సిద్దిపేటకు 11 ఏళ్ల తరువాత మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి. సిద్ధిపేట మున్సిపాలిటీ ఎన్నికలకు ఆదివారం షెడ్యూల్ విడుదల చేశారు. సోమవారం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. రేపటి నుంచి 23 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. ఏప్రిల్ 6న పోలింగ్ నిర్వహించి 11న ఫలితాలు వెల్లడించనున్నారు. సిద్ధిపేట మున్సిపాల్టీలో మొత్తం 34 వార్డులున్నాయి.
ఆరు గ్రామ పంచాయతీ లను సిద్దిపేట మున్సిపాలిటీలో విలీనం చేయడానికి అనుకూలంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఇన్నాళ్లూ వాయిదా పడుతూ వస్తున్న సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికలకు మార్గం సుగమమైంది. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో ఆరు గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ గతంలో మున్సిపల్ శాఖ నోటిఫై చేసింది.
విలీన పంచాయతీల పరిధిలోని ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా.. మున్సిపాలిటీలో విలీనం చేశారంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. విలీన పంచాయతీల పరిధిలో ప్రజాభిప్రాయాన్ని సేకరించిన అధికారులు వివరాలను కోర్టుకు సమర్పించారు. వివరాలతో సంతృప్తి చెందిన హైకోర్టు స్టేను తొలగించింది. దీంతో ఎన్నికకు మార్గం సుగమమైంది.
సిద్దిపేట ఎన్నికల షెడ్యూల్ విడుదల
Published Sun, Mar 20 2016 12:48 PM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
Advertisement
Advertisement