సోరోస్‌తో స్నేహంపై శశిథరూర్‌ రియాక్షన్‌ | Shashi Tharoor clarification as old Soros post | Sakshi
Sakshi News home page

సోరోస్‌తో స్నేహంపై శశిథరూర్‌ రియాక్షన్‌

Published Mon, Dec 16 2024 12:51 PM | Last Updated on Mon, Dec 16 2024 1:26 PM

Shashi Tharoor clarification as old Soros post

ఢిల్లీ : 15 ఏళ్ల క్రితం కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్ ఎక్స్‌ వేదికగా పెట్టిన ఓ  పోస్ట్‌పై వివాదం రాజుకుంది.  ప్రపంచ కుబేరుల్లో ఒకరు, తన పాత మిత్రుడు జార్జ్‌ సోరోస్‌ను కలిశానంటూ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌ను టార్గెట్‌ చేస్తూ బీజేపీ చేస్తున్న ఆరోణల్ని శశిథరూర్‌ ఖండించారు.

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో దేశాన్ని అస్థిరపరిచేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు  పెట్టుబడిదారుడితో కుమ్మక్కయ్యారని బీజేపీ ఆరోపణలు చేస్తూ వస్తోంది. అందుకు.. అమెరికా వ్యాపారవేత్త జార్జ్‌ సోరోస్‌ ఫౌండేషన్‌ నిధులతో పనిచేస్తున్న ఎఫ్‌డీఎల్‌-ఏపీ సహ అధ్యక్షురాలిగా ఉన్న సోనియాగాందీ.. ఆ సంస్థలో తన పాత్రను వెల్లడించాలని డిమాండ్‌ చేసింది.

తాజాగా,సోరోస్‌తో కాంగ్రెస్‌కు ఉన్న సాన్నిహిత్యంపై మరోసారి బీజేపీ నేతలు ప్రస్తావించారు.  మే 26, 2009న ఎక్స్‌ వేదికగా ప్రపంచ కుబేరుల్లో ఒకరు, తన పాత మిత్రుడు జార్జ్‌ సోరోస్‌ను కలిశాను. అతను పెట్టుబడిదారుడి కంటే అంతర్జాతీయ సమస్యల్ని పరిష్కరించడంలో ముందుంటారు’అంటూ కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ చేసిన నాటి ట్వీట్‌ను వెలుగులోకి తెచ్చారు.

ఆ ట్వీట్‌కు శశిథరూర్‌ ఎక్స్‌ వేదికగా.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న రోజుల్లో సోరస్‌ నాకు బాగా తెలుసు. అయితే, సోరస్‌ తనకు మంచి స్నేహితుడు. అంతే తప్పా మా ఇద్దరి మధ్య ఎలాంటి సంస్థలు, ఆర్థికపమైన లావాదేవీలు జరగలేదు. సోరస్‌తో మాట్లాడి సుదీర్ఘకాలమైంది. సోరస్‌కు తనకున్న స్నేహాన్ని రాకీయాలు ముడిపెట్టడం తగదు’ అని అన్నారు.

పదిహేనేళ్ల నాటి ట్వీట్‌తో అసంబద్ధమైన ఆరోపణలు చేస్తూ తప్పుదారి పట్టించే వారికి ఇది స్పష్టత ఇస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం, ఆ ట్వీట్‌లో పొలిటికల్‌ సర్కిల్‌లో హాట్‌ టాపిగ్గా మారాయి. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement