కరీంనగర్‌సిటీ: మంచి పాలన కావాలి.. మంచి నేత రావాలి.. మరి ఏం చేయాలి? నినదించా లి? నిలువరించాలి? ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి? అంటే.. ఓటు వేయాలి? వేయాలంటే ముందు ఓటరుగా నమోదు చేసుకోవాలి.. ఇదే ఆఖరి అవకాశం.. వదిలితే అథఃపాతాళం.. ‘లేవండి! మేల్కొనండి! ఇకపై నిద్రించకండి.. అజ్ఞానాంధకారం నుం చి బయటికి రావాలి..’ అన్న స్వామీ వివేకానంద మాటలను స్ఫూర్తిగా తీసుకుని ఓటు అనే వజ్రాయుధం సంధించడంలో ముందు వరుసలో నిలవాల్సిన తరుణమిదే. ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం ఆఖరి అవకాశం ఇ చ్చింది.
యువతకు ప్రాధాన్యం కల్పించాలన్న ప్రధాన ఉద్దేశంతోపాటు అర్హులైన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలనే లక్ష్యంతో విస్తృత అవగాహన కల్పిస్తోంది. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రత్యేక శ్రద్ధతో రెవెన్యూ, ఇతర శా ఖల అధికారులు, ఉద్యోగులు బిజీబిజీగా ఉన్నా రు. విధుల్లో దాదాపు 90 శాతం ఎన్నికల నిర్వహణ కసరత్తుపైనే దృష్టిసారించారు. ఓటరు నమోదుకు గడువు సమీపించడంతో అవగాహ న సదస్సులు, ర్యాలీలు విస్తృతం చేశారు. ఎన్నిక ల సంఘం ఈనెల 10న ప్రకటించిన ముసాయిదా జాబితా అనంతరం సెప్టెంబర్ 25 వరకు ఓటరుగా నమోదు చేసుకునేందుకు, మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించింది. జిల్లాలో ఇంకా 60 వేలకు పైగా ఓటు హక్కు పొందాల్సి ఉన్నట్లు జిల్లా యంత్రాంగం చెబుతోంది.
ఓటరు నమోదుకు స్పందన
ఇప్పటివరకు ఓటరు నమోదుకు గాను 57,040 దరఖాస్తులు వచ్చాయి. ఈ లెక్కన ఓటరు న మోదుకు మంచి స్పందనే లభించినట్లు తెలు స్తోంది. తొలగింపు, ఆక్షేపణలకు సంబంధించి (ఫారం–7) 10,125, వివరాలను సరిదిద్దేందు కు (ఫారం–8) 4,314, ఒక పోలింగ్ నుంచి మరో పోలింగ్ కేంద్రానికి మార్పునకు (ఫారం–8ఏ) 3,640 దరఖాస్తులు వచ్చాయి. చిరునా మాలు మారడం, ఆధార్ ఇవ్వకపోవడం తదిత ర కారణాలతో జాబితాల్లో నుంచి భారీగా ఓట్లు తొలగించిన క్రమంలో దరఖాస్తుల సంఖ్య పెరగకపోవడం గమనార్హం. గల్లంతయిన పేర్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులకు ఓటు కల్పిం చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఓటరు జా బితాలో పేరు ఉందో లేదో చూసి లేకుంటే అక్క డే ఫారం–6 ద్వారా ఓటు నమోదుకు దరఖాస్తులు ఇస్తున్నారు. కొత్త ఓటర్లతో పాటు మార్పులు, చేర్పులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
గడువు పొడిగించేనా..?
కొత్తగా ఓటర్లుగా నమోదు కావాలన్నా.. మా ర్పులు, చేర్పులు చేయించుకోవాలన్నా మంగళవారం (నేటి వరకు) వరకే అవకాశముంది. ఈ నెల 15 నుంచి ప్రా రంభమైన ఈ కార్యక్రమం 25 తేదీతో ముగియనుంది. తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పులు చేర్పులకు అవకాశం ఉండదని అధికారులు చె బుతున్నారు. బూత్‌స్థాయి అధికారులకు నేరుగా దరఖాస్తులు ఇవ్వడంతోపాటు ఆన్‌లైన్‌లోనూ ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం ఉంది. పోలింగ్ ఏజెంట్ల సాయంతో ప్రతి గ్రా మంలో జాబితాలో లేని వారిని గుర్తించి వారితో దరఖాస్తులు సమర్పించేలా చేస్తే ఫలితం ఉం టుంది. అయితే ఓటరు నమోదుకు మరిన్ని రోజులు గడువు పొడిగిస్తారా? లేదా అనే విషయంపై సందిగ్ధం నెలకొంది.
సహాయ కేంద్రంలో సేవలు..
కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రం ద్వారా ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు సేవలందిస్తున్నారు. ఫోన్‌కాల్స్ స్వీకరించి వారి పే రు ఓటరు జాబితాలో ఉందో లేదో తెలియజేస్తున్నారు. బీఎల్‌వోలు అందుబాటులో ఉన్నారా లే దా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. నగరంలోని 50 డివిజన్లలో 250 మంది బీఎల్‌వో లు, 100 మున్సిపల్ సిబ్బంది విధుల్లో ఉన్నా రు. డిగ్రీ పీజీ కళాశాలలల్లోనూ ఫారం–6లు అందజేస్తున్నారు. అందుకు ఎంపీడీవోలను పర్యవేక్షకులుగా నియమించారు. కలెక్టరేట్‌లో సహాయ కేంద్రం నంబర్ 0878–2234731కు సంప్రదించాలని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment