Parliament Sessions: No Confidence Motion Debate, PM Modi Reply Updates - Sakshi
Sakshi News home page

No Confidence Motion: లోక్‌సభలో కేంద్రంపై వీగిన అవిశ్వాసం

Published Thu, Aug 10 2023 10:09 AM | Last Updated on Thu, Aug 10 2023 7:43 PM

parliament Sessions: No Confidence Motion Debate PM Modi Reply Updates - Sakshi

Live Updates

►లోక్‌సభలో కేంద్రంపై వీగిన విపక్షాల అవిశ్వాసం

►మూజువాణి ఓటుతో వీగిపోయిన అవిశ్వాసం

►లోక్‌సభలో విపక్షాల వాకౌట్‌ చేయడంతో ఓటింగ్‌ లేకుండానే వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

► అవిశ్వాసంపై చర్చ సందర్భంగా.. మొత్తం 2గం.13 నిమిషాలపాటు ప్రధాని మోదీ ప్రసంగించారు.

మణిపూర్‌పై మోదీ వ్యాఖ్యలు..

►మణిపూర్‌లో జరిగింది దిగ్భ్రాంతికరం .. మణిపూర్‌లో జరిగింది అమానవీయం

► మణిపూర్‌పై చర్చ విపక్షాలకు అవసరం లేదు. మణిపూర్‌పై అమిత్‌ షా పూర్తి వివరాలు అందించారు. మేం చర్చకు ఆహ్వానిస్తే.. వారు వెళ్లిపోయారు. మణిపూర్‌ అభివృద్ధికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. కొందురు ఎందుకు భారతమాత చావు కోరుకుంటున్నారో అర్థం కావడం లేదు. వీళ్లే రాజ్యాంగం హత్య గురించి మాట్లాడుతారు. వాళ్ల మనసులో ఉన్నదే ఇప్పుడు బయటపడుతోంది. 

► వీళ్లు దేశాన్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మిజోరంపైనా దాడులు చేయించారు. 1966లో మిజోరంలోని సామాన్యులపై దాడులు చేయించారు. ఈశాన్యం అభివృద్ధిని నెహ్రు అడ్డుకుంటారని లోహియా. ఇందిరా హయాంలో మిజోరంపై జరిగిన దాడిని ఇప్పటికీ దాచారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కాంగ్రెస్‌ విస్మరించింది. 

► నేను ఇప్పటికి 50సార్లు ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించాను. 1962 నాటి నెహ్రు ప్రసంగం నేటికి ఈశాన్య రాష్ట్రాల మనసుల్ని గుచ్చుకుంటుంది. మిజోరం మార్చి 5వ తేదిని ఇప్పటికీ నిరసన దినంగా పాటిస్తుంది.

► మణిపూర్‌లో విధ్వంసాలన్నీ కూడా కాంగ్రెస్‌ హయాంలోనివే. గత ఆరేళ్ల నుంచి మణిపూర్‌ సమస్యల కోసం పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. కాంగ్రెస్‌ ఏ సమస్యనైనా రాజకీయం చేస్తోంది. ప్రపంచానికి ఈశాన్య రాష్ట్రాలకు దిక్సూచి చేస్తాం. మణిపూర్‌ అభివృద్ధికి ఎన్డీఏ తీవ్ర కృషి చేస్తోంది. మణిపూర్‌, నాగాలాండ్‌, మిజోరంలో అభివృద్ధిని కాంగ్రెస్‌ చూడలేకపోతోంది. మరోసారి అవిశ్వాసం పెట్టే ముందు సంసిద్ధంకండి. 

ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా లోక్‌సభ నుంచి విపక్షాలు వాకౌట్‌

అవిశ్వాసంపై ప్రధాని ప్రసంగం.. హైలైట్స్‌

►ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావాలని వారు చూస్తున్నారు

►విపక్షాలది ఇండియా ​కూటమి కాదు.. అహంకార కూటమి

►మేం కుటుంబ పాలనకు వ్యతిరేకం

►24 గంటలు వారు మోదీ నామ స్మరణ చేస్తున్నారు

►ఫెయిల్డ్‌ ప్రొడక్ట్‌ని కాంగ్రెస్‌ పదే పదే లాంచ్‌ చేస్తోంది

►వారు కొత్త కొత్త దుకాణాలను తెరుస్తున్నారు

►వారి కొత్త దుకాణానికి కూడా తాళం వేయాల్సి వస్తుంది

►కాంగ్రెస్‌ పాలనలో స్కీమ్‌లు లేవు.. అన్ని స్కామ్‌లే: ప్రధాని మోదీ

►పాకిస్తాన్‌పై సర్జికల్‌ స్ట్రైక్‌ జరిపిన సైన్యాన్ని విపక్షాలు నమ్మలేదు

►మేడిన్‌ ఇండియా కరోనా వ్యాక్సిన్‌ వచ్చినా విపక్షాలు విశ్వసించలేదు

►అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను ప్రజలు విశ్వసించలేదు

►కశ్మీర్‌ పౌరులపై కాంగ్రెస్‌కు నమ్మకం లేదు

►2028లో కూడా మాపై విపక్షాలు అవిశ్వాసం పెడతాయి

►విపక్షాలకు పాకిస్తాన్‌ అంటే ప్రేమ కనిపిస్తోంది

►పాకిస్తాన్‌ చెప్పదే విపక్షాలు నమ్ముతున్నాయి

►కాంగ్రెస్‌ పాలనలోనే ఎక్కువ ఉగ్రదాడులు జరిగాయి

►కాంగ్రెస్‌ హయాంలో భారత్‌ పేదరికంలో మగ్గిపోయింది

►కాంగ్రెస్‌కు నిజాయితీ లేదు.. విజన్‌ లేదు

►2014 తర్వాత ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలోభారత్‌ ఐదో స్థానానికి చేరింది

►LIC ప్రైవేటీకరణతో పేదల డబ్బులు పోతాయని ప్రచారం చేశారు

►ఈరోజు LIC ఎంతో పట్టిష్టంగా ఉంది

►భారత్‌ ఎదుగుదలను ప్రపంచం ప్రశంసిస్తోంది.

►రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడో స్థానానికి చేరుకుంటాం

►భారత్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు విపక్షాలు ప్రయత్నించాయి

►చర్చ సమయంలో మీరు మాట్లాడిన ప్రతీ మాటా దేశం మొత్తం విన్నది

►ఎన్నో అసత్యాలు ప్రచారం చేశారు

►బ్యాంకింగ్‌ వ్యవస్థ కుప్పకూలిపోతుందని ఎన్నో అబద్ధాలు ప్రచారం చేశారు

►HALపై ఇష్టానుసారం మాట్లాడారు

►మన సంక్షేమ పధకాల్ని ఐఎంఎఫ్‌ ప్రశంసించింది

►జల జీవన్‌ మిషన్‌, స్వచ్చ భారత్‌, అభియాన్‌లు లక్షలాది మంది జీవితాల్ని నిలబెట్టాయి

►దేశ ప్రజల్ని ఇండియా కూటమి తప్పుదోవ పట్టిస్తోంది

►స్కామ్‌లు లేని ప్రభుత్వాన్ని దేశానికి ఇచ్చాం

►దేశ ప్రతిష్టను ఖండాంతరాలకు విస్తరింపజేశాం

►దేశంలో ఎంత బలపడిందో చెప్పడానికి విదేశీ పెట్టుబడులే నిదర్శనం

►2018లో నో కాన్ఫిడెన్స్‌.. నో బాల్‌గానే మిగిలిపోయింది

►ఫీల్డింగ్‌ విపక్షాలు చేస్తుంటే.. సిక్స్‌లు, ఫోర్లు మావైపు వచ్చి పడ్డాయి

►విపక్షాలకు అధికార దాహం పెరిగింది

►అవినీతిలో కూరుకుపోయిన పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి.

►విపక్షాలకు పేదల భవిష్యత్‌ కంటే అధికారమే ముఖ్యమైపోయింది

►ఐదేళ్లు టైం ఇచ్చినా విపక్షాలు సిద్ధం కాలేదు

►అధీర్‌ను ఎందుకు మాట్లాడనివ్వలేదు.. కోల్‌కతా నుంచి ఫోన్‌ వచ్చిందేమో

►ఇది విపక్షాలకే పరీక్ష.. మాకు కాదు.. అవిశ్వాస తీర్మానం మాకు శుభపరిణామం

► అవిశ్వాసం పెట్టిన విపక్షాలకు ధన్యవాదాలు. దేవుడే అవిశ్వాసం పెట్టాలని విపక్షాలకు చెప్పాడు. మూడు రోజులుగా చాలామంది మాట్లాడారు. 2018లో కూడా అవిశ్వాసం పెట్టారు. కానీ, విపక్షాలకు ఎంత మంది ఉన్నారో.. అన్ని ఓట్లు కూడా రాలేదు. 2024లో ఎన్డీయే కూటమి అన్ని రికార్డులు బద్ధలు కొడుతుంది.

► మా ప్రభుత్వంపై దేశ ప్రజలు పదే పదే  విశ్వాసం చూపిస్తున్నారు.  కోట్లాది దేశ ప్రజలకు నా కృతజ్ఞతలు తెలియజేయడానికి నేను ఇక్కడ ఉన్నాను. 

►ప్రారంభమైన ప్రధాని మోదీ ప్రసంగం

► మరికాసేపట్లో అవిశ్వాస తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.

► లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ జరుగుతోంది. బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ మాట్లాడారు..
తెలంగాణ ఉద్యమంలో 1,400 మంది చనిపోయారు. ఎంతో మంది బలిదానంతో తెలంగాణ ఏర్పడింది. అవినీతి కుటుంబ పార్టీ టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌గా మారింది. తెలంగాణ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోంది. సీఎం కొడుకు ఆస్తులు 400 రేట్లు పెరిగాయి. మోదీ హయాంలో శక్తివంతమైన భారత్‌ నిర్మాణానికి ప్రయత్నం జరుగుతోంది. అవిశ్వాసం ఎందుకు పెట్టారో వాళ్లకే తెలియదు. భరతమాత వైపు కన్నెత్తి చూస్తే కళ్లు పీకే హీరో మోదీ. కాంగ్రెస్‌ నేతలకే లిక్కర్‌తో సంబంధం. రాహుల్‌ గాంధీని చూస్తే గజిని గుర్తుకు వస్తున్నారు. 

► కాంగ్రెస్‌ది అవినీతి దుకాణం. పేరు మార్చుకున్నా కూడా వాళ్ల దుకాణంలో దొరికే సరుకు మాత్రం అదే:  కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా

► యూపీఏ హయాంలో ఈశాన్య రాష్ట్రాలను నిర్లక్ష్యంగా చేయబడిన ఏడుగురు సోదరీమణులుగా సింధియా అభివర్ణించారు.

► అవిశ్వాసంపై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రసంగిస్తున్న టైంలో.. ఇండియా కూటమి ఎంపీలు వాకౌట్‌ చేశారు. ‘‘లోక్‌సభ నుంచి వాళ్లు బయటికి వెళ్లిపోయారు. కానీ, దేశ ప్రజలు ఎప్పుడో వాళ్లను సాగనంపారు’’ అని సింధియా సెటైర్‌ వేశారు. 

►ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభకు హాజరయ్యారు.

►ప్రధానిపై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు అధిర్‌ రంజన్‌ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి డిమాండ్‌ చేశారు. ప్రధానికి ఆయన క్షమాపణలు చెప్పాలని అన్నారు. దీంతో కాంగ్రెస్‌ ఎంపీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు

►కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలనే ఆలోచనే తమకు లేదని, కేవలం దీనిని ప్రవేశపెట్టేందుకు ప్రధాని మోదీనే కారణమని కాంగ్రెస్‌ ఎంపీ అధిర్‌ రంజన్‌ చౌదరి పేర్కొన్నారు.‘అవిశ్వాస తీర్మానానికి ఉన్న శక్తే నేడు పార్లమెంట్‌కు ప్రధానిని తీసుకొచ్చింది. ఈ అవిశ్వాస తీర్మానం గురించి మేమేమీ ఆలోచించలేదు. మేము కేవలం ప్రధాని  పార్లమెంటుకు వచ్చి మణిపూర్ సమస్యపై మాట్లాడాలని మాత్రమే డిమాండ్ చేశాం. పార్లమెంట్‌కు రావాలని ఏ బీజేపీ సభ్యుడిని డిమాండ్‌ చేయలేదు. మా ప్రధాని రావాలని కోరుకున్నాం అంతే.’ అని వ్యాఖ్యానించారు.

► మీ (ప్రధాని మోదీ)పై భారతదేశం విశ్వాసం కోల్పోయింది. కొత్త పార్లమెంటు ఛాంబర్‌లో మత బోధకులకు గొప్ప ప్రజాస్వామ్య ప్రధానమంత్రి తలవంచి నమస్కరిస్తున్న దృశ్యం సిగ్గుతో మమ్మల్ని తలపిందేలా చేసింది. పోలీసులు అసభ్యంగా ప్రవర్తించడం, ఛాంపియన్ రెజ్లర్లపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం మాలో అవమానాన్ని నింపింది. హర్యానాలోని 3 జిల్లాల్లో 50 పంచాయితీలు రాష్ట్రంలోకి ముస్లిం వ్యాపారులు రాకూడదని లేఖలు ఇవ్వడం సిగ్గుచేటు.
:::టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా

► విపక్షాల ఆందోళన నడుమ రాజ్యసభ రేపటికి వాయిదా.
 

► ఫార్మసీ బిల్లు(2023)కు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఆగష్టు 7వ తేదీన లోక్‌సభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. 

► స్కాలర్‌షిప్‌లు నిలిపివేయడం ద్వారా 1.80 లక్షల మంది ముస్లింలు ఉన్నత విద్యను పూర్తి చేయలేకపోయారని లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఏఐఎంఐఎం నేత ఒవైసీ పేర్కొన్నారు.

► కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌కు చేరుకున్నారు.

►అవిశ్వాస తీర్మానంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగాన్ని బహిష్కరిస్తూ విపక్ష ఎంపీలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు.

లోక్‌సభలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రసంగం

►ప్రతిచోట మహిళలు ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని నేను అంగీకరిస్తున్నాను. అది మణిపూర్‌, ఢిల్లీ, రాజస్థాన్‌ ఎక్కడైనా కావచ్చు. దీనిని సీరియస్‌గా తీసుకోవాలి. దీనిపై రాజకీయాలు అవసరం లేదన్నారు. ‘అయితే సభ మొత్తానికి 1989 మార్చి 25న తమిళనాడు అసెంబ్లీలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేయాలనుకుంటున్నాను. తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న జయలలిత చీర లాగి కించపరిచారు. అక్కడ కూర్చున్న డీఎంకే సభ్యులు ఆమెను చూసి నవ్వారు. ఆ రోజు జయలలిత సీఎం అయితే తప్ప సభకు రానని ప్రమాణం చేశారు. రెండేళ్ల తర్వాత మళ్లీ తమిళనాడు సీఎంగా అసెం‍బ్లీలో అడుగుపెట్టారు.

.

►తమ ప్ర‌త్య‌క్ష న‌గ‌దు బ‌దిలీ(DBT) ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలుస్తుందన్నారు. యూపీఏ హాయంలో (2013-14) కేవలం 7,367 కోట్ల రూపాయలు లబ్దిదారులకు బదిలీ చేయగా...  2014-15 నాటికి డిబీటీ బదిలీలు 5 రెట్లు పెరిగాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.7.16 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ట్రాన్స్‌ఫర్‌ చేసినట్లు చెప్పారు.

► గత యూపీఏ హయాంలో ఎయిర్‌ పోర్టులు, జాతీయ రహదారులు, పోర్టులు భవిష్యత్తులో నిర్మిస్తాం అనే మాటలు వినపడేవి. ప్రస్తుతం ఎయిర్‌ పోర్టులు, జాతీయ రహదారులు, పోర్టులు వచ్చేశాయి మాటలు వినిపిస్తున్నాయన్నారు. 

►పేదరికాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గతంలో గరీబీ హఠావో' నినాదాలు ఉండేవని కానీ నేడు తతమ ప్రభుత్వ విధానాల వల్ల కేవలం 9 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ పుంజుకుని ఆర్థికాభివృద్ధి సాధించిందన్నారు.కోవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొని ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మనదన్నారు.

►2014లో ప్రసూతి మరణాల రేటులో భారతదేశం 167వ స్థానంలో ఉండగా.. ఎన్డీయే హయాంలో 97వ స్థానంలో ఉన్నామని చెప్పారు.

►2022-23లో మన వాస్తవ జీడీపీ వృద్ధి 7.2 శాతంగా ఉందని, అదే 2023-24లో 6.5 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ అంచనాలను అనేక గ్లోబల్ ఏజెన్సీలు అందించాయని, అలాగే RBI ప్రొజెక్షన్ కూడా ఇదేనని తెలిపారు. పరివర్తన అనేది చర్యల వల్ల వస్తుందని చెప్పే మాటల వల్ల కాదని పరోక్షంగా గత యూపీఏ ప్రభుత్వాన్ని ఉద్ధేశిస్తూ వ్యాఖ్యానించారు. వారు ప్రజలను కలల్లో విహరిస్తే మేము వారి కలలను సాకారం చేసి చూపిస్తున్నామని తెలిపారు

►ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక నివేదికను లోక్‌సభలో సమర్పించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రధానంగా ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణంపై దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు తెలిపారు. ద్రవ్యోల్బణం, నెమ్మదింపు వంటి సవాళ్లతో  ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పోరాడుతోందని ఆమె పేర్కొన్నారు.

►ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని, బలమైన ఆర్థిక వ్యవస్థలూ ఇబ్బందులుపడుతున్నాయన్నారు.భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం పురోగమిస్తుందని అని నిర్మలా సీతారామన్ పార్లమెంటులో అన్నారు. దేశ  భవిష్యత్తు వృద్ధి  ఆశాజనకంగా సానుకూలంగా ఉందన్నారు.

► లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై మూడో రోజు చర్చ ప్రారంభమైంది.

►సాయంత్రం 4 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవిశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొంటారని పీఎంఓ కార్యాలయం ట్వీట్‌ చేసింది.

► మణిపూర్‌ పరిస్థితిపై చర్చించేందుకు కాంగ్రెస్‌ ఎంపీ మాణికం ఠాగూర్‌ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, ఆప్ ఎంపీ సందీప్ పాఠక్, కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్, ఆప్ ఎంపీ సుశీల్ గుప్తా మణిపూర్ పరిస్థితిపై చర్చించేందుకు రూల్ 267 కింద నోటీసు ఇచ్చారు.

►రాజ్యసభ 2 గంటలకు వాయిదా పడింది.

►పార్లమెంట్‌కు వచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సమస్య ఏంటని రాజ్యసభలో ఏఐసీసీ చైర్మన్‌ మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. మోదీ ఏం దేవుడు కాదని వ్యాఖ్యానించారు.

► పార్లమెంట్‌లో అవలంభించాల్సిన ప్రభుత్వ వ్యూహాలను చర్చించేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ రామ్ మేఘ్‌వాల్‌లతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.

►ఎంపీల సంతకాలను ఫోర్జరీ చేశారనే ఆరోపణలపై ఎంపీ రాఘవ్‌ చద్దా గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. అయిదుగురు ఎంపీల ఫోర్జరీ సంతకాలు తీసుకొని వారి పేర్లను సెలెక్ట్‌ కమిటీకి పంపిన పేపర్‌ను  చూపించాలని బీజేపీకి సవాల్‌ విసిరారు.

► ఢిల్లీ బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపాలని రాఘవ్‌ చద్దా రాజ్యసభలో ప్రవేశ పెట్టిన తీర్మానంపై తమ సంతాకాలను ఫోర్జరీ చేశారని అయిదుగురు ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అనుమంతి లేకుండా తమ పేర్లను ప్రస్తవించారని ఆరోపించారు.  దీనిపై ఆప్‌ ఎంపీకి పార్లమెంట్‌ ప్రివిలేజ్‌ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఐదుగురు సభ్యులు చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.

#Watch | On the allegation of MPs claiming that their names were mentioned on the proposal moved by #AAP MP #RaghavChadha to send the Delhi NCT Amendment Bill to the Select Committee without their consent, AAP MP Raghav Chadha says "The rule book says that any MP can propose the… pic.twitter.com/5ZCUYv39KZ

చైనాతో సరిహద్దు పరిస్థితిపై చర్చించాలి
►చైనాతో సరిహద్దు పరిస్థితులపై చర్చించాలంటూ కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ గురువారం లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. ఈమేరకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు మనీష్ తివారీ లేక రాశారు..తక్షణ ప్రాముఖ్యత కలిగిన ఒక నిర్దిష్ట అంశాన్ని చర్చించే ఉద్దేశ్యంతో వాయిదా తీర్మానాన్ని ఇస్తున్నట్లు పేర్కొన్నారు.  చైనా సరిహద్దులో పరిస్థితిని సభకు తెలియజేయాలని  ప్రభుత్వాన్ని కోరారు. 

►కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఫార్మసీ (సవరణ) బిల్లు 2023ని రాజ్యసభలో నేడు ప్రవేశపెట్టనున్నారు. ఫార్మసీ చట్టం1948ను సవరిస్తూ తెచ్చిన ఈ బిల్లును ఆగస్టు 7న లోక్‌సభ ఆమోదించింది. 

►విపక్ష కూటమిని లక్ష్యంగా చేసుకుని హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ గురువారం కౌంటర్‌ అటాక్‌కు దిగారు. భారత కూటమిపై తీవ్ర ఆరోపణలు చేసే బదులు మణిపూర్, హర్యానా వంటి రాష్ట్రాల్లోని హింస, అల్లర్లు, పాలనపై దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు.

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చతో పార్లమెంట్‌ సమావేశాలు హీటెక్కాయి. రెండు రోజులు జరిగిన చర్చల్లో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. నువ్వా నేనా అన్నట్లుగా ఒకరిపై ఒకరు విమర్శల దాడికి దిగారు. బుధవారం ప్రధాని మోదీ టార్గెట్‌గా రాహుల్‌ గాంధీ చెలరేగిపోగా దీనికి కౌంటర్‌గా కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, అమిత్‌ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. మొత్తంగా మణిపూర్‌ మంటలతో లోక్‌సభ అట్టుడుకుతోంది.


మోదీ ఏం మాట్లాడనున్నారు
అవిశ్వాస తీర్మానంపై చివరిరోజైనా నేడు (గురువారం) కూడా చర్చ జరగనుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు సభ్యులు దీనిపై మాట్లాడనున్నారు. అవిశ్వాస తీర్మానంపై సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీ సమాధానం ఇవ్వనున్నారు. అయితే మణిపూర్‌ హింసపై మోదీ మాట్లాడాలని పార్లమెంట్‌ సమావేశాలు మొదలైనప్పటి నుంచి ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. దీంతో అందరి దృష్టి ప్రధానిపైనే ఉంది. మణిపూర్‌, అవిశ్వాసంపై మోదీ ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నారనేది ఉత్కంఠగా మారింది.
చదవండి: Manipur Violence: మాటల తూటాలు..

బలాబలగాలు
ఇక మోదీ రిప్లై తరువాత ఈ తీర్మానంపై సభలో ఓటింగ్ ఉంటుంది. బీజేపీ- ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మెజారిటీ ఉండటం వల్ల ఈ తీర్మానం వీగిపోవడానికి అధికావకాశాలు ఉన్నాయి. లోక్‌సభలో మెజారిటీ మార్కు 272. లోక్‌సభలో ఎన్డీయే కూటమి  331 ఎంపీల బలం ఉంది.

బీజేపీకి సొంతంగానే 301 మంది ఎంపీలు ఉన్నారు. విపక్షాల ఇండియా కూటమి బలం 144, బీఆర్‌ఎస్‌, వైఎస్సార్‌సీపీ, బీజేడీకి కలిపి 70 మంది ఎంపీల బలం ఉంది. లోక్‌సభలో అయిదు స్థానాలు ఖాళీ ఉన్నాయి.  ఇక ఎన్డీయే కూటమికి అనుకూలంగా 273 మంది ఎంపీల మద్దతు తెలిపితే.. అవిశ్వాస తీర్మానం ఈజీగా వీగిపోతుంది.

చదవండి: భరతమాతను హత్యచేశారంటే.. బల్లలు చరుస్తారా ?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement