
సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్‌సీ, ఎస్‌టీ బిల్లును ప్రవేశపెడతామని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం వెల్లడించారు. ఎస్‌సీ, ఎస్‌టీ అత్యాచారాల నిరోధక చట్టం తిరిగి ప్రవేశపెట్టేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసిందని, ఈ చట్టం నిర్వీర్యమయ్యేందుకు ప్రభుత్వం అనుమతించబోదని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే స్పష్టంచేశారని చెప్పారు.
ఎస్‌సీ,ఎస్‌టీ చట్టాన్ని నీరుగార్చేలా సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఇప్పటివరకూఎలాంటి చర్యలూ చేపట్టలేదన్న కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే విమర్శలు గుప్పించిన క్రమంలో రాజ్‌నాథ్ సింగ్ ఈ మేరకు పేర్కొన్నారు. మరోవైపు ఎస్‌సీ, ఎస్‌టీ బిల్లును ప్రవేశపెట్టేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. పార్టీ సభ్యులంతా నేడు, రేపు సభలోనే ఉండాలని కోరుతూ బీజేపీ తమ లోక్‌సభ ఎంపీలందరికీ విప్ జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment