Sasitharur
-
ఆ మాత్రం బంగారానికి హడావిడి అవసరమా..?
సాక్షి, న్యూఢిల్లీ : యూపీలోని సోన్‌భద్రలో 3000 టన్నుల బంగారు నిల్వలు బయటపడ్డాయని ప్రభుత్వం ఆర్భాటం చేయడం పట్ల కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ విస్మయం వ్యక్తం చేశారు. ‘తొలుత 5 మిలియన్ టన్నుల ఎకానమీ అంటూ డప్పుకొట్టారు..ఆ తర్వాత 3350 టన్నుల బంగారం నిల్వలంటూ ఊదరగొడితే అది కేవలం 160 కేజీలేనని వెల్లడైంద’ని శశిథరూర్ ట్వీట్ చేశారు. యూపీలోని సోన్‌భద్ర జిల్లాలో 3000 టన్నుల బంగారు నిల్వలు బయటపడ్డాయన్న వార్తలను తోసిపుచ్చిన జీఎస్ఐ అక్కడ కేవలం 160 కిలోల బంగారు నిల్వలే ఉంటాయని అంచనా వేస్తున్నట్టు జీఎస్ఐ స్పష్టం చేసింది. కాగా సోన్‌భద్ర జిల్లాలోని సోన్ పహాడి, హర్ధి ప్రాంతాల్లో 3250 టన్నుల విలువైన బంగారు నిక్షేపాలను గుర్తించామని జిల్లా మైనింగ్ అధికారి కేకే రాయ్ శుక్రవారం రాత్రి వెల్లడించిన సంగతి తెలిసిందే. చదవండి : ఆర్టికల్ 370 : పాక్ తీరును ఎండగట్టిన శశిథరూర్ -
ప్రియాంకకు మాత్రమే అది సాధ్యం : శశిథరూర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ప్రియాంక గాంధీ అయితేనే న్యాయం చేయగలరని పార్టీలోని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులో కాంగ్రెస్ పార్టీని గట్టేక్కించే సామర్థ్యం ప్రియాంక గాంధీకి మాత్రమే ఉందని సీనియర్ నేత శశిథరూర్ ప్రియాంక నాయకత్వానికి తాజాగా మద్దతు తెలిపారు. ఇటీవల హర్యానా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా, శత్రుఘ్నసిన్హా వంటి సీనియర్ నాయకులు యువతరాన్ని ప్రోత్సహించాలని, ప్రియాంకలో ఇందిరాగాంధీ తరహా నాయకత్వ లక్షణాలున్నాయని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ మాట్లాడుతూ ప్రియాంకగాంధీకి ప్రజా సమస్యలపై వెంటనే స్పందించే లక్షణాలు మెండుగా ఉన్నాయన్నారు. పార్టీలో ఉన్న అనిశ్చితి తొలగి, పార్టీ బలపడాలంటే ప్రియాంక నాయకత్వాన్ని సమర్థించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు ఆమె వంద శాతం అర్హురాలన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ వైఫల్యం తర్వాత సీనియర్ నేతలు ఎవరూ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు ముందుకు రాని పరిస్థితుల్లో ప్రియాంక ఒక సమర్థవంతమైన నాయకురాలిగా మనకు కనిపిస్తున్నారని శశిథరూర్ వ్యాఖ్యానించారు. సీనియర్ల మాటలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రియాంక పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడతారా లేదా అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
మీడియాపై విరుచుకుపడిన శశిథరూర్
న్యూఢిల్లీ: కేంద్ర మాజీమంత్రి శశిథరూర్ మరోసారి మీడియాపై విరుచుకుపడ్డారు. సునంద పుష్కర్ అనుమానాస్పద కేసులో సిట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. కేసు విచారణ చేపట్టిన సిట్... సునంద భర్త శశిథరూర్‌ను కూడా విచారిస్తోంది. అయితే స్పెషల్ ఇన్విస్టిగేషన్ పోలీసులు అడిగిన ప్రశ్నలకు సరిగా సమాధానాలు ఇవ్వడంలేదని ఆరోపిస్తూ న్యూఢిల్లీ పోలీసులు శశిథరూర్‌ను హెచ్చరించినట్టుగా మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై సోషల్ మీడియాలో శశిథరూర్ మీడియాపై విరుచుకుపడ్డారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తూ కట్టుకథలు ప్రసారం చేస్తున్నారని ఆయన మండి పడ్డారు. తాను విచారణకు సహకరించడం లేదన్న వార్తల్లో నిజం లేదన్నారు. టీఆర్పీ రేటింగ్ కోసం అబద్ధాలను, అసత్యాలను ప్రసారం చేసే మీడియా కాకుండా, నీతిగా, నిజాయితీగా వ్యవహరించే జర్నలిజం మన దేశానికి చాలా అవసరం అంటూ ట్వీట్ చేశారు. మీడియా చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని శశిథరూర్ కొట్టిపారేశారు. ముఖ్యంగా కేరళ చానళ్లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా నిజాలను ప్రతిబింబించని మీడియా అని అర్థం వచ్చేలా ప్లకార్డును తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఢిల్లీ పోలీసులు మీడియాకి చెప్పే ముందు తనను వివరణ అడిగి వుంటే బావుండేదని శశిథరూర్ ట్విట్ చేశారు. సునంద కేసులో సిట్ ఇప్పటికే ఆయనను రెండుసార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే. కాగా పోలీసుల అనుమతి లేనిదే ఢిల్లీ విడిచి వెళ్ళకూడదన్న నిబంధన ప్రకారం సిట్ దగ్గర ప్రత్యేక అనుమతి తీసుకున్న శశిథరూర్ తన సొంత నియోజవర్గం తిరువనంతపురం పర్యటనలో ఉన్నారు. -
థరూర్‌ను ప్రశ్నించిన సిట్
-
థరూర్‌ను ప్రశ్నించిన సిట్
సుదీర్ఘంగా నాలుగున్నర గంటల పాటు విచారణ సునంద కుమారుడు శివ్‌మీనన్ చెప్పిన అంశాలపై ఆరా న్యూఢిల్లీ: సునంద హత్య కేసులో ఆమె భర్త, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను ఢిల్లీ ప్రత్యేక పోలీసు బృందం గురువారం మరోసారి ప్రశ్నించింది. ఐపీఎల్ కోచి వ్యవహారంతో సునంద హత్య కేసుకు ముడిపడి ఉన్న సమాచారంపై పోలీసులు ఆరా తీశారు. థరూర్‌ను ఈ కేసులో ఇంతకుముందే జనవరి 19న సిట్ బృందం ప్రశ్నించిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం దక్షిణ ఢిల్లీలోని ఏఏటీఎస్ కార్యాలయంలో రెండు దఫాలుగా ఐదు గంటల పాటు శశిథరూర్‌ను పోలీసులు ప్రశ్నించారు. ఈ విచారణ రాత్రి వరకు కొనసాగింది. ఈ సమయంలో థరూర్ సహాయకులు బజ్రంగి, నారాయణ్ సింగ్, స్నేహితుడు సంజయ్దివాన్ను కూడా ప్రశ్నించినట్లు సమాచారం. థరూర్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఐపీఎల్ కోచి ఫ్రాంచైజీ వ్యవహారంలో జరిగిన అవకతవకలపై, రూ. 70 కోట్లను దుర్వినియోగం చేసిన ఆరోపణలపై ప్రధానంగా ఆరా తీసినట్లు తెలుస్తోంది. దీంతోపాటు అంతే సొమ్మును ఐపీఎల్ కోచిలో 19 శాతం వాటాగా సునందకు చెల్లింపులు జరగడంపైనా వివరాలు సేకరించినట్లు సమాచారం. -
సునంద కేసులో నేడు థరూర్ విచారణ
న్యూఢిల్లీ: సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి ఆమె భర్త శశిథరూర్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం ‘సిట్’ గురువారం మరోసారి ప్రశ్నించనుంది. సునంద తనయుడు శివ్మీనన్ను సిట్ బృందం ఇప్పటికే విచారించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు విచారించిన సాక్షుల వాంగ్మూలాలను విశ్లేషిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కొన్ని అంశాలకు సంబంధించి వివరణ కోసం శశిథరూర్‌ను విచారించనున్నట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ బి.ఎస్.బస్సి బుధవారం విలేకరులకు తెలిపారు. ఈ కేసును విచారిస్తున్న పోలీస్ బృందం ఇప్పటివరకు దాదాపు 15 మందిని ప్రశ్నించింది. శశిథరూర్ వ్యక్తిగత సిబ్బందితోపాటు ఆయన స్నేహితులను కూడా విచారించారు. మరోవైపు సునందకేసు విచారణలో జోక్యం చేసుకోవాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు బుధవారం కొట్టివేసింది. ఇందులో ప్రచారం కోసం తాపత్రయమే ఎక్కువగా కనిపిస్తోందని కాబట్టి ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేమంది. అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్‌జైన్ ఢిల్లీ పోలీస్ విభాగంలో ఐదుగురు అత్యంత సీనియర్ అధికారులతో ఏర్పాటైన ‘సిట్’ కేసు దర్యాప్తు చేస్తోందని కోర్టుకు తెలిపారు. -
శశిథరూర్‌ను ప్రశ్నించనున్న పోలీసులు
న్యూఢిల్లీ : సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో.. ఆమె భర్త, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను పోలీసులు గురువారం విచారించనున్నారు. బుధవారం శశిథరూర్ ఇంట్లో పనిమనిషి నారాయణ్‌ను పోలీసులు ప్రశ్నించారు. గత వారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు ఆమె కుమారుడు శివ్ మీనన్‌ను రెండుగంటలకు పైగా ప్రశ్నించినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో సునంద భర్త శశిథరూర్, ఆయన సిబ్బందిని మరోసారి ప్రశ్నించనున్నామని కూడా అప్పుడే తెలియజేశారు. గతేడాది జనవరిలో సునంద ఢిల్లీలోని ఓ హోటల్ లో అనుమానస్పద స్థితిలో మరణించారు. -
సునంద హత్య కేసులో శశిథరూర్ కు మళ్లీ సమన్లు?
న్యూఢిల్లీ: సునంద పుష్కర్ హత్య కేసులో ఆమె భర్త కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్‌కు ఢిల్లీ పోలీసులు మరోసారి సమన్లు పంపే అవకాశముంది. ఈ కేసులో థరూర్ ను త్వరలోనే ప్రశ్నించవ్చని ఢిల్లీ పోలీసులు తెలిపారు. సునంద హత్య కేసులో ఆయనను ఇదివరకే ఓసారి పోలీసులు విచారించారు. సునంద కుమారుడు శివ్ మీనన్‌ను ప్రశ్నించిన విషయం తెలిసిందే. గతేడాది జనవరిలో సునంద ఢిల్లీలోని ఓ హోటల్ లో అనుమానస్పద స్థితిలో మరణించారు. -
సునంద కుమారుడిని ప్రశ్నించిన పోలీసులు
న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు గురువారం ఆమె కుమారుడు శివ్ మీనన్‌ను ప్రశ్నించారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో మీనన్ దక్షిణ ఢిల్లీలోని వసంత్ విహార్‌లో ఉన్న సిట్ కార్యాలయానికి వచ్చారు. మీనన్‌ను రెండుగంటలకుపైగా ప్రశ్నించినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసును సునంద భర్త శశిథరూర్, ఆయన సిబ్బందిని మరోసారి ప్రశ్నించనున్నారు.