్లిందంటూ ముఖ్యమంత్రి చేస్తున్న ఆరోపణలను న్యాయవాదులు కొట్టివేస్తున్నారు. ఎవరికి ఓటు వేసింది పక్కనే ఉన్న వీవీ ప్యాట్లలో ఏడు సెకన్లపాటు స్పష్టంగా కనిపించింది. ఒకవేళ తాము వేసిన గుర్తుకు కాకుండా మరోదానికి పడి ఉంటే ఓటర్లు చూస్తూ ఊరుకోరు. జిల్లాలో ఓటు ఒకరికి వేస్తే మరొకరికి వెళ్లిందన్న ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులకు ఓటు వేసి పక్కనే ఉన్న స్క్రీన్‌ను ఆసక్తిగా చూశాను నేను ఏ పార్టీకి ఓటు వేశానో ఆ పార్టీకే ఓటు పడిందని భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యోహాన్ చెబుతున్నారు. అవగాహనలేమితోనే ఇబ్బందులు కొవ్వూరులో ఎన్నికల వి ధులు నిర్వహించిన ఒక ఉద్యోగి ‘సాక్షి’తో మాట్లాడుతూ మా కేంద్రంలో మాక్‌పోల్‌లో ఈవీఎం ఇబ్బంది పెట్టినా కొద్దిసేపటి తర్వాత వాటి పనితీరు మెరుగుపడిందన్నారు. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుని వారు ఏ గుర్తుకు ఓటు వేశారో చూసుకుని మరీ వెళారన్నారు. ఈవీఎంల ద్వారా శబ్ధం, వీవీ ప్యాట్ల ద్వారా చిత్రం పక్కాగా వచ్చాయని, వాటిలో లోపాలు లేవన్నారు. అవగాహనా లోపమే కొంత ఇబ్బంది పెట్టిందని చెప్పారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందనే ఆరోపణల్లో ఇసుమంతైనా వాస్తవం లేదని విద్యాధికులు చెబుతున్నారు. ఓటమి భయంతోనే ఇలా.. టెక్నాలజీని తానే కనిపెట్టానని చెప్పుకునే చంద్రబాబునాయుడు ఈవీఎం టెక్నాలజీౖపై చేస్తున్న వ్యాఖ్యలు ఆయనలో ఓటమి భయాన్ని తేటతెల్లం చేస్తున్నాయని ఒక ఉద్యోగి అభిప్రాయపడ్డారు. ఈవీఎంలు పనిచేయలేదన్న ఆరోపణలు నిజమైతే జిల్లాలో 82.20 శాతం ఓటింగ్ ఎలా నమోదు అవుతుందని, కొవ్వూరు, నిడదవోలు, ఉంగుటూరు వంటిచోట్ల 86 నుంచి 87 శాతం ఓటింగ్ ఎలా వచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది ఓటమికి సాకులు వెతకడమేనని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై, ఎన్నికల సంఘం అధికారులపై చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. గెలిస్తే ఒకలా.. ఓడితే మరోలా.. 2014లో సక్రమంగా పనిచేసిన ఈవీఎంలు 2019లో ఎందుకు పనిచేయవని వారు ప్రశ్నిస్తున్నారు. 2014లో ఈవీఎంలు ఉపయోగించి కేవలం 2 శాతం స్వల్ప తేడాతో గెలిచినపుడు ఈవీఎంలపై ఎందుకు అనుమానాలు వ్యక్తం చేయలేదని పౌరహక్కుల సంఘం నేత నంబూరి శ్రీమన్నారాయణ ప్రశ్నించారు. తాను గెలిస్తే బాగా పనిచేసినట్లు, లేకపోతే పనిచేయలేదనే వైఖరి సరికాదన్నారు. వ్యవస్థలను భ్రష్టుపట్టించేలా, కించపరిచేలా మాట్లాడే నైజం చంద్రబాబుదని రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ కమ్ముల పెద్దిరాజు విమర్శించారు. కుటుంబ సమ్మేతంగా ఓటు వేసి బయటకు వచ్చి ఫొటోలకు ఫోజులిచ్చి తెల్లవారిన తర్వాత మెషీన్లు పనిచేయడం లేదని చెప్పడం ఏమిటి? అని రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఒకరు విమర్శించారు. క్యూలైన్లో సాయంత్రం ఆరుగంటల తరువాత ఎంత మంది ఉంటే అంత మంది చేత ఓట్లు వేయిస్తారనే విషయం కూడా తెలియకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారంటే ఆయనలో ఓడిపోతున్నామనే భయం పట్టుకుందని ఒక లెక్చరర్ అభిప్రాయపడ్డారు. మహిళలు కూడా రాత్రి తొమ్మిది గంటల వరకూ ఉండి మరీ ఓటేశారంటే అది కచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటే అయి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ముందు వరకూ వారిని జన్మభూమి కమిటీల పేరుతో వేధించి, ప్రభుత్వ సభలకు బలవంతంగా తరలించి, ఎన్నికల ముందు పసుపు–కుంకుమ పేరుతో డబ్బులు వేస్తే అది అర్థం చేసుకోలేని స్థితిలో మహిళలు లేరని వారు అంటున్నారు. -
పర్చూరులో యువత, మహిళా ఓటర్లే కీలకం
సాక్షి, పర్చూరు (ప్రకాశం): నియోజకవర్గ ఓటర్ల సంఖ్య గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి గణనీయంగా పెరిగింది. 2014 ఎన్నికలకు మొత్తం 2,14,392 మంది ఓటర్లు ఉండగా ఆ సంఖ్య 2019 ఎన్నికల నాటికి 2,29,742 పెరిగింది. అంటే 15,350 మంది ఓటర్లు పెరిగారు. పెరిగిన ఓట్లలో మహిళలు, యువతే కీలకం కానున్నారు. కొత్తగా నమోదైన ఓట్లు గెలుపోటములపై ప్రభావం చూపనున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నమోదుకు ఉత్సాహం చూపిన యువత 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందుగా ఓట్ల నమోదు చేర్పులు, మార్పులకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. ఈ ఏడాది జనవరి 11 నాటికి పర్చూరు నియోజకవర్గ ఓటర్లు 2,19,427 మంది ఉండగా, అందులో పురుషులు 1,07,547 మంది, స్త్రీలు 1,11,870 మంది ఉన్నారు. దీనిలో మహిళా ఓటర్లే 4,323 మంది అధికంగా ఉన్నారు. అయితే చేర్పులు, మార్పుల విషయంలో ఫాం 6, ఫాం 7కు సంబంధించి వచ్చిన దరఖాస్తులు వివాదాస్పదమయ్యాయి. ఓటర్లు తమ ఓట్లు తామే తీసేయాలంటూ వచ్చిన అర్జీలపై పునర్విచారణ జరిగింది. దీంతోపాటు మళ్లీ నూతన ఓట్ల నమోదుకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించి ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించి మార్చి 15వ తేదీ వరకూ చేర్పులకు అవకాశం కల్పించింది. ఈ ఏడాది జనవరి 11 నుంచి మార్చి 11 వరకు 7782 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోగా, మార్చి 12 నుంచి 15వ తేదీ వరకు 3020 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 10,802 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోగా అందులో 10,315 మందికి ఓటు హక్కు లభించింది. దీనిలో 18 నుంచి 25 సంవత్సరాల వయసు వారే అధికంగా ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. దీంతో ప్రస్తుతం 2019లో పర్చూరు నియోజకవర్గ వ్యాప్తంగా 2,29,742 మంది ఓటర్లున్నారు. వీరిలో 1,17,463 మంది మహిళలు కాగా, 1,12,269 మంది పురుషులు ఉన్నారు. అయితే వీరిలో పురుషుల కన్నా 5,194 మంది మహిళలు అధికంగా ఉన్నారు. ఇతరుల కింద మార్టూరు మండలంలో ఇద్దరు, ఇంకొల్లు మండలంలో నలుగురు, చినగంజాం మండలంలో నలుగురు చొప్పున మొత్తం 10 మంది ఇతర ఓటర్లు అంటే థర్డ్ జండర్లు కూడా ఉన్నారు. నియోజకవర్గంలోని మండలాల వారీగా ప్రస్తుత ఓటర్ల వివరాలు... మండలం మహిళా ఓటర్లు పురుష ఓటర్లు మొత్తం ఓటర్లు మార్టూరు 29,307 28,912 58,221 యద్దనపూడి 11,526 10,313 21,839 పర్చూరు 22,138 20,856 42,994 కారంచేడు 16,934 15,998 32,932 ఇంకొల్లు 21,133 19,987 41,124 చినగంజాం 16,425 16,203 32,632 మొత్తం ఓటర్లు 1,17,463 1,12,269 2,29,742 మండలాల వారీగా ఈ ఏడాది పెరిగిన ఓటర్లు మండలం పెరిగిన ఓటర్లు మార్టూరు 3751 యద్దనపూడి 788 పర్చూరు 1548 కారంచేడు 1145 ఇంకొల్లు 1604 చినగంజాం 1479 -
పెరిగిన ఓటర్లు
వరంగల్ రూరల్: ఓటు హక్కును వినియోగించుకోవడం అందరి బాధ్యత.. ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రభుత్వ అధికారులు చేసిన ప్రయత్నం సక్సస్ అయింది. త్వరలో నిర్వహించనున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని భార త ఎన్నికల సంఘం ఇచ్చిన ఓటరు నమోదు, సవరణ, పోలింగ్ కేంద్రాల మార్పునకు జిల్లా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభి ంచింది. ఏకంగా జిల్లా నుంచి 34, 291 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల ఓటరు నమోదు, సవరణలు, చేర్పులు, మార్పులకు సంబంధించి జిల్లా, రాష్ట్ర ఎన్నికల కమిషన్లు అవకాశాలు కల్పించాయి. నర్సంపేట శాసనసభ నియోజకవర్గంలో ఫాం–6లో 18,586 దరఖాస్తులు, ఫాం –7లో 334 దరఖాస్తులు, ఫాం–8 లో 2638 దరఖాస్తులు వచ్చాయి. ఫాం –8ఏ లో 546 దరఖాస్తులు వచ్చాయి. పరకాల శాసనసభ నియోజవర్గంలో ఫాం–6లో 9137 దరఖాస్తులు నమోదయ్యాయి. ఫాం–7లో 1254 దరఖాస్తులు, ఫాం –8లో 1631 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఫాం–8ఏలో 185 దరఖాస్తులు నమోదయ్యాయి. ఈ నెల 4తో ఓటర్ల నమోదు గడువు ముగిసింది. ఈ నెల 14 లోపు దరఖాస్తుల పరిశీలన, 22న తుది జాబితా విడుదల చేస్తారు. ఇప్పటికే నర్సంపేట, పరకాల శాసనసభ స్థానాల్లో 4,07,960 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో జనవరి 25తో ముగిసిన ఓటరు నమోదు గడువును ఫిబ్రవరి 4 వరకు భారత ఎన్నికల సంఘం పొడిగించింది. జిల్లాలో భౌతికంగా వర్ధన్నపేట, నర్సంపేట, పరకాల శాసనసభ నియోజవర్గాలు ఉన్నాయి. కాని వర్ధన్నపేట నియోజకవర్గం ఓటర్ల నమోదు, సవరణలు, మార్పులు, చేర్పులను వరంగల్ అర్బన్ జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తుంది. నర్సంపేట, పరకాల శాసనసభ నియోజకవర్గాల ఓటర్ల నమోదు, సవరణ, మార్పులు, చేర్పులు తొలగింపులు చేపడుతుంది. జిల్లాలో ఓటర్ల నమోదు ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరిత, జాయింట్ కలెక్టర్ రావుల మహేందర్‌రెడ్డి పర్యవేక్షించారు. నర్సంపేట నియోజకవర్గంలో.. నర్సంపేట శాసనసభ నియోజకవర్గంలో ఫాం 6, ఫాం–7 , ఫాం –8 , ఫాం–8ఏ కింద 18,586 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఫాం –6లో 17,245 దరఖాస్తులు పరిష్కరించగా, 1341 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఫాం –7లో 334 దరఖాస్తులు రాగా, వాటిలో 273 దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. ఇంకా 61 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఫాం –8లో 2,638 దరఖాస్తులు రాగా ఇప్పటికే 670 పరిష్కారమయ్యాయి. 1968 పెండింగ్‌లో ఉన్నాయి. ఫాం –8ఏలో 546 దరఖాస్తులు రాగా 306 పరిష్కారమయ్యాయి. 240 పెండింగ్‌లో ఉన్నాయి. పరకాల నియోజకవర్గంలో.. పరకాల నియోజకవర్గంలో 9137 దరఖాస్తులు రాగా, ఫాం –6లో 8277 దరఖాస్తులు పరిష్కరించగా 860 పెండింగ్‌లో ఉన్నాయి. ఫాం–7లో 1583 దరఖాస్తులు రాగా 1476 పరిష్కరించగా 112 పెండింగ్‌లో ఉన్నాయి. ఫాం–8లో 1611 దరఖాస్తులు రాగా 1216 దరఖాస్తులను పరిష్కరించారు. ఇంకా 394 పెండింగ్‌లో ఉన్నాయి. ఫాం–8ఏలో 183 దరఖాస్తులు రాగా 74 పరిష్కరించగా 111 పెండింగ్‌లో ఉన్నాయి. 22కల్లా తుది జాబితా వెల్లడి భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం జనవరి 1, 2019 వరకు 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కొత్త ఓటర్లకు ఓటరు నమోదుకు అవకాశం కల్పించింది. ఈ నెల 12 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తాం. 14 లోపు డాటాబేస్‌లో నమోదు చేసి , 22న కల్లా ఓటర్ల తుది జాబితా వెల్లడిస్తాం. – మహేందర్‌రెడ్డి, ఇన్చార్జి కలెక్టర్ -
జిల్లా ఓటర్లు 8,90,229
జిల్లాలో తుది ఓటర్ల జాబితా ఖరారైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శనివారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తుది ఓటర్ల జాబితా ప్రకటించారు. కొత్త ఓటర్ల నమోదు సవరణల అనంతరం జిల్లా వ్యాప్తంగా 8,90,229 ఓటర్లు ఉన్నట్లుగా వెల్లడించారు. గత నెల 10న విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం 8,08,282 ఓటర్లుండగా ప్రత్యేక ఓటర్ల నమోదు, సవరణల అనంతరం జిల్లావ్యాప్తంగా 81,947 ఓటర్లు పెరిగారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య పెరగగా అత్యధికంగా కరీంనగర్ నియోజకవర్గంలో 50,549 ఓటర్లు పెరగడం విశేషం. సాక్షి, కరీంనగర్‌సిటీ: జిల్లాలో కరీంనగర్‌తోపాటు పట్టణాల్లో ఓటింగ్ శాతం తగ్గుతుందనే ఉద్దేశంతో జనవరిలో జిల్లా ఎన్నికల విభాగం అధికారులు సమగ్ర ఓటరు సర్వే (ఐఆర్‌ఈఆర్–2018) ప్రారంభించారు. బీఎల్వోలు, ట్యాబ్ ఆపరేటర్లు ఇంటింటికీ తిరిగి సర్వే చేశారు. ఎన్నికల సంఘం ఇచ్చిన ట్యాబ్‌లో ఓటర్ల ప్రస్తుత స్థితిగతులను పొందుపరిచారు. ఇంటి నెంబర్ ఇతర వివరాలతోపాటు సదరు ఇంటిని జియోట్యాగింగ్ చేశారు. ఒక ఇంట్లోని ఓటర్లంతా వారి పరిధిలోని పోలింగ్ కేంద్రంలోనే ఓటు హక్కు వినియోగించుకునేలా సవరణలు చేశారు. అయినప్పటికీ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల అనంతరం భారీగా ఓటర్ల నమోదు శాతం తగ్గడం, తొలగింపులు జరిగాయన్న ఫిర్యాదులు, దరఖాస్తులు చేసినా నమోదు కాని వాటిపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. కరీంనగర్‌లోని 50 డివిజన్లకు ఒక్కో జిల్లా అధికారిని నోడల్ ఆఫీసర్‌గా నియమించి ఆయా శాఖల సిబ్బందితో మరోసారి ఇంటింటి సర్వే నిర్వహించింది. విస్తృత ప్రచారం చేయడంలో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ కృషి ఫలించింది. కరీంనగర్ నియోజకవర్గంలోనే అత్యధికంగా 50,549 మంది ఓటర్లు పెరిగారు. అందులో 50 శాతం వరకు ఆన్లైన్లో దరఖాస్తులు వచ్చినట్లు అధి కారులు తెలిపారు. తుది ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 4,43,342 మంది పురుష, 4,46,832 మంది మహిళా ఓటర్లు, 55 మంది ఇతరులున్నారు. సెప్టెంబర్ 10న విడుదల చేసిన ముసాయిదా జాబితా అనంతరం జరిగిన సవరణల అనంతరం కరీంనగర్లో 50,549 మంది ఓటర్లు పెరగగా చొప్పదండిలో 7,788, మానకొండూర్‌లో 10,147, హుజురాబాద్‌లో 13,463 మంది ఓటర్లు పెరిగారు. జిల్లావ్యాప్తంగా 1,01,682 దరఖాస్తులు రాగా విచారణ అనంతరం 19,735 అనర్హులని తొలగించారు. ఇందులో మృతిచెందిన, వలసవెళ్లిన, ఆధార్ లేకపోవడం, రెండుచోట్ల ఓటు ఉన్నవారిని గుర్తించి తొలగించారు. ఈనెల 8 వరకు 1,01,682 ఓటరు నమోదు సవరణలకు దరఖాస్తులు వచ్చాయి. అందులో 47,218 మంది పురుషులు, 54,443 మంది మహిళలు, 21 మంది ఇతరులు దరఖాస్తు చేశారు. విచారణ అనంతరం 19,735 దరఖాస్తులను తొలగించారు. అందులో 10,704 పురుషులవి కాగా 9,031 మహిళలవి ఉన్నాయి. కరీంనగర్ నియోజకవర్గం నుంచి 5,144, చొప్పదండి నుంచి 6,500, మానకొండూర్ 2,944, హుజూరాబాద్ 5,147 దరఖాస్తులు తొలగించారు. అభ్యంతరాలకు అవకాశం.. ఓటరు జాబితా సిద్ధమైంది. జాబితాను ఆయా పోలింగ్ కేంద్రాలతోపాటు గ్రామ పంచాయతీలు, తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో అందుబాటులో ఉంచనున్నారు. శనివారం అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో తుది ఓటర్ల జాబితా సాఫ్ట్, హార్డ్ కాపీలను అందజేశారు. అభ్యంతరాలుంటే సరిచూసుకోవాలన్నారు. జాబితాలో పేరుందా? లేదా? తప్పులున్నాయా? సరిచూసుకుని అభ్యంతరాలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని, మరోసారి నిర్ణీత ఫారంలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. నామినేషన్ల గడువు తేదీకి వారం రోజుల ముందు వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు అందించడానికి అవకాశమున్నట్లు పేర్కొన్నారు. పోలీస్ కవాతు కొత్తపల్లి: అసెంబ్లీ ఎన్నిక లు, దసరా పండగ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి ఆదేశాలతో కొత్తపల్లి మండలం రేకుర్తిలో శనివారం పోలీసులు కవాతు నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా ప్రతీ గ్రామంలో పోలీసులు కవాతు చేపడుతున్నారు. కరీంనగర్‌రూరల్ ఇన్స్పెక్టర్ శశిధర్‌రెడ్డి, కొత్తపల్లి ఎస్సై స్వరూప్‌రాజ్, ఏఎస్సై గుణవత్సింగ్, ఏఆర్, సివిల్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు. -
నాలుగు నియోజకవర్గాల్లో మహిళలే అధికం
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా ఓటర్ల లెక్క తేలింది. జిల్లా వ్యాప్తంగా 19,59,660 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 9,80,897 మంది ఉండగా, స్త్రీలు 9,78,561 మంది ఉన్నారు. ఇతరులు (సర్వీసు ఓటర్లు) 202 మంది ఉన్నారు. 2014 జనవరి 31న విడుదల చేసిన తుది ఓటర్ల జా బితా ప్రకారం జిల్లాలో 19,18,267 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పుడా సంఖ్య 19,59,660కి చేరింది. అయి తే ఈ ఏడాది జనవరి 31 తరువాత ఓటు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిలో 41,393 మంది అధికారులు చోటు కల్పించారు. అంటే ఫిబ్రవరి, మార్చి నెలల్లో 41,393 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వచ్చిన దరఖాస్తులు ఇప్పటి వరకు పరిశీలించిన అధికారులు ఎన్నికల సంఘానికి నివేదించారు. అనంతరం ఎన్నికల సంఘం జిల్లాకు ఫొటో ఓటరు జాబితాను పంపించారు. ప్రస్తుత ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో నాలుగు నియోజకవర్గాలైన ఖానాపూర్, బోథ్, నిర్మల్, ముథోల్‌లలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. కాగా, 2014 జనవరి 31న విడుదల చేసిన ఫొటో ఓటరు జాబితాను సప్లిమెంటరీ -1గా, ఏప్రిల్‌లో జిల్లాకు చేరిన ఫొటో ఓటర్ల జాబితాను సప్లిమెంటరీ-2గా పరిగణిస్తారు. ప్రస్తుతం సప్లిమెంటరీ-2 జాబితాలో ఉన్న ఓటర్లు సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కును విని యోగించుకోనున్నారు. ప్రస్తుతం జాబితా ప్రకారం పురుషుల సంఖ్యను బట్టి చూస్తే ఇంకా 2,336 మంది మహిళా ఓటర్లు తక్కువగా ఉన్నారు. యువతే నిర్ణేత..! ప్రభుత్వం చేపట్టిన అవగాహన కార్యక్రమాల వల్ల యువతీ, యువకులు చైతన్యం పొంది పెద్ద ఎత్తున తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకున్నారు. తాజా జాబితా ప్రకారం జిల్లాలో 18 నుంచి 29 మధ్య వయస్సు వారు 6,95,789 మంది నమోదై ఉన్నారు. దీంతో ప్రతి నియోజకవర్గంలో యువత కనీసం 50 వేలకు మించకుండా ఉన్నారు. జిల్లాలో అత్యధికంగా తూర్పు ప్రాంతం నియోజకవర్గాల్లో ఎక్కువ శాతం యువత ఉన్నారు. జిల్లాలో సర్వీసు ఓటర్లు 202 మంది ఉండగా, ఇందులో తూర్పు ప్రాంతం నియోజకవర్గాలకు సంబంధించిన వారే 124 మంది ఉన్నారు.