
ఓటుహక్కు వినియోగించుకున్న మహిళలు
సాక్షి, గంగాధర(చొప్పదండి) : పంచాయతీ ఎన్నికలైనా, శాసనసభ ఎన్నికలైనా, పార్లమెంట్ ఎన్నికలైనా పోలింగ్‌లో మహిళా ఓటర్ల శాతమే ఎక్కువగా ఉంటుంది. ఎన్నికల ప్రచారంలో ముందుండే పురుష ఓటర్లు పోలింగ్‌లో మాత్రం వెనుకబడి పోతున్నారు. చొప్పదండి నియోజకవర్గంలో ఓటర్లలోను మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఆరు మండలాల్లో 2,12,734 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 1,04,482 మంది ఉండగా, మహిళలు 1,08,246 మంది ఉండగా ముగ్గురు ఇతర ఓటర్లు ఉన్నారు. శుక్రవారం నిర్వహించిన శాసనసభ ఎన్నికల్లో 1,69,334 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించారు. మండలాల వారీగా ఓటు హక్కును అందులో మహిళలు ఓటుహక్కును వినియోగించుకన్నది పరిశీలిస్తే పురుషుల కంటే మహిళలే ఎక్కువ శాతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరి ఓటు గెలుపోటము లపై ప్రభావం ఉంటుందని పలువురంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment